Purushottam Reddy
-
సహజ వనరుల బ్యాలెన్స్‌షీట్స్ ఏవీ?
చట్టసభ ల్లో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందే సహజ వనరులకు సంబంధించిన బ్యాలెన్స్ ప్రకటించాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక కార్యకర్త ప్రొ.కె.పురుషోత్తం రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నేతగా వ్యవహరించిన ఆయన ఆ తర్వాత అదే వర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా, హెచ్ఓడీగా, చైర్మన్ బోర్డ్ఆఫ్ స్టడీస్‌గా, ఓయూ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డైరెక్టర్‌గా సేవలందించారు. 1990కు ముందు నుంచే వివిధరూపాల్లో పెరుగుతున్న వాయు, నీరు, వాతావరణ కాలుష్యాలపై గొంతెత్తి పోరాడారు. నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాలను వెలికితీసే ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇతర సంస్థలతో కలిసి పోరాడి విజయం సాధించారు. పర్యావరణ అంశాలతో పాటు వర్తమాన రాజకీయ పరిస్థితులపై సాక్షి ఇంటర్వ్యూలో తనదైన శైలిలో సూటిగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లో.... - ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి పబ్లిక్ డొమైన్ లో ఆ వివరాలు ఎక్కడ ? ప్రతీ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టే ముందు పార్లమెంట్‌కు సహజ వనరుల బ్యాలన్స్ షీట్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు.పబ్లిక్ డొమైన్లో ఈ వివరాలు పెట్టాల్సి ఉన్నా ఎక్కడా ఆ సమాచారం లేదు. ప్రజలకు ఈ వివరాలు తెలిస్తేనే కదా.. ఆయా అంశాలపై అవగాహన ఏర్పడి చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. దేశంలోని సహజవనరులు, ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి పరిస్థితి ఏమిటని తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, లోకాయుక్తలు ఏ విధంగా పని చేయగలుగుతాయి. పేరుకు మాత్రమే నీతి ఆయోగ్ (గతంలో ప్రణాళికా సంఘం) వంటివి ఉన్నా... సహజ వనరుల తరుగుదల ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా దేశాభివృద్ధిని, పురోగతిని ఎలా అంచనా వేస్తాయి? రైతులకు అందజేయాల్సిన ఆధునిక సాంకేతికత, దాని ద్వారా సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను అస్సలు పట్టించుకోవడం లేదు. సేంద్రియ వ్యవసాయం, సహజ వ్యవసాయ పద్ధతులు, సహజవనరుల పరిరక్షణపై ఎలాంటి దిశానిర్దేశం లేకుండా పోయింది. ఇసుక రవాణా తీవ్రమైన పర్యావరణ సమస్య... అన్ని రాష్ట్రాల్లో సహజవనరు ఇసుక యథేచ్ఛగా దోపిడీకి గురవుతోంది. ఇసుక, గుట్ట లు, కొండలు, అడవి, ఇతర సహజవన రులు దేశప్రజల ఉమ్మడి ఆస్తి. అధికారంలో ఉన్న పార్టీ ఇష్టారీతిన తవ్వి అమ్ముకోడానికి కాదు. వాగుల్లో ఇసుక లేక పోతే నీరు రీచార్జ్ కాదు. గుట్టలు తొలగిస్తే దాని ప్రభా వం కూడా పర్యావరణ వ్యవస్థపై పడుతుంది. అధికార పార్టీ నేతలకు ఆర్థికంగా ప్రయోజనం కలిగించే చర్యలు పేదల పాలిట శాపాలుగా మారుతున్నాయి. స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి ప్రస్తుతం రాజకీయపరమైన అధికారాలన్నీ కూడా అధికారంలో ఉన్న పార్టీల వద్ద కేంద్రీకృతమై ఉన్నాయి. రాజ్యాంగపరంగా గ్రామీణ స్థానిక సంస్థలు, పట్టణ స్ధానిక సంస్థల వంటి స్థానిక ప్రభుత్వాలకు కొన్ని అధికారాలు కేటాయించారు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆధిపత్యం చెలాయించకుండా హక్కుల రక్షణకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు (ఎస్ఈసీ) ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఎస్ఈసీలకు అప్పగించినా..అవి రాష్ట్ర ప్రభుత్వాలను ఎదిరించి, స్వతంత్రంగా పనిచేసే స్థాయికి ఎదగలేదు. తమ పరిధిలో నిష్పక్షపాత నిర్ణయాలు కూడా తీసుకోలేని స్థితిలో వున్నాయి. అవి రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలో పనిచేసే శాఖలుగా మారిపోవడం విషాదకరం. రాజ్యాంగానికి అనుగుణంగా కాకుండా ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలు లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ వంటివి కేవలం ఆకారపుష్టిగానే మిగిలిపోయాయి. ఇక సమాచారహక్కు కమిషనర్ల నియామకమే జరగడం లేదు. రాజ్యాంగానికి అనుగుణంగా కాకుండా రాష్ట్రప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఇలాంటి ముఖ్యమైన అంశాలు చర్చకు రావడం లేదు. కులం,మతం, ప్రాంతం వంటి విషయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి చర్చను పక్కదోవ పట్టిస్తున్నారు. గతంతో పోలి్చతే ఇప్పుడు ప్రజాసమస్యలనేవి ఏమాత్రం ప్రధానచర్చకు రావడం లేదు. ఎన్నికల్లో సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి ఉందా ? ఎన్నికలనేవి ఎమ్మెల్యేల అభ్యర్థులకు వ్యాపారంగా మారిపోవడం విషాదకరం. రాజకీయపార్టీలు కూడా సిగ్గులేకుండా ఎన్నికోట్లు ఖర్చుచేస్తారనే దాని ప్రాతిపదికన అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బు పాత్ర విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు అసలు పోటీ చేయాలని కనీసం ఆలోచన చేసే, సాహసించే పరిస్థితులే లేకుండా పోయాయి. సుస్థిర అభివృద్ధిపై హామీ ఏదీ? అటు కేంద్ర, ఇటు రాష్ట్రప్రభుత్వాలు దేశ, రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి గురించి స్పష్టమైన హామీలు ఇవ్వకపోతే ఎలా? సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించిన ప్యారిస్ అగ్రిమెంట్లో సంతకం పెట్టి భారత్ భాగస్వామి అయినా...వాటిని సాధించే దిశలో మాత్రం అడుగులు వేయకపోవడం విచారకరం. ఈ విషయంలో మన దేశం వ్యవహారశైలి తీసికట్టుగా ఉంది. పర్యావరణ అంశాలపై .. దేశంలో ప్రవహించే ప్రతీ నదిలో ప్రవహించే నీరు విషతుల్యంగా మారుతోంది. వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకోవడంతో...వాయునాణ్యత తీసికట్టుగా మారి దేశవ్యాప్తంగా పీల్చే గాలి విషంగా మారుతోంది. జీవవైవిధ్యమే పూర్తిస్థాయిలో దెబ్బతింటోంది. దీంతో మొత్తం దేశమే ఓ గ్యాస్‌చాంబర్‌గా మారుతోంది. ఈ అంశాలేవి కూడా అటు లోక్‌సభ ఎన్నికల్లో, ఇటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా చర్చనీయాంశం కావడం లేదు. అసలు ఈ సమస్యలకు ప్రాధాన్యత లేదన్నట్టుగా రాజకీయపార్టీలు పట్టించుకోవడం లేదు. -కె. రాహుల్ -
పర్యావరణ విధ్వంసంతోనే వాతావరణ మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పర్యావరణ విధ్యంసం కారణంగానే వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా అతి తక్కువ సమయంలో భారీ వర్షాలు, తీవ్రమైన తుపానులు వంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇప్పటి నుంచి రేయింబవళ్లు యుద్ధప్రాతిపదికన శ్రమిస్తే తప్ప పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేని పరిస్థితి ఉందని... తక్షణమే శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం పెరగాలని పురుషోత్తమ్‌రెడ్డి సూచించారు. ఆదివారం ఢిల్లీలోని ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేపిటల్ ఫౌండేషన్ సంస్థ ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్‌ను అందించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ డా. సీవీ ఆనందబోస్ చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, అటార్నీ జనరల్ ఆర్.వెంకట రమణి, జస్టిస్ ఏకే పట్నాయక్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తంరెడ్డితో పాటు సామాజికంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురికి అవార్డులు అందించారు. ఈ సందర్భంగా పురుషోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణం, సుస్థిరాభివృద్ధి రంగంలో గత 50 ఏళ్లుగా తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించిందన్నారు. మన దేశంలో పర్యావరణ చట్టాలు బాగున్నప్పటికీ... వాటి అమలు మాత్రం సరిగా జరగడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక యంత్రాంగాలను నిర్వీర్యం చేస్తున్నాయని.. ఇసుక వంటి ప్రకృతి వనరుల దోపిడీని అరికట్టాల్సింది స్థానిక యంత్రాంగాలేనని తెలిపారు. భారత్‌లో అంతులేని సౌరశక్తి ఉందని, దానిని ఉపయోగించుకోవడం ద్వారా సంప్రదాయ ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన సూచించారు. -
'పంద్రాగస్టు'కు ప్రధాని నుంచి పిలుపు
కరీంనగర్: పంద్రాగస్టు సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని మానకొండూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన పాకాల పురుషోత్తంరెడ్డి, పద్మజ దంపతులకు ప్రధాని నుంచి పిలుపు అందింది. పురుషోత్తం రెడ్డి ప్రస్తుతం మానకొండూర్ ప్రగతి రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. జమ్మికుంట రైతు ప్రగతి, రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం చైర్మన్ సంద మహేందర్, కవిత దంపతులకు సైతం ఆహ్వానం అందినట్లు శనివారం తెలిపారు. -
ఏసీపీ నేతృత్వంలో నవీన్ హత్యకేసు దర్యాప్తు
అబ్దుల్లాపూర్‌మెట్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్యకేసులో దర్యాప్తు అధికారిగా వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయన నేతృత్వంలో పలు పోలీసు బృందాలు లోతుగా దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలను రాబట్టే పనిలో నిమగ్నమయ్యాయి. ఘటన జరిగిన ప్రదేశానికి కొద్దిదూరంలోనే విజయవాడ జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు ఉన్నాయని.. వాటిని పరిశీలిస్తే నవీన్, హరిహరకృష్ణతోపాటు ఇంకా ఎంతమంది అక్కడికి వ చ్చారనేది తేలనున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఇక నవీన్‌ను హత్య చేసిన ప్రాంతానికి దగ్గరగా ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట, బాటసింగారం ప్రాంతాలపై హరిహరకృష్ణకు ముందే స్పష్టమైన అవగాహన ఉన్నట్టు భావిస్తున్నారు. శివారు ప్రాంతాలు కావడం, పదుల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటంతో.. నిర్మానుష్య ప్రాంతాలను ఎన్నుకుని గుట్టుచప్పడు కాకుండా గంజాయి, డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్టు సమాచారం. నవీన్, హరిహరకృష్ణ, వారి స్నేహితులు గతంలో గంజాయికోసం ఈ ప్రాంతాలకు వచ్చి ఉంటారని, ఈ క్రమంలోనే హత్యకు నిర్మానుష్య ప్రాంతాన్ని సులువుగా ఎంచుకుని ఉంటాడని భావిస్తున్నారు. నిందితుడి కస్టడీ కోసం నేడు పిటిషన్ ఈ కేసులో నిందితుడు హరిహరకృష్ణను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు సోమ వారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ హత్యకు సంబంధించి హరిహరకృష్ణ, నవీన్ స్నేహితులను కూడా విచారించనున్నట్టు సమాచారం. నవీన్‌ను హత్య చేసిన హరిహరకృష్ణ.. ఆ తర్వా త నవీన్ స్నేహితులతో ఫోన్లో మాట్లాడిన ఆడి యో రికార్డులు బయటికి వచ్చాయి. హరిహరకృష్ణ హత్యకు పాల్పడిన ఆందోళన, భయం వంటివేమీ లేకుండా మాట్లాడిన తీరు విస్మయానికి గురిచేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి అన్నకూ నేర చరిత్రే.. ఖిలా వరంగల్: స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన హరిహరకృష్ణ స్వస్థలం వరంగల్‌లోని కరీమాబాద్ ప్రాంతం. తండ్రి స్థానికంగా ఆర్ఎంపీ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. హరిహరకృష్ణ అన్న ముఖేశ్ గతంలో ఓ హత్యానేరంలో జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు హరిహరకృష్ణ తాను ప్రేమించిన యువతి కోసం స్నేహితుడిని దారుణంగా హత్యచేయడం కరీమాబాద్ ప్రాంతంలో కలకలం రేపింది. నవీన్ తల్లిదండ్రులు మమ్మల్ని క్షమించాలి ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే అమ్మా యిని ప్రేమించడం దురదృష్టకరమని.. అయి నా తప్పు చేసినవారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని నిందితుడు హరిహరకృష్ణ తండ్రి పేరాల ప్రభాకర్ పేర్కొన్నారు. తన కొడుకును ఉన్నతంగా చూడాలని అనుకున్నానని, కానీ ఇలా అవుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును తానే స్వయంగా పోలీసులకు అప్పగించానని వివరించారు. నవీన్ తల్లిదండ్రులకు తీరని లోటు జరిగిందని.. వారు తన కుటుంబాన్ని పెద్ద మనసుతో క్షమించాలని విజ్ఞప్తి చేశారు. -
తుంగభద్రను రక్షించుకుందాం
తిరుపతి అర్బన్: కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర ప్రాజెక్టుపై ఎగువభద్ర పేరుతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తుండడం రాయలసీమకు శాపంగా మారనుందని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఎస్వీ ఇంజనీరింగ్ కశాశాలలో శుక్రవారం ‘తుంగభద్రను కాపాడుకుందాం– సిద్దేశ్వరం అలుగుతో మనసీమను సస్యశ్యామలం చేద్దాం’ అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాయలసీమకు కీలకమైన తుంగభద్ర ప్రాజెక్టును కాపాడుకోవడం కోసం విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తుంగభద్రకు సంబంధించి బచావత్ నీటి కేటాయింపులు లేకపోయినా, సుప్రీంకోర్టులో స్టే ఉన్నా ఎగువ రాష్ట్రం అయిన కర్ణాటక నిబందనలు ఉల్లంఘించి తుంగభద్ర ప్రాజెక్టుపై ఎగువన ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడం దుర్మార్గమని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదం వచ్చినప్పుడు పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా రాయలసీమకు అన్యాయం చేస్తూ కర్ణాటకలో అనుమతులు లేని ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమే కాకుండా నిధులు మంజూరు చేయడం అన్యాయమన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలపాలని సదస్సులో తీర్మానించారు. ఆచార్య జయచంద్రా రెడ్డి, ఆచార్య సుబ్రమణ్యం, ఆచార్య నరేన్ కుమార్, ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
అప్పర్‌భద్రతో రాయలసీమకు నీటి గండం
సాక్షి,అమరావతి/తిరుచానూరు(తిరుపతి జిల్లా): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీ పట్ల చూపుతున్న వివక్షతతో రాయలసీమకు తీవ్ర నీటిగండం ఎదురయ్యే ప్రమాదం ఉందని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వీ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో మంగళవారం ఫోరం ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి, ప్రయాగతో కలిసి పురుషోత్తంరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పర్ భద్రను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటన చేస్తూ నిధులు మంజూరు చేయడం అన్యాయమన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారుతుందని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చట్టబద్ధత లేని ఎగువ భద్రను నిలువరించాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా జాతీయ హోదాను ప్రకటించడం ద్వారా ఫెడరల్ స్ఫూర్తిని తంగలో తొక్కిందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై సమష్టి పోరాటం సాగించాలన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఏపీకి చెందిన సభ్యులు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. కాగా, ఎగువన ఉన్న కర్ణాటక తుంగభద్రపై అదనంగా మరో ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే దిగువనున్న రాయలసీమలోని తుంగభద్రపై నికర జలాలు కలిగి ఉన్న ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీ, కేసీ కెనాల్, గుండ్రేవుల ప్రమాదంలో పడతాయి. కృష్ణా నదిలో ప్రవాహం తగ్గి తుంగభద్ర నీరే ప్రధానం అవుతున్న నేపథ్యంలో కర్ణాటక నిర్మించే ఎగువ భద్రతో గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీలకు సైతం ప్రమాదం ఏర్పడుతుంది. -
సేవ్ వాటర్
చేతులు కడగడానికి ట్యాప్ తిప్పుతాం. చేతిలో పట్టేటంతటి ధారతో సంతృప్తి చెందం. పూర్తిగా ఓపెన్ చేస్తాం. ఒక్కసారిగా నీరు ధారాపాతంగా వచ్చి దోసిట్లోకి పడిపోవాలన్నంత ఆత్రం. చేతులు కడుక్కోవడం పూర్తయ్యే సరికి కనీసంగా ఇరవై సెకన్ల సేపు ట్యాప్ రన్నింగ్‌లో ఉంటుంది. అంత సమయంలో సింక్‌లోకి జారిపోయే నీరెంత ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? నాలుగు లీటర్లకు తక్కువ ఉండదు. ఆశ్చర్యంగా ఉన్నా సరే ఇది నిజం. ‘ట్యాప్ పూర్తిగా తిప్పవద్దు. ఎంత కావాలో అంతవరకే ఓపెన్ చేయండి’ అని ఇంట్లో వాళ్లకు చెప్పి చెప్పి విసిగిపోయింది లలితాంబ విశ్వనాథయ్య. అందుకే ఓ చిన్న సాధనంతో నీరు తగినంత మాత్రమే వచ్చేటట్లు ట్యాప్‌కు ఉచ్చు బిగించింది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే అవుట్ నివాసి లలితాంబ. నీటివృథాను అరికట్టడానికి ఆమె వాటర్ ఏరియేటర్, వాటర్ రిస్ట్రిక్టర్లకు రూపకల్పన చేసింది. వీటిని అమర్చడం ద్వారా నీటి వాడకం మూడవ వంతుకు తగ్గిపోతుంది. సాధారణంగా ఓ కొత్త ఆవిష్కరణ మనిషి జీవనశైలిని ఆధునీకరించడం కోసమే ఉంటుంది. వాటికి మార్కెట్లో మంచి ఆదరణ కూడా లభిస్తుంది. లలితాంబ రూపొందించిన సాధనాలు సామాజిక ప్రయోజనార్థం పని చేస్తాయి. ప్రకృతి పరిరక్షణ, వనరుల సంరక్షణలో కీలకమైన పాత్ర వహిస్తాయి. వాటర్ బాటిల్ లేదు! ‘నీరు అనేది చాలా విస్తృతమైన సబ్జెక్ట్. నదుల సంరక్షణ, పరిశుభ్రతనే ప్రధానంగా చూస్తాం, కానీ పర్యావరణ పరిరక్షణ నుంచి దైనందిన జీవనం వరకు అడుగడుగునా అది కీలకమైన అంశమే’ అంటారు ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి. ‘‘నాకు ఎనభై ఏళ్లు. నా బాల్యంలో స్కూలుకెళ్లేటప్పుడు నీటిసీసా తీసుకెళ్లడం మాకు తెలియదు. దారిలో రోడ్డు పక్కన కనిపించిన నల్లా తిప్పి చేయి పట్టి దాహం తీరే వరకు తాగేవాళ్లం. ఎంతో ఆరోగ్యంగా పెరిగాం. నీటి కాలుష్యం అనే పదమే తెలియదప్పట్లో. మా ఇంట్లో బావి ఉండేది. వర్షాకాలంలో అయితే బకెట్‌కు తాడు కట్టి మూడు– నాలుగు అడుగుల లోతులో ఉన్న నీటిని ముంచుకోవడమే. ఎండాకాలంలో అదే బావిలో నీరు ఇరవై అడుగుల లోతుకి వెళ్లేది. భూగర్భ జలాల కనీస స్థాయులంటే ఇరవై అడుగులే. హైదరాబాద్ చుట్టూ వందల చెరువులు, కుంటలు ఉండేవి. క్రమంగా ఒక్కొక్కటీ మాయమవుతున్నాయి. నీటిచుక్క పాతాళానికి పోయింది. నీటి జాడ కోసం నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతుకు బోర్లు వేస్తున్నారు. నీటిని అవసరానికి మించి వాడడం అంటే సహజ వనరులను వృథా చేయడమే. ఈ మధ్య ప్రభుత్వం జారీ చేసిన 111 జీవో మీద కూడా మేము అభ్యంతరం తెలియచేశాం. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ మంచి నీటి రిజర్వాయర్లు కూడా ఈ జీవో ఫలితంగా హుస్సేన్‌సాగర్ లాగానే మారిపోతాయని హెచ్చరించాం. భావి తరాలకు అందాల్సిన సహజ వనరులను విచక్షణ రహితంగా వాడేసే హక్కు ఎవరికీ ఉండదు. మనదేశంలో జలకాలుష్యనిరోధానికి ‘వాటర్ యాక్ట్ ఆఫ్ 1974’ అనే చట్టం ఉంది. దానిని అమలు చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఏర్పాటైంది. ఎన్ని చట్టాలున్నా సరే... మన దగ్గర నీటి సంరక్షణ విషయంలో సమన్వయలోపంతోనే పనులు జరుగుతున్నాయి. ఫ్యాషన్ ఉత్పత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మార్కెట్లోకి రాగానే కొనేస్తారు. కాని, ఇలాంటి సమాజహితమైన, పర్యావరణ పరిరక్షణ సహితమైన వాటర్ రిస్ట్రిక్టర్లను వాడమని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తోంది’’ అని ఆవేదనగా అన్నారాయన. ప్రతిజ్ఞ చేద్దాం! నీటి వనరులను పరిరక్షించుకోవడం అనగానే భూగర్భ జలాలు పెరిగి ఎండిపోయిన బావుల్లోకి నీరు చేరడం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి పెద్ద విషయాల మీదనే చర్చ జరుగుతుంటుంది. కానీ... ఇంట్లో మనం వాడే ప్రతి నీటి చుక్కనూ గౌరవించుకోవాలి. ‘ఆహారాన్ని వృథా చేయము’ అని ప్రతిన పూనుతున్నాం. అలాగే నీటిని వృథా చేయను అని కూడా ఎవరికి వాళ్లు మనసులోనే ప్రతిజ్ఞ చేసుకోవాలి. అప్పుడు లీకవుతున్న ట్యాప్‌ను చూసినప్పుడు దానిని కట్టేసేవరకు మనసు ఊరుకోదు. ట్యాప్ లీకవుతుంటే ఒక్కో చుక్కే కదా అని తేలిగ్గా తీసుకోవడం జరగదు. గమనించిన తక్షణమే ట్యాప్ మారుస్తాం. ఒక్కో చుక్క నీరు కారుతున్న ట్యాప్ నుంచి ఇరవై నాలుగ్గంటల్లో ఎనభై లీటర్ల నీరు వృథా అవుతుంది తెలుసా! ఇది నిజం... నమ్మండి! వాటర్ రిస్ట్రిక్టర్ ధర వంద రూపాయలకు మించదు. దీని ద్వారా నీటి వృథాను అరికట్టగలుగుతాం. నిమిషానికి నాలుగు లీటర్ల చొప్పున ఆదా చేయగలుగుతాం. కాలేజ్‌లు, కల్యాణమండపాల వంటి చోట నెలకు సరాసరిన పదిహేను వేల లీటర్ల నీరు ఆదా అవుతుంది. – లలితాంబ, వాటర్ రిస్ట్రిక్టర్ రూపకర్త మహిళలే సంరక్షకులు మహిళలు స్వచ్ఛందంగా స్పందిస్తేనే నీటి సమస్య అదుపులో ఉంటుంది. మన కిచెన్‌లో ట్యాప్ తిప్పగానే నీరు ధారగా ప్రవహిస్తోందంటే... దాని వెనుక కనిపించని శ్రమ ఎంతో ఉంటుంది. నదుల జన్మస్థానాలైన కొండల మీద నుంచి మన ఇంటికి వస్తున్నాయనే విషయాన్ని మర్చిపోకూడదు. కొండ శిఖరం నుంచి మన ఇంటి ట్యాప్‌కు చేరడానికి మధ్య ఎంత మెకానిజం పని చేస్తోందో గమనించాలి. మీ పిల్లల కోసం ఎన్నెన్నో ఆస్తులను కూడబెడుతుంటారు, అంతకంటే విలువైన ఆస్తి నీరు. ఆ నీటిని వృథా చేయకండి. ఎండిన భూమిని కాదు, చల్లని భూమిని భావితరాలకు వారసత్వంగా ఇవ్వండి. – ప్రొ‘‘ కె. పురుషోత్తమ్‌రెడ్డి, పర్యావరణవేత్త – వాకా మంజులారెడ్డి -
హైకోర్టు, నీటిప్రాజెక్టులు రాయలసీమకు అవసరం
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): రాష్ట్ర ప్రయోజనాల పేరిట ఇప్పటికే రెండుసార్లు రాజధానిని కోల్పోయామని, మరోసారి ఇందుకు సిద్ధంగా లేమని రాయలసీమ మేధావుల ఫోరం పేర్కొంది. రాయలసీమకు హైకోర్టు రావాలని, నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరారు. తిరుపతిలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో రాయలసీమ మేధావుల ఫోరం ‘అభివృద్ధి వికేంద్రీకరణ–రాయలసీమ ప్రయోజనాలు’ అనే అంశంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించింది. ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను ఉపసంహరించుకుని, నూతనంగా సమగ్ర అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని చెప్పారు. రాయలసీమకు ప్రయోజనాలు కలిగేలా బిల్లులో ఎలాంటి అంశాలు ఉండాలన్న అంశంపై చర్చ జరగాలని అన్నారు. అమరావతి ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కూలంకష చర్చ జరగాలని తెలిపారు. అమరావతి రైతులు భూములిచ్చింది వారి ప్రయోజనాల కోసమేనని చెప్పారు. దానిని త్యాగం అంటూ, రాష్ట్రం కోసం అంటూ విచిత్ర వాదనలు తెస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణం కోసం, రైతులకు ఇవ్వాల్సిన భూమి పోను మిగిలిన భూమి 10 నుంచి 15 వేల ఎకరాల దాకా ఉంటుందన్నారు. అందులో గత ప్రభుత్వం ప్రైవేటు, విదేశీ సంస్థలకు ఇచ్చినప్పుడు అభ్యంతరం తెలపలేదని, ఇప్పుడు 