మీ సేవ కేంద్రాల దరఖాస్తుకు తొలగిన అడ్డంకి | Eliminated obstacle application of Mee seva center | Sakshi
Sakshi News home page

మీ సేవ కేంద్రాల దరఖాస్తుకు తొలగిన అడ్డంకి

Published Tue, Aug 9 2016 12:10 AM | Last Updated on Tue, Oct 16 2018 3:38 PM

Eliminated obstacle application of Mee seva center

అనంతపురం అర్బన్‌:
 
పంచాయతీల పరిధిలో 158 మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. ఈ నెల 7న ‘‘వెబ్‌సైట్‌ లాక్‌’’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులతో మాట్లాడి సాంకేతిక అవాంతరాలు తొలగించినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.ap.mee seeva.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 158 మీ సేవ కేంద్రాలకు సంబంధించి  పంచాయతీల జాబితా వివరాలనుwww.anantapuramu.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement