కలెక్టరేట్‌లో స్వచ్ఛభారత్
– అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులతో దోమలపై దండయాత్ర
– చీపురు పట్టి చెత్త ఊడ్చిన జేసీ
కర్నూలు(అగ్రికల్చర్): దోమలపై దండయాత్రలో భాగంగా శనివారం కలెక్టరేట్‌లో స్వచ్ఛ కార్యక్రమాలు పెద్దఎత్తున జరిగాయి. జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు జేసీ స్వచ్ఛ కార్యక్రమాలను పర్యవేక్షించడంతోపాటు స్వయంగా చీపురు పట్టి చెత్త ఊడ్చారు. కలెక్టరేట్‌లో ఎటుచూసినా చెత్త చెదారం పేరుకుపోయాయి. నిరంతరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ కర్నూలు అంటున్నా కలెక్టరేట్‌లో ఇప్పటి వరకు స్వచ్ఛత అనేదే లేకుండా పోయింది. దీనిని గుర్తించిన జేసీ అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులతో పెద్దఎత్తున స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టారు. కలñ క్టరేట్‌లోని అన్ని వైపులా కలియదిరిగి చెత్త చెదారాన్ని తొలగించారు. ఇక నుంచి ప్రతి శనివారం స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహిస్తామని జేసీ తెలిపారు. జేసీ–2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, సెక్షన్ సూపరింటెండెంట్లు రామాంజనమ్మ, ఈరన్న, ప్రియదర్శిని, భాగ్యలక్ష్మి, వ్యవసాయ శాఖాధికారులు మల్లికార్జునరావు, అనురాధరెడ్డి, శారద, గిరీష్, పణిశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.