5 వేల ఎకరాల్లో విజయవాడ, గుంటూరు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. అక్కడ పేదల ఇళ్లు ఉంటే వారి ప్లాట్లకు మంచి మార్కెట్ ఉండదనే బెంగే కారణమన్నారు. తీవ్ర కరువు, నీటి సమస్యతో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు నేడు కావాల్సింది మరో కొత్త నగరంతో కూడిన రాజధాని నిర్మాణం కాదన్నారు. ఉన్న పరిమిత వనరులతో నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అవసరమని చెప్పారు. తిరుపతి, హిందూపురం నగరాలను ఐటీ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఎస్వీయూ విశ్రాంత ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పాలన సాగిస్తోందని, అలాంటి సమయంలో అన్ని వ్యవస్థలు ఒకేచోట ఉండాలని కోరుకోవడం సరికాదని అన్నారు. అమరావతి కేంద్రంగా కేంద్రీకృత అభివృద్ది జరిగితే మరో విభజన తప్పదని హెచ్చరించారు. అధ్యాపకులు సుబ్రమణ్యం ఆచారి, హిమబిందు, విద్యార్థులు పాల్గొన్నారు. -
క్రమబద్దీకరణతో అడవికి ముప్పు..!
సాక్షి, హైదరాబాద్: పోడు భూముల క్రమబద్దీకరణతో ఆక్రమణలు మరింత పెరిగే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోడు ఆక్రమణలకు హక్కులు కట్టబెట్టేందుకు ఆక్రమణదారులు, చట్ట ఉల్లంఘనుల నుంచి దరఖాస్తుల స్వీకరణ సరైంది కాదని వారు అభ్యంతరం చెబుతున్నారు. ఇది మళ్లీ భూపోరాటాలు, భూకబ్జాలకు కారణమవుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదు ఏళ్లుగా అమలు చేస్తున్న కఠిన వైఖరితో అటవీ ఆక్రమణలు గణనీయంగా తగ్గడమేగాక, 2% దాకా పచ్చదనం పెరిగినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆక్రమణల్లోని వేలాది ఎకరాలను అటవీ శాఖ తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో పోడు సమస్యకు పరిష్కారం పేరిట ప్రభుత్వం చేస్తున్న కొత్త ఆలోచనలపై పలువురు పర్యావరణవేత్తలు భిన్నాభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే... పర్యావరణానికి పెద్దదెబ్బ... పర్యావరణం, అడవులు, జీవవైవిధ్య పరిరక్షణ వంటి అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. పోడు క్రమబద్ధీకరణ పేరిట అటవీ ఆక్రమణలకు సర్కార్ పచ్చజెండా ఊపడం పర్యావరణానికి పెద్దదెబ్బ. అడవి, జీవావరణాలతో గిరిపుత్రులకు ఉన్న బంధం.. తల్లీబిడ్డల మధ్యనున్న సంబంధం లాంటిది. ఆక్రమణలు, మైనింగ్, పోడు.. ఇతర రూపాల్లో అడవి క్షీణించినా అది బలహీనమవుతుంది. అటవీ ప్రాంతం తగ్గినా, సన్నగిల్లినా ఆదివాసీలపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. – ప్రొ. కె.పురుషోత్తంరెడ్డి, పర్యావరణ నిపుణులు ఆక్రమణలను సక్రమం చేయడం సరికాదు.. పోడు భూముల క్రమబద్ధీకరణ పేరిట అటవీ ఆక్రమణలను సక్రమం చేయడం సరికాదు. 2006కు ముందే పోడు భూములను వాటిని సాగు చేసుకునే వారికి ఇవ్వాలని, సంబంధిత కుటుంబం మూడు తరాలు వ్యవసాయం చేస్తేనే హక్కులు కల్పించాలని కేంద్ర చట్టంలో ఉంది. మళ్లీ ఇప్పుడు గత 15 ఏళ్ల ఆక్రమణలను క్రమబద్దీకరిస్తామనేది అడవుల విధ్వంసమే. గిరిజనుల ఉపాధి, పునరావాసానికి పోడు అనేదే ప్రధానమైనది కాదు. భూమి కోసం అడవులను ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. అభివృద్ధి కార్యక్రమాలు, ఐటీడీల ద్వారా ఆదివాసీ, గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు అన్వేషించాలి. విద్యాకల్పన, నైపుణ్యాల శిక్షణ, మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన వంటివి చేయాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేస్తున్న కుట్రగా భావించాలి. – పొట్లపెల్లి వీరభద్రరావు, పర్యావరణవేత్త గిరిజనేతరుల ఆక్రమణలు పెరుగుతాయి... పోడు క్రమబద్ధీకరణను అడ్డం పెట్టుకుని మళ్లీ అటవీ ఆక్రమణలు ఊపందుకోవడం ఖాయం. ఇది అటవీ, పర్యావరణ పరిరక్షణకు తీరని నష్టం. తేనేతుట్టె లాంటి ఈ అంశాన్ని మళ్లీ కదపడం మంచిదికాదు. భూములను క్రమబద్దీకరిస్తామన్న ప్రతీసారి పట్టాలు లభిస్తాయనే ఆశతో గిరిజనేతరుల ఆక్రమణలు పెద్ద ఎత్తున పెరిగాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ సమస్య పరిష్కారం కాకపోగా మరింత తీవ్రమౌతుంది. మళ్లీ పోడు ఆక్రమణల క్రమబద్దీకరణకు అవకాశమివ్వడం వల్ల నేడు కాకపోతే రేపు పట్టాలొస్తాయనే ఆశతో ధైర్యంగా కొత్త ఆక్రమణలకు దిగుతారు. – ఇమ్రాన్ సిద్ధిఖీ, వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ బయాలజిస్ట్ -
ఐఏఎస్ సత్యనారాయణ అవినీతిపై ఫిర్యాదు
ఎమ్మిగనూరు టౌన్: గతంలో కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సత్యనారాయణ అవినీతి, అక్రమ సంపాదనపై ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)తోపాటు సీబీఐ డైరెక్టర్‌కు బీజేపీ రాష్ట్ర నేత, ఆలిండియా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి.పురుషోత్తంరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన శనివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌గా రెండున్నరేళ్లపాటు పనిచేసిన సత్యనారాయణ అప్పటి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ తోపాటు కేఈ కృష్ణమూర్తి పేరుతో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. అప్పట్లో పీఎంఏవై కింద కర్నూలుకు ఆరువేల గృహాలు, నంద్యాలకు 4,500, ఆదోనికి 4,700, ఎమ్మిగనూరుకు వెయ్యి గృహాలు మంజూరయ్యాయన్నారు. వీటి నిర్మాణ కాంట్రాక్టు పొందిన షాపూర్జీ పల్లోంజి కంపెనీ నుంచి తమిళనాడుకు చెందిన వాసన్ అండ్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్‌ను సత్యనారాయణ ఇప్పించి లబ్ధి పొందారన్నారు. అంతేగాక వాసన్ అండ్ కంపెనీకి ఇసుక సరఫరాకోసం తన సోదరుడి కుమారుడు మురళి, బంధువు శ్రీనివాస్‌లను బినామీలుగా పెట్టుకుని.. వారి పేరిట జిల్లాలోని కౌతాళం, గుడికంబాళి ఇసుక రీచ్‌లను మంజూరు చేయించారని ఆరోపించారు. ఆయన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి అక్రమాస్తులను జప్తు చేయాలన్నారు. ఈ మేరకు పీఎంవో, సీబీఐ డైరెక్టర్‌తోపాటు సీబీఐ జేడీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్లకు ఫిర్యాదు చేశానని తెలిపారు. -
కోర్టులో లొంగిపోయిన పురుషోత్తంరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కొన్ని రోజులుగా పరారీలో ఉన్న హెచ్ఎండీఏ ప్లానిం గ్ విభాగం మాజీ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డి ఎట్టకేలకు శుక్రవారం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. 15 రోజులుగా ఏసీబీ అధికారులు పురుషోత్తంరెడ్డి ఆచూకీ కోసం వేట సాగించినా ఫలితం లేకపోయింది. గురువారం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన పురుషోత్తంరెడ్డి అక్కడ ఆశించిన ఫలితం రాకపోవడంతో శుక్రవా రం ఉదయమే పురానీ హవేలీ లోని ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. దీంతో కోర్టు పురుషోత్తంరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు పంపింది. పురుషోత్తంరెడ్డి బినామీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యాదవరెడ్డి, నిషాంత్‌రెడ్డిలను నాలుగు రో జుల పాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. దీంతో బినామీ ఆస్తుల వివరాలపై వీరిద్దరినీ విచారించేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ విభాగం నుంచి సేకరించిన డాక్యుమెంట్లను బట్టి విచారణ జరుపుతున్న ఏసీబీ.. అవి కాకుండా ఇంకా అనేక పేర్ల మీద బినామీ ఆస్తులు కూడబెట్టినట్టు అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రూ.25 కోట్లకు పైగా మార్కెట్ విలువున్న ఆస్తులను గుర్తించిన ఏసీబీ.. మిగ తా ఆస్తులపై దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. పురుషోత్తంరెడ్డి భార్య, ఆయన కుమార్తెకు చెందిన బోయినపల్లిలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు శుక్రవారం తెరిచారు. అందు లో పురుషోత్తంరెడ్డి ఆయన కుమార్తెకు ఇచ్చిన రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు ఉన్నట్లు ఏసీబీ సిటీ రేంజ్ అధికారులు తెలిపారు. -
లాకర్లలో బంగారం, డైమండ్స్
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డి శుక్రవారం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. అక్రమాస్తులు కేసులో ఈ నెల 2 వ తేదీ నుంచి ఆయన పరారీలో ఉన్నారు. రెండు వారాల క్రితం పుషోత్తమ్ రెడ్డికి ఇళ్లతో పాటు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ రూ. 25 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ పేర్కొంది. ఇప్పటికే అతనికి ప్రధాన బినామీలుగా ఉన్న అల్లుడు నిషాంత్‌రెడ్డితో పాటు యాదవరెడ్డి అనే వ్యక్తిని ఏసీబీ అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పునరుషోత్తమ్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ముందుస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన అనూహ్యంగా కోర్టులో లొంగిపోయారు. అయితే పురుషోత్తమ్ రెడ్డిని తమ కస్డడీకి ఇవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. 1985 లో బిల్డింగ్ సూపర్వైజర్గా ఉద్యోగంలో చేరిన పురుషోత్తమ్‌రెడ్డి ప్రస్తుతం డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. గతంలో 2009 లోనూ పురుషోత్తమ్‌రెడ్డిపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. రెండు వారాల రిమాండ్ హెచ్ఎండీఏ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డికి ఏసీబీ కోర్టు రెండు వారాల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయనకు పురుషోత్తంరెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు బోయిన్ పల్లిలోని కొటక్ మహీంద్రా బ్యాంకులో పురుషోత్తంరెడ్డికి చెందిన లాకర్లను అధికారులు తెరిచారు. ఆ లాకర్లల్లో ఉన్న భారీ బంగారం, డైమండ్స్‌ను ఏసీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
మూడు నెలల్లో తుదిరూపు
వేములవాడ: ప్రముఖ పుణ్యకేత్రమైన వేములవాడలోని రాజరాజేశ్వరస్వామిని వీటీడీఏ వైస్‌చైర్మన్ పురుషోత్తంరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలల్లో రాజన్న గుడి అభివృద్ధి పనులకు తుదిరూపు వస్తుందని వెల్లడించారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రూ. 65 కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. ఇందులో రూ. 30 కోట్లు జిల్లా కలెక్టర్ ఖాతాకు జమ అయ్యాయన్నారు -
సర్పంచ్ల గౌరవ వేతన బకాయిలకు మోక్షం
రూ. 26.08 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు అందాల్సిన గౌరవ వేతన బకాయిలకు ఎట్ట కేలకు మోక్షం లభించింది. 2015 అక్టోబరు నుంచి 2016 మార్చి వరకు ఆరునెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సర్పం చులు పెద్దెత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ఇటీవల సర్పంచ్ల సంఘాలను పిలిపించుకొని వారి సమస్యలపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టమైన హామీలను కూడా ఇచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు పాత వేతన బకాయిల నిమిత్తం రూ.26.08 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ట్రెజరీల నుంచి సర్పంచులు తమ వేతనాలను తీసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల పంచాయతీ అధి కారులను కమిషనర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశించారు. ప్రతినెలా గౌరవవేతనం చెల్లింపు వివరాలను కమిషనర్ ఆఫీసుకు విధిగా పంపాలని డీపీవోలకు సూచించారు. చెక్కులపై ఈవోపీఆర్డీ సంతకం ఇకపై అక్కర్లేదు! రెండేళ్లుగా ప్రభుత్వానికి సర్పంచులకు మధ్య నలుగుతున్న చెక్ పవర్ వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీలకు సంబంధించిన అభివృద్ధి నిధుల వినియోగంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో పాటుగా ఈవో పీఆర్డీ (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్)కు కూడా కౌంటర్ సిగ్నేచర్ అధికారాన్ని కల్పిస్తూ 2015 జూన్‌లో ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే.. ప్రజలే నేరుగా ఎన్నుకున్న తమను ప్రభుత్వం దొంగలుగా చూస్తోందని, తమపై నమ్మకం లేకనే బిల్లులపై ఈవోపీఆర్డీ కౌంటర్ సిగ్నేచర్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసిందని సర్పంచులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సర్పంచుల నుంచి రోజురోజుకూ ఆందోళన తీవ్రమవుతుండటంతో ప్రభుత్వం పాత విధానాన్నే అవలంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ విషయమై సానుకూలంగా స్పందిం చడంతో ఈ వివాదం తాజాగా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పంచా యతీల బిల్లులపై ఈవోపీఆర్డీ కౌంటర్ సిగ్నేచర్ పద్ధతిని రద్దు చేస్తూ నేడో, రేపో ఉత్తర్వులు కూడా జారీ అవనున్నాయని తెలంగాణ సర్పంచుల సంఘం కన్వీనర్ ఎం.పురుషోత్తం రెడ్డి సోమవారం సాక్షికి తెలిపారు. -
పెళ్లైన ఏడాదికే...
గుడికి వెళ్దామని బైక్ పై తీసుకెళ్లిన భర్త కొద్ది దూరం వెళ్లాక నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆపి భార్యను అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం బ్రిడ్జి సమీపంలో బుధవారం వెలుగు చూసింది. కోస్గి మండలం జంపాపురం గ్రామానికి చెంది పురుషోత్తంరెడ్డికి బాసారం గ్రామానికి చెందిన భవాని(21)తో ఏడాది క్రితం వివాహమైంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. భర్త వివాహేతర సంబంధం గురించి భవాని నిలదీయడంతోనె ఈ దారుణం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.