laksminarasinham
-
11 మందితో ఏఎంఆర్డీఏ
సాక్షి, అమరావతి: ఏపీసీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ (ఏఎంఆర్డీఏ)ని ప్రభుత్వం 11 మందితో ఏర్పాటు చేసింది. చైర్‌పర్సన్‌గా పర్యావరణ మండలిలో సభ్యునిగా పనిచేసిన లేదా పట్టణ గవర్నెన్స్, ప్లానింగ్, రవాణా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన వ్యక్తిని నియమిస్తూ తరువాత ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇప్పటి వరకు ఏపీసీఆర్డీఏ కమిషనర్‌గా ఉన్న పి.లక్ష్మీనరసింహంను ఏఎంఆర్డీఏ కమిషనర్‌గా నియమిస్తూ శ్యామలరావు మరో జీవో జారీ చేశారు. ఏఎంఆర్డీఏలో సభ్యులు.. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి – డిప్యూటీ చైర్పర్సన్ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి – సభ్యుడు ఏఎంఆర్డీఏ కమిషనర్ –సభ్య కన్వీనర్ గుంటూరు జిల్లా కలెక్టర్ –సభ్యుడు కృష్ణా జిల్లా కలెక్టర్ – సభ్యుడు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ –సభ్యుడు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ –సభ్యుడు ఏపీ ట్రాన్స్‌కో ఎస్ఈ –సభ్యుడు ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ –సభ్యుడు రహదారులు భవనాల శాఖ ఎస్ఈ (గుంటూరు) –సభ్యుడు రహదారులు భవనాల శాఖ ఎస్ఈ (విజయవాడ) –సభ్యుడు -
ఇసుక రీచ్‌లను పరిశీలించిన కలెక్టర్
ఎచ్చెర్ల క్యాంపస్ : పొన్నాడ పంచాయతీ పరిధి నాగావళి నది ఇసుక రీచ్‌లను కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం పరిశీలించారు. తెప్పరేవు, ఎస్సీ కాలనీ రేవు, పాతపొన్నాడ, ముద్దాడపేటల్లో ఉన్న రీచ్‌లను శనివారం ఆయన పరిశీలించారు. రెవెన్యూ, గనుల శాఖ అధికారులతో అక్కడే సమీక్ష నిర్వహించారు. ఇక్కడ నుంచి చిలకపాలెం తదితర ప్రాంతాల్లో పోగులు వేసి ఇసుక ఇతర ప్రాంతాలకు అమ్ముతున్న విషయాన్ని సైతం చర్చించారు. స్థానిక అవసరాలకు మాత్రమే ఇసుక అమ్మకం చేపట్టాలని, అక్రమ వ్యాపారం నేరంగా చెప్పారు. అక్రమంగా తరలు తున్న ఇసుక రీచ్‌లపై గనుల శాఖ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ పెంచాలని సూచించారు. లేకుంటే అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
ఒడియా విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తాం
శ్రీకాకుళం అర్బన్: ఒడియా మీడియం విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మినరసింహం హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఒడియా టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో ఆదివారం విశ్రాంత డీఐ స్కూల్స్(ఒడియా) మహేష్ చంద్ర సామంత్ దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం మేధో సమ్మాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఒడియా మీడియంలో 77 ఖాళీలు ఉన్నాయని, వాటిని త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఇచ్ఛాపురంలో ఒడియా మీడియం విద్యార్థుల కోసం కేజీబీవీ స్కూల్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. ఒడియా టీచర్స్ అసోసియేషన్ కోసం జిల్లా కేంద్రంలో భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఒడియా మీడియం విద్యార్థులకు హిందీ కూడా ఒక సబ్జెక్టుగా ఉంటుందన్నారు. అనంతరం 39 ఏళ్లుగా డీఐ స్కూల్స్ (ఒడియా) గా సేవలందించిన మహేష్‌చంద్ర సామంత్ దంపతులకు ఆంధ్రప్రదేశ్ ఒడియా టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగామహేష్చంద్ర సామంత్ మాట్లాడుతూ ఒడియా భాషకు, విద్యార్థుల అభివృద్ధికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో తోడ్పడిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఒడియా మీడియంలో 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు కై వసం చేసుకున్న విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు(మేధో సమ్మాన్) అందజేశారు. 40 పాఠశాలలకు చెందిన 80 మంది విద్యార్థులకు మేథో సమ్మాన్ పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం డీఈవో డి.దేవానందరెడ్డి, విజయనగరం డీఈవో ఎస్.అరుణకుమారి, డిప్యూటీ ఈవోలు వి.ఎస్.సుబ్బారావు, ఎ.ప్రభాకరరావు, ఆంధ్రప్రదేశ్ ఒడియా టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.కె.మహాపాత్రో, బృందావన్ దులై, ఉపాధ్యక్షులు భాస్కర్ పాడి, బురాడో, ప్రతినిధులు డీపీ చౌదరి, ప్రమోద్‌కుమార్ పాడి, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా..
జేసీగా బాధ్యతలు స్వీకరించిన కేవీఎన్ చక్రధర బాబు శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు చేసి జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జేసీ కేవీఎన్ చక్రధరబాబు అన్నారు. జేసీగా బుధవారం బాధ్యత లు స్వీకరించారు. ఈ సందర్భంగా తన చాంబర్లో మాట్లాడారు. ప్రజలు, జిల్లాపై తనకు పూర్తి అవగాహన ఉందని, జిల్లా అధికారులను సమన్వయపరచి అభివృద్ధి దిశగా సాగుతామన్నారు. రెవెన్యూ, పౌర సరఫరాలు, భూసేకరణ శాఖల సేవలు ప్రజలకు అందేలా చూస్తానన్నారు. హుద్‌హుద్ తుపాను సమయంలో జిల్లాలో కొన్ని రోజులు పనిచేశానన్నారు. అనంతరం కలెక్టర్ పిలక్ష్మినరసింహంను ఆయన కాంపు కార్యాలయంలో గౌరవ ప్రదంగా కలిశారు. తరువాత శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంను సందర్శించారు. నరగపాలక సంస్థకు ప్రత్యేకాధికారిగా జేసీయే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతక ముందు ఆయన అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి వారిని దర్శించుకున్నారు. అభినందనలు తెలిపిన ఇన్చార్జి డీఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది కొత్తగా బాధ్యతలు జేపట్టిన జేసీకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సంచాలకులు, ఇన్చా ర్జి జిల్లా రెవెన్యూ అధికారి జీసీ కిశోర్‌కుమార్, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రామారావు, రెవెన్యూ సిబ్బంది అభినందనలు తెలి పారు. రాష్ట్ర ఎన్జీఓ అసోసియేషన్ సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు, జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంతు సారుురాంలు గౌరవ ప్రదంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. -
ఖాతాదారులకు మరిన్నిసేవలు అందిస్తాం
గూడూరు రూరల్ : ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సేవ లతోసాటు మరిన్ని సేవలను అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిండికేట్ బ్యాంక్ గూడూరు బ్రాంచ్ మేనేజర్ లక్ష్మీనరసింహం అన్నారు. సిండికేట్ బ్యాంక్ 89వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం బ్యాంకులో వ్యవ స్థాపక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు విద్యాసామగ్రితోపాటు స్వీట్లు పంచిపెట్టారు. ఆయన మాట్లాడుతూ 1925 అక్టోబర్ 20న కర్ణాటకలోని ఓ కుగ్రామంలో ప్రారంభించిన సిండికేట్ బ్యాంక్ ప్రస్తుతం 4 లక్షల కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తూ దేశంలో ప్రీమియర్లీడ్ బ్యాంకుల సరసన చేరిందన్నారు. గూడూరు శాఖ ఏర్పడి 30 సంవత్సరాలు అయిందని, రూ.75 కోట్ల వ్యాపారాన్ని చేస్తూ అటూ ప్రాధాన్యతా రంగానికి ఇటు ప్రజలకు అవసరమైన రుణాలను అందిస్తూ ముందంజలో ఉందన్నారు. ప్రస్తుతం గూడూరు శాఖ ద్వారా హౌసింగ్, వాహన రుణాలతోపాటు విద్యార్థులకు విద్యా రుణాలను అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకి బ్యాంకు నుంచి 1400 మంది రైతులకు రుణమాఫీకి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందజేశామన్నారు. ప్రజలు తమ బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. అలాగే ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్‌లో భాగంగా తోడ్పాటును అందించేందుకు బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ నిరంజన్‌రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ హరికృష్ణరెడ్డి, సిబ్బంది షరీఫ్, చంద్రమౌళి, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.