హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డి శుక్రవారం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. అక్రమాస్తులు కేసులో ఈ నెల 2 వ తేదీ నుంచి ఆయన పరారీలో ఉన్నారు. రెండు వారాల క్రితం పుషోత్తమ్ రెడ్డికి ఇళ్లతో పాటు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ రూ. 25 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ పేర్కొంది. ఇప్పటికే అతనికి ప్రధాన బినామీలుగా ఉన్న అల్లుడు నిషాంత్‌రెడ్డితో పాటు యాదవరెడ్డి అనే వ్యక్తిని ఏసీబీ అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పునరుషోత్తమ్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ముందుస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన అనూహ్యంగా కోర్టులో లొంగిపోయారు. అయితే పురుషోత్తమ్ రెడ్డిని తమ కస్డడీకి ఇవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. 1985 లో బిల్డింగ్ సూపర్‌వైజర్‌గా ఉద్యోగంలో చేరిన పురుషోత్తమ్‌రెడ్డి ప్రస్తుతం డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. గతంలో 2009 లోనూ పురుషోత్తమ్‌రెడ్డిపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది.
రెండు వారాల రిమాండ్
హెచ్‌ఎండీఏ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డికి ఏసీబీ కోర్టు రెండు వారాల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయనకు పురుషోత్తంరెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు బోయిన్ పల్లిలోని కొటక్ మహీంద్రా బ్యాంకులో పురుషోత్తంరెడ్డికి చెందిన లాకర్లను అధికారులు తెరిచారు. ఆ లాకర్లల్లో ఉన్న భారీ బంగారం, డైమండ్స్‌ను ఏసీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment