నేడు జేసీగా ప్రసన్నవెంకటేష్‌ బాధ్యతల స్వీకరణ | today prasanna take charge as jc | Sakshi
Sakshi News home page

నేడు జేసీగా ప్రసన్నవెంకటేష్‌ బాధ్యతల స్వీకరణ

Published Wed, May 10 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

today prasanna take charge as jc

కర్నూలు(అగ్రికల్చర్‌):  జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేష్‌ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 2012 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ఇంతవరకు  కాకినాడ పోర్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయనను ప్రభుత్వం జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ చేసింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆయన తొలుత పాడేరు సబ్‌ కలెక్టర్‌గా పనిచేశారు. జాయింట్‌ కలెక్టర్‌గా ఆయనకు ఇది మొదటి పోస్టింగ్‌. కర్నూలు జేసీగా ఆయన  ఎన్ని గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై స్పష్టత లేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement