సమాచారంతో సిద్ధంగా ఉండాలి
సమాచారంతో సిద్ధంగా ఉండాలి
Published Tue, Sep 20 2016 10:37 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ : విద్యాశాఖకు సంబంధించిన పూర్తి సమాచారంతో సన్నద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ ఎన్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం జేసీ తన చాంబర్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి బుధవారం సమీక్షించే విద్యాశాఖకు సంబంధించిన విద్యా, మాద్యమిక, ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీలు, సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం సంబంధిత అధికారులు నివేదికలు తయారు చేసుకుని సూచించారు. అదే విధంగా అదనపు తరగతి గదులు, రిపేర్లు, సీసీ కెమెరాలు తదితర పూర్తి వివరాలు అందుకు అవసరమైన నిధులపై సమీక్షించడం జరుగుతుందన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రిచే వివిధ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నందున సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పాఠశాల విద్యపై అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. సమావేశంలో ఏజేసీ వెంకట్రావ్, డీఆర్వో రవి, డీఈఓ చంద్రమోహన్, ఎస్‌ఎస్‌ఏ అధికారి కిరణ్, ఆర్‌ఐఓ, మైనార్టీ అధికారి పాల్గొన్నారు.
Advertisement