బాధ్యతలు స్వీకరించిన జేసీ | new Joint Collector Pulipati Koteswara Rao in Eluru | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన జేసీ

Published Thu, Jan 22 2015 4:36 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

బాధ్యతలు స్వీకరించిన జేసీ

బాధ్యతలు స్వీకరించిన జేసీ

 ఏలూరు :జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పులిపాటి కోటేశ్వరరావు బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఉద్యోగులంతా సమన్వయంతో పని చేయూలని కోరారు. పేదలకు సత్వర న్యాయం జరిగినప్పుడే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎన్జీవో, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు జాయింట్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. జిల్లా ఎన్జీవో అధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు జి.సోమశేఖర్, ఏలూరు ఎన్జీవో అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్, నాయకులు కె.రమేష్‌కుమార్, నరసింహమూర్తి, ఐవీఎస్‌ఎన్ రాజు, కె.సునీత, హరిబాబు జేసీకి పుష్పగుచ్ఛాలు ఇచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement