జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా..
జేసీగా బాధ్యతలు స్వీకరించిన కేవీఎన్ చక్రధర బాబు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు చేసి జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జేసీ కేవీఎన్ చక్రధరబాబు అన్నారు. జేసీగా బుధవారం బాధ్యత లు స్వీకరించారు. ఈ సందర్భంగా తన చాంబర్‌లో మాట్లాడారు. ప్రజలు, జిల్లాపై తనకు పూర్తి అవగాహన ఉందని, జిల్లా అధికారులను సమన్వయపరచి అభివృద్ధి దిశగా సాగుతామన్నారు. రెవెన్యూ, పౌర సరఫరాలు, భూసేకరణ శాఖల సేవలు ప్రజలకు అందేలా చూస్తానన్నారు. హుద్‌హుద్ తుపాను సమయంలో జిల్లాలో కొన్ని రోజులు పనిచేశానన్నారు.
అనంతరం కలెక్టర్ పిలక్ష్మినరసింహంను ఆయన కాంపు కార్యాలయంలో గౌరవ ప్రదంగా కలిశారు. తరువాత శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంను సందర్శించారు. నరగపాలక సంస్థకు ప్రత్యేకాధికారిగా జేసీయే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతక ముందు ఆయన అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి వారిని దర్శించుకున్నారు.
అభినందనలు తెలిపిన ఇన్‌చార్జి డీఆర్‌ఓ, రెవెన్యూ సిబ్బంది
కొత్తగా బాధ్యతలు జేపట్టిన జేసీకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సంచాలకులు, ఇన్‌చా ర్జి జిల్లా రెవెన్యూ అధికారి జీసీ కిశోర్‌కుమార్, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రామారావు, రెవెన్యూ సిబ్బంది అభినందనలు తెలి పారు. రాష్ట్ర ఎన్‌జీఓ అసోసియేషన్ సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు, జిల్లా ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంతు సారుురాంలు గౌరవ ప్రదంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.