ఇసుక రీచ్‌లను పరిశీలించిన కలెక్టర్‌ | sand Reach Examining magistrate | Sakshi
Sakshi News home page

ఇసుక రీచ్‌లను పరిశీలించిన కలెక్టర్‌

Published Sun, Feb 26 2017 11:03 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

sand Reach Examining magistrate

ఎచ్చెర్ల క్యాంపస్‌ : పొన్నాడ పంచాయతీ పరిధి నాగావళి నది ఇసుక రీచ్‌లను కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహం  పరిశీలించారు. తెప్పరేవు, ఎస్‌సీ కాలనీ రేవు, పాతపొన్నాడ, ముద్దాడపేటల్లో ఉన్న రీచ్‌లను శనివారం ఆయన పరిశీలించారు. రెవెన్యూ, గనుల శాఖ అధికారులతో అక్కడే సమీక్ష నిర్వహించారు. ఇక్కడ నుంచి చిలకపాలెం తదితర ప్రాంతాల్లో పోగులు వేసి ఇసుక ఇతర ప్రాంతాలకు అమ్ముతున్న విషయాన్ని సైతం చర్చించారు. స్థానిక అవసరాలకు మాత్రమే ఇసుక అమ్మకం చేపట్టాలని, అక్రమ వ్యాపారం నేరంగా చెప్పారు. అక్రమంగా తరలు తున్న ఇసుక రీచ్‌లపై గనుల శాఖ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ పెంచాలని సూచించారు. లేకుంటే అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement