prasanna venkatesh
-
ఆయనతో నాకు ఎలాంటి విభేదాలు లేవు: పేర్ని నాని
-
ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: మంత్రి జయరామ్
సాక్షి, అమరావతి: పోరస్ ఇండియా కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాద ఘటనపై కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి, ప్రమాద పరిస్థితిపై సమీక్షించారు. సంబంధిత అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆరుగురు కార్మికుల మృతిపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో వ్యక్తులకు గాయాలు అయిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందించాలని మంత్రి గుమ్మనూరు ఆదేశించారు. ప్రమాదంపై తక్షణమే విచారణ చేపట్టి, పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ఘటనలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు, ఫ్యాక్టరీ యాజమాన్యం రూ. 25లక్షలు అందిస్తుంది. ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు వారికి రూ.5లక్షలు, చిన్న గాయాలు అయిన వారికి రూ. 2లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు, వారు కోలుకునే వరకు వారికి ఫ్యాక్టరీ తరుపున జీతం ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదానికి కారుకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. చదవండి: (ఏలూరు: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి) తాత్కాలికంగా మూసేస్తున్నాం: జిల్లా కలెక్టర్ హై ప్రెషర్ కెమికల్ రియాక్షన్ వల్లే పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. అయితే ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స జరుగుతున్నంతకాలం కంపెనీ వేతనం అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఫోరస్ కంపెనీని తాత్కాలికంగా మూసేస్తున్నట్లు తెలిపారు. అయితే కంపెనీ నిబంధనలు ఏమైనా ఉల్లంఘించిందా..? ప్రమాదకర రసాయనాల వినియోగం ఏమైనా ఉందా? అనే అంశంపై విచారణ చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. చదవండి: (అగ్నిప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం) -
ఆధునాతన పారిశుధ్య యంత్రాల ప్రారంభం
సాక్షి, విజయవాడ : అధునాతన పారిశుధ్య యంత్రాలను మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విఎంసీ తరుపున కొత్త టెక్నాలజీతో ఏడు కొత్త వాహనాలను కొనుగోలు చేశామని ప్రసన్న వెంకటేష్ తెలిపారు. వీటి ద్వారా కాలువల పూడికలను సులువుగా తీయోచ్చని పేర్కొన్నారు. జెసిబీలో మూడు మినీ వాహనాలు, కొత్తగా మూడు నాళామేన్ వాహనాలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. మూడు క్లీనింగ్ యంత్రాలను సైతం అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. ఈ కొత్త యంత్రాల వల్ల పని వేగవంతమవుతుందని, సమయం కూడా ఆదా అవుతుందన్నారు. (మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి కన్నుమూత) -
ఉపఎన్నికల కోసం భారీ భద్రత ఏర్పాటు చేశాం
-
కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించం
- నంద్యాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ - ఎన్నికల నోటిఫికేషన్ విడుదల - తొలి రోజు రెండు నామినేషన్లు నూనెపల్లె (నంద్యాల): కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. ఆయన శనివారం నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ ఈ రోజు నుంచే మొదలుపెట్టామన్నారు. ఆగస్టు ఐదో తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. అభ్యర్థులు నూతనంగా రూపొందించిన నామినేషన్ పత్రాలనే దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. వీటితో పాటు రూ.10 వేలు డిపాజిట్ చేయాలని చెప్పారు. నామినేషన్ పత్రాలను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరిస్తామన్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో స్వీకరించబోమని తెలిపారు. అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే అనుమతిస్తామని, మిగిలిన వారు నామినేషన్ దాఖలు చేసే కార్యాలయానికి వంద మీటర్ల దూరంలో ఉండాలని సూచించారు. అభ్యర్థులపై నిఘా వేశామని, కోడ్ ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థుల పూర్తి వివరాలను అందరికీ అందుబాటులో ఉంచుతామన్నారు. అభ్యర్థులు అందించే నామినేషన్ పత్రాల ప్రతులను కార్యాలయం నోటీస్ బోర్డులో ఉంచుతామని, ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేస్తామని తెలిపారు. నామినేషన్ పత్రాలను తనకు కానీ, సహాయ రిటర్నింగ్ అధికారి (ఏఆర్ఓ)కి కానీ అందజేయవచ్చన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తుంటే 8978840011కు నేరుగా ఫోన్ చేయవచ్చని సూచించారు. నామినేషన్ల విత్‌డ్రాకు ఆగస్టు 7 నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉందన్నారు. ఆగస్టు 23న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. తొలిరోజు రెండు నామినేషన్లు : నంద్యాల ఉపఎన్నికకు సంబంధించి శనివారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ నామినేషన్లను స్వీకరించారు. నవతరం పార్టీ తరఫున రావూస్ సుబ్రమణ్యం, అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున షేక్ మహబూబ్‌బాషా నామినేషన్లు దాఖలు చేశారు. -
నేడు జేసీగా ప్రసన్నవెంకటేష్ బాధ్యతల స్వీకరణ
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేష్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 2012 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ఇంతవరకు కాకినాడ పోర్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈయనను ప్రభుత్వం జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేసింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆయన తొలుత పాడేరు సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. జాయింట్ కలెక్టర్‌గా ఆయనకు ఇది మొదటి పోస్టింగ్. కర్నూలు జేసీగా ఆయన ఎన్ని గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై స్పష్టత లేదు. -
నేనూ మీ వాడినే
పార్వతీపురం: ఐటీడీఏలో పీఓగా అడుగుపెట్టిన క్షణం నుంచి తాను కూడా మీ వాడిగానే మారిపోయానని ఐటీడీఏ పీఓ వి.ప్రసన్న వెంకటేష్ గిరిజన సంఘాల నాయకులతో అన్నారు. ఆదివారం ఆయన సబ్-ప్లాన్‌లోని గిరిజన సంఘాలతో సమావేశమయ్యారు. ఆగస్టు 9న నిర్వహించనున్న ఆదివాసీ దినోత్సవం ఏర్పాట్లపై వారితో చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో స్పందన కార్యక్రమాన్ని ఎలా నిర్వహించారని, దానికి మల్లే నిర్వహించేందుకు ఏం చేయాలని ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయా సంఘాల ప్రతనిధులు మాట్లాడుతూ స్పందన పెద్ద కార్యక్రమమని, అటువంటిది ఇప్పుడు నిర్వహించలేమన్నారు. అయితే గిరిజన సంప్రదాయ, సంస్కృతి కార్యక్రమాలతోపాటు వారి వారి ఆహారపు అలవాట్లు, దేవతలు, ఆహారం తయారీ, బతుకు చిత్రాలు తదితర వాటిని తెలియజేసే స్టాల్స్‌తో పాటు ఆయా సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈసందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ కేవలం గిరిజనులు తప్ప రాజకీయ నాయకులకు వేడుకలో తావివ్వరాదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన ఐటీడీఏ కార్యక్రమాలన్నీ దాదాపు రాజకీయ నాయకులు, గిరిజనేతరులే జరుపుకొన్నారని ఆవేదన వెలిబుచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ చైతన్య సేవా సంఘం, గిరిజన అభ్యుదయ సంఘం, ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంఘం, ఆదివాసీ ఐక్య వేదిక, గిరిజన ఐక్య వేదిక, దీనబంధు యువజన సంఘం, ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంఘం తదితర సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
‘పిక్కల’ లెక్కతో చుక్కలు
పార్వతీపురం: కొమ్ములు తిరిగిన ఐఏఎస్ అధికారి ఐటీడీఏ పీవోగా వచ్చినా అధికారులు చెప్పినట్టు వినాల్సిందే.. కొన్నాళ్లుగా పార్వతీపురం ఐటీడీపై వినిపించే బలమైన ఆరోపణ. పీవోగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఐటీడీఏ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన వి.ప్రసన్న వెంకటేష్‌ను కూడా అదే దారిలో అధికారులు నడిపిస్తున్నారా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తక్కువ ధరకు కొనాల్సిన జీడిపిక్కలను ఎక్కువ ధరకు కొనేందుకు టెండర్ ఖరారు చేయడమే దీనికి నిదర్శనం. బాపట్ల రకం మంచిదన్న సాకుతో .. ఈ ఏడాది పార్వతీపురం సబ్-ప్లాన్‌లోని ఆయా 8 మండలాల్లో దాదాపు 5వేల ఎకరాల్లో జీడితోటల పెంపకానికి సన్నాహాలు ప్రారంభించారు. ఉపాధి నిధులతో జీడితోటల పెంపకాన్ని చేపడుతున్న తరుణంలో ప్రభుత్వ ఉత్వర్వుల ప్రకారం కిలో జీడిపిక్కలు రూ.139 కంటే అదనపు ధరకు కొనుగోలు చేయరాదు. కానీ బాపట్ల రకం మంచిదన్న పేరుతో రూ.139 విలువ చేసే కిలో జీడిపిక్కలను రూ.210కు ఇటీవల టెండర్లు ఖరారు చేశారు. ప్రస్తుతం బయటి మార్కెట్లో కిలో జీడిపిక్కల ధర రూ.130 పలుకుతున్నట్లు సమాచారం. టెండర్ల కంపెనీలపై అనుమానాలు... ఏటా ఇదే సీజన్లో జీడి పిక్కలు, వేప పిండి, వర్మీ కంపోస్టు టెండర్లు పడిన వెంటనే సరుకు సరఫరాకు వచ్చే సంస్థల వ్యక్తులే పేర్లు మార్చి అదే పేరుతో రావడం సాధారణం. ఈ ఏడాది కూడా టెండర్లు వేసిన సంస్థలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ అధికారి గతంలో పనిచేసి వచ్చిన ప్రాంతానికి చెందిన కొన్ని సంస్థలు టెండర్లు వేయడం సందేహాలకు తావిస్తోంది. నరసన్న పేటకు చెందిన సాయికృష్ణా ఎంటర్ ప్రైజస్‌కు మార్కెట్ రేటు, ప్రభుత్వ రేటు కన్నా అధికంగా టెండర్లు ఖరాారు చేయడం గమనార్హం. కొన్నేళ్లుగా ఐటీడీఏ హార్టీకల్చర్ శాఖ వ్యవసాయానికి వేపపిండి పేరుతో మట్టిముద్దలు సరఫరా చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న లోటస్ బయోటిక్‌కు ఈ ఏడాది కూడా టెండర్లు ఖరారు చేయడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ధరల్లో వ్యత్యాసం వేప పిండి కిలో రూ.9.30కు డీసీఎంఎస్ సరఫరా చేస్తున్న తరుణంలో ఈ ఏడాది రూ.9.90కు టెండర్లు ఖరారు చేశారు. రూ.3 ధర పలికే వర్మీకంపోస్టును రూ.6కు ఖరారు చేశారు. గతంలో పంపిణీ చేసిన వేపపిండి, వర్మీకంపోస్టు నాణ్యత లేదంటూ గిరిజనులు ఇప్పటికీ వాడకుండా పక్కన పడేశారు. మట్టిముద్దలు, చెత్తా చెదారం పంపిణీ చేశారని అప్పట్లో వారు మండిపడ్డారు. జూలై చివరికల్లా జీడి వేయాల్సి ఉంది. తర్వాత వేస్తే మొలకలు అనుమానమేనని గిరిజనులంటున్నారు. అంతా పారదర్శకమే... టెండర్లు పారదర్శకంగానే జరిగాయి. మార్కెట్లో సాధారణ రకం రూ.130 పలుకుతున్నా బాపట్ల రకం బాగుంటుందని బీపీపీ 6, 8 రకాలకు టెండర్లు ఖరారు చేశాం. వీటిని రీసెర్చ్ సెంటర్ ధ్రువీకరిస్తుంది. ఈ ఏడాది పంట తక్కువగా ఉండటంతో జీడి ధర దాదాపు రూ.50 వరకు పెరిగింది. ఇప్పుడు ఖరారు చేసిన జీడిపిక్కలను గ్రేడింగ్ చేస్తారు. నీటిలో తేలినవి ఇస్తారు. వేప పిండి, వర్మీకంపోస్టు నమూనాలను నాగపూర్ పంపిస్తాం. బాపట్ల సీడ్ కావాలని టెండర్ ప్రకటిస్తే ఎవరూ రాకపోవడంతో రెండుసార్లు వాయిదా వేశాం. చివరికి వచ్చిన వారిని ఖరారు చేశాం. కమిటీ సోమవారం జీడిపిక్కలను గ్రేడింగ్ చేసి తెచ్చేందుకు వెళ్తోంది. - ఆర్వీవీ ప్రసాద్, ప్రాజెక్టు హార్టీకల్చర్ అధికారి, ఐటీడీఏ -
అమరావతి ల్యాండ్ మాపియాపై సీఆర్డీఏ విచారణ
గుంటూరు: అమరావతి ల్యాండ్ మాఫియాపై సీఆర్డీఏ విచారణ చేపట్టింది. అమరావతి ల్యాండ్ మాఫియాపై ప్రత్యేక కథనాన్ని సాక్షి ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. దాంతో స్పందించిన సీఆర్డీఏ సహాయ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ నకిలీ పాసుపుస్తకాల తయారీపై విచారణకు ఆదేశించారు. ఈ విషయంపై ఆయన నిడమర్రు డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో సంప్రదింపులు జరిపారు. నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో భూముల అక్రమాలపై విచారణ జరపనున్నట్టు సమాచారం. -
త్వరలో అదనపు ఆధార్ కేంద్రాలు
సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అనంతగిరి: పాడేరు డివిజన్ లోని అన్ని మండలాల్లో అదనపు ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. సోమవారం అనంతగిరి మండలంలో టోకురు, బొర్రా, అనంతగిరి ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల ఆయనకు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఆధార్‌కార్డులు రాక చాలామంది గిరిజనులకు రేషన్ బియ్యం అందడం లేదన్న ఫిర్యాదుపై స్పందించారు. తక్షణమే కార్డులు ఉన్న వారి జాబితా వెంటనే ఇవ్వాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. బొర్రా, టోకురు గుమ్మ, అనంతగిరి, ఎగువశోభ పంచాయతీల్లో భూపట్టాలు పంపిణీ చేయాలని గిరిజన సంఘం నాయకులు కోరారు. పట్టాలు ఇచ్చేందుకు అనుకులంగా ఉన్నచోట పట్టాదార్ పాస్‌బుక్‌లు సిద్దంచేస్తే మళ్లీ అనంతగిరి వచ్చినప్పుడు పంపిణీ చేస్తానన్నారు. కివర్ల డీఆర్ డిపోలో రేషన్ పంపిణీ చేయాలని జీసీసీ మేనేజర్‌ను ఆదేశించారు. నాన్‌షెడ్యుల్డ్ పంచాయతీల్లో భూ ఆక్రమణలను ఆపాలని సబ్ కలేక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కబ్జాదారుల జాబితా తనకు అందజేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జెడ్పీ వైస్ చైర్మన్ కె.అప్పారావు. తహశీల్దార్ భాగ్యవతి, ఎంపీడీవో సాంబశివరావు, ఎంపీటీసీ, సర్పంచ్‌లు డి.గంగరాజు, ధర్మన్న మోష్యి నాగులు పాల్గొన్నారు. వైద్య సేవలు లోపిస్తే వేటు డుంబ్రిగుడ: గిరిజనులకు సేవల్లో వైద్యాధికారులు నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని పాడేరు సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. సోమవారం డుంబ్రిగుడ తహశీల్దార్ కార్యాలయంలో ఆయన కుల గణన సర్వే నివేదికలను పరిశీలించారు. అనంతరం ఇక్కడి పీహెచ్సీలో వైద్యుల పనితీరును సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ చిన్న వయస్సుల్లోనే ఐఏఎస్ అధికారిగా నియమితుడినైన తాను మన్యంలో సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. పాడేరు డివిజన్ లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు గిరిజనులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని తుంగలోకి తొక్కి గిరి భూముల్లో నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటానని చెప్పారు. డుంబ్రిగుడ మండలం అరకు సంత గ్రామంలో గిరిజనేతరులు చేపడుతున్న కట్టడాలపై దృష్టిసారించాలని తహాశీల్దార్‌ను ఆదేశించారు. -
ఇదా చదువు చెప్పే తీరు?
గురువులకు సబ్ కలెక్టర్ క్లాసు మలకపొలం ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు ఆదివారం.. సమయం మధ్యాహ్నం 12 గంటలు.. ఏడో తరగతి గదిలోకి యువ ఐఏఎస్ అధికారి ఒకరు ఆకస్మికంగా ప్రవేశించారు. ఓ విద్యార్థిని లేపి.. ఇంగ్లిష్ పుస్తకంలోని ఓ పద్యం చదవమని కోరారు.. పుస్తకంవైపు బిక్కమొహం వేసిన విద్యార్థిని చూసి ఆ అధికారి విస్తుపోయారు. రెండుమూడు సార్లు.. ‘చవువమ్మా.. భయంలేదు’.. అంటూ సముదాయించినా ఒక అక్షరం కూడా నోటి నుంచి పెగల్లేదు. మరో ఇద్దరు విద్యార్థులు కూడా ఇలానే బిత్తరచూపులు చూశారు. తొమ్మిదో తరగతి గదిలోకి ప్రవేశించి.. 9/4= రాస్తే.. 37 అని, 9/5=46 అని రాయడంతో ఈ సారి బిత్తరపోవడం ఆ అధికారి వంతు అయింది. మరో విద్యార్థి 100ను 5తో భాగించాలన్నా నేలచూపులు చూశాడు. అంతే.. ఆ అధికారి, ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పే గురువులకు క్లాసు తీసుకున్నారు. ఇదీ.. పాడేరు మండలం మలకపొలం గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలో జరిగిన సన్నివేశం. ఆ అధికారి.. కొత్తగా వచ్చిన సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. పాడేరు : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ప్రాథమిక స్థాయిలోనే చదువులో వెనుకబడి ఉండటంపై పాడేరు సబ్‌కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ విస్మయం వ్యక్తం చేశారు. మండలంలోని మారుమూల మలకపొలం ఆశ్రమ పాఠశాలను ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 7 9 తరగతుల విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్‌లో సబ్‌కలెక్టర్ పలు ప్రశ్నలు వేశారు. బోర్డుపై చిన్నపాటి అంకెలను వేసి గుణింతాలు, భాగాహారాలు చేయమని పలువురు విద్యార్థులను సబ్‌కలెక్టర్ కోరినా వారు కనీస పరిజ్ఞానం