
కరీంనగర్: పంద్రాగస్టు సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని మానకొండూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన పాకాల పురుషోత్తంరెడ్డి, పద్మజ దంపతులకు ప్రధాని నుంచి పిలుపు అందింది.
పురుషోత్తం రెడ్డి ప్రస్తుతం మానకొండూర్ ప్రగతి రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. జమ్మికుంట రైతు ప్రగతి, రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం చైర్మన్ సంద మహేందర్, కవిత దంపతులకు సైతం ఆహ్వానం అందినట్లు శనివారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment