
'జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు చెప్పారు'
హైదరాబాద్ : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును లేక్వ్యూ అతిథిగృహంలో కలిశారు. తన వ్యాఖ్యలపై ఆయన ఈ సందర్భంగా చంద్రబాబుకు వివరణ ఇచ్చారు. 'రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఎవరికీ సానుభూతి లేదని, ఎన్ని చేసినా ప్రయోజనం కనిపించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలను సోమరిపోతుల్లా తయారు చేస్తోందని జేసీ దివాకర్ రెడ్డి గురువారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే'.
తాను ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిలను కించపరచలేదని, వ్యవస్థలో ఉన్న లోపాల గురించే మాట్లాడానని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు తనకు సూచించారని ఆయన తెలిపారు.