Illigal assets case
-
లాకర్లలో బంగారం, డైమండ్స్
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం మాజీ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డి శుక్రవారం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. అక్రమాస్తులు కేసులో ఈ నెల 2 వ తేదీ నుంచి ఆయన పరారీలో ఉన్నారు. రెండు వారాల క్రితం పుషోత్తమ్ రెడ్డికి ఇళ్లతో పాటు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ రూ. 25 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ పేర్కొంది. ఇప్పటికే అతనికి ప్రధాన బినామీలుగా ఉన్న అల్లుడు నిషాంత్‌రెడ్డితో పాటు యాదవరెడ్డి అనే వ్యక్తిని ఏసీబీ అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పునరుషోత్తమ్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ముందుస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన అనూహ్యంగా కోర్టులో లొంగిపోయారు. అయితే పురుషోత్తమ్ రెడ్డిని తమ కస్డడీకి ఇవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. 1985 లో బిల్డింగ్ సూపర్వైజర్గా ఉద్యోగంలో చేరిన పురుషోత్తమ్‌రెడ్డి ప్రస్తుతం డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. గతంలో 2009 లోనూ పురుషోత్తమ్‌రెడ్డిపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. రెండు వారాల రిమాండ్ హెచ్ఎండీఏ డైరెక్టర్ పురుషోత్తంరెడ్డికి ఏసీబీ కోర్టు రెండు వారాల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయనకు పురుషోత్తంరెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు బోయిన్ పల్లిలోని కొటక్ మహీంద్రా బ్యాంకులో పురుషోత్తంరెడ్డికి చెందిన లాకర్లను అధికారులు తెరిచారు. ఆ లాకర్లల్లో ఉన్న భారీ బంగారం, డైమండ్స్‌ను ఏసీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్‌పై ఏసీబీ దాడులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కట్టా పురుషోత్తమ్‌రెడ్డి ఇంటిపై శుక్రవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, సాగర్ సొసైటీ, ఆయన కార్యాలయంతో పాటు మరో తొమ్మిది ప్రాంతాలు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.5.35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ రూ.25 కోట్లకుపైగా ఉంటుందని ఏసీబీ పేర్కొంది. 1985లో బిల్డింగ్ సూపర్వైజర్గా ఉద్యోగంలో చేరిన పురుషోత్తమ్‌రెడ్డి ప్రస్తుతం డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. గతంలో 2009లోనూ పురుషోత్తమ్‌రెడ్డిపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఆ సమయంలో రూ.3.7 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్రావు ఓ ప్రకటనలో తెలిపారు. పరారీలో పురుషోత్తమ్‌రెడ్డి పురుషోత్తమ్‌రెడ్డి నెల రోజుల నుంచి సెలవులో ఉన్నట్టు తెలిసింది. దాడుల సందర్భంగా సాగర్ సొసైటీలోని మరో ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు తాళం వేసి ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ ఇంటిని సీజ్ చేసి, ఆ మేరకు ఉత్తర్వులను ఇంటి తలుపులకు అంటించారు. అదే విధంగా పురుషోత్తమ్‌రెడ్డికి బినామీగా ఉన్న ఆయన బావమరిది ఇళ్లు సైతం తాళం వేసి ఉండటంతో ఆ ఇళ్లను సైతం సీజ్ చేసినట్టు ఏసీబీ డీజీ తెలిపారు. ప్రస్తుతం పురుషోత్తమ్‌రెడ్డితో పాటు ఆయన బావమరిది శ్రీనివాస్‌రెడ్డి పరారీలో ఉన్నారని, వారు దొరకగానే వీరి ఇళ్లను తెరిచి మరోసారి సోదాలు నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. మరో ఇద్దరిపైనా డీఏ కేసులు నమోదు... ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భాస్కర్, కరీంనగర్ ఏఎస్ఐ మోహన్‌రెడ్డిపై కూడా కేసులు నమోదు చేసినట్టు ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు మరో పత్రికా ప్రకటనలో తెలిపారు. -
గంగాధరం ఆస్తులు రూ.150 కోట్లు!
ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ సాక్షి, విశాఖపట్నం: ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ గంగాధరం అక్రమాస్తుల కేసులో సోదా లు ముగిశాయి. ఈ నెల 1 నుంచి 4 వరకు జరిగిన దాడుల్లో వెలుగుచూసిన మొత్తం ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.11 కోట్లని అవినీతి నిరోధకశాఖ అధి కారులు తేల్చారు. వీటి మార్కెట్ విలువ రూ. 150 కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ 25 బృందాలతో 16 ప్రాంతాల్లో దాడులు చేశామని, ఇంత వరకు ఏ అధికారి దగ్గరా దొరకనన్ని ఆస్తులు గంగాధరం, ఆయన కుటుంబసభ్యులు, స్నేహితుల వద్ద లభించాయని చెప్పారు. కుటుంబసభ్యులు, వియ్యంకుడు రామ సుబ్బారెడ్డి పేరుమీద రూ.90 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు తాజాగా బయటపడ్డాయన్నారు. రూ.20 లక్షలను షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించామని తెలిపారు. తొమ్మిది లాకర్లు గుర్తించామని, వీటిలో ఏడు హైదరాబాద్‌లో, రెండు విశాఖలో ఉన్నా యన్నారు. 4 కిలోల బంగారం, రూ.కోటికి పైగా నగదు, చిత్తూరు, నెల్లూరు, రంగారెడ్డి, విశాఖ జిల్లాల్లో 54 ఎకరాల భూములు, రాంకీ విల్లా, శ్వాన్‌లేక్, కూకట్‌పల్లిలో డూప్లెక్స్ హౌస్‌లతో కలిపి ఏడు ఫ్లాట్లు ఉన్నాయని తెలిపారు. సుప్రజలో రూ.2 కోట్లు, నమిత హోమ్స్‌లో రూ.1.3 కోట్లు, మరో ఐదు కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టారని వివరించారు. ఎస్ఎస్ ఫామ్స్, ఆర్ఆర్ ఫామ్స్, ఐమాజిక్స్ పొలారసిస్‌లలో రూ.24 లక్షల డిపాజిట్లున్నట్లు తెలిపారు. ఆర్ అండ్ బి కాంట్రాక్టర్లు నాగభూషణం, విశ్వేశ్వరరావు, కిశోర్ ఇళ్లపై దాడులు చేశా మని, వారికి గంగాధరంతో ఉన్న సంబం ధాలపై విచారణ చేస్తున్నామని చెప్పారు.