
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కొన్ని రోజులుగా పరారీలో ఉన్న హెచ్‌ఎండీఏ ప్లానిం గ్ విభాగం మాజీ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డి ఎట్టకేలకు శుక్రవారం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. 15 రోజులుగా ఏసీబీ అధికారులు పురుషోత్తంరెడ్డి ఆచూకీ కోసం వేట సాగించినా ఫలితం లేకపోయింది. గురువారం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన పురుషోత్తంరెడ్డి అక్కడ ఆశించిన ఫలితం రాకపోవడంతో శుక్రవా రం ఉదయమే పురానీ హవేలీ లోని ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. దీంతో కోర్టు పురుషోత్తంరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు పంపింది.
పురుషోత్తంరెడ్డి బినామీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యాదవరెడ్డి, నిషాంత్‌రెడ్డిలను నాలుగు రో జుల పాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. దీంతో బినామీ ఆస్తుల వివరాలపై వీరిద్దరినీ విచారించేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ విభాగం నుంచి సేకరించిన డాక్యుమెంట్లను బట్టి విచారణ జరుపుతున్న ఏసీబీ.. అవి కాకుండా ఇంకా అనేక పేర్ల మీద బినామీ ఆస్తులు కూడబెట్టినట్టు అనుమానిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రూ.25 కోట్లకు పైగా మార్కెట్ విలువున్న ఆస్తులను గుర్తించిన ఏసీబీ.. మిగ తా ఆస్తులపై దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. పురుషోత్తంరెడ్డి భార్య, ఆయన కుమార్తెకు చెందిన బోయినపల్లిలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు శుక్రవారం తెరిచారు. అందు లో పురుషోత్తంరెడ్డి ఆయన కుమార్తెకు ఇచ్చిన రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు ఉన్నట్లు ఏసీబీ సిటీ రేంజ్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment