టెండర్లు ఖరారు చేస్తున్న జేసి రాంకిషన్
కృష్ణా పుష్కరాల్లో యాత్రికుల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు జేసీ ఎం.రాంకిషన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వీసీ హాల్‌లో ముఖ్యమైన 10 పుష్కర ఘాట్ల లో 150 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు టెండర్లు నిర్వహించారు.
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కృష్ణా పుష్కరాల్లో యాత్రికుల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు జేసీ ఎం.రాంకిషన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వీసీ హాల్‌లో ముఖ్యమైన 10 పుష్కర ఘాట్ల లో 150 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు టెండర్లు నిర్వహించారు. 20 మంది టెండర్లు దాఖలుచేయగా 15 తిరస్కరణకు గురయ్యాయి. ఐదు దరఖాస్తులు టెండర్లకు అర్హత సాధించాయి. అందులో తక్కువ ధరలకు సమ్మతించిన సంస్థలకు టెండర్లు ఖరారుచేశారు. టెండర్‌దారులు ప్రభుత్వ నిబంధనల మేరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏజేసీ రంజిత్‌ప్రసాద్, అడిషనల్ ఎస్పీ కల్మేశ్వర్ షింగేనవర్, డీఆర్వో భాస్కర్, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఇంజనీర్ రాములు, మల్లేశం పాల్గొన్నారు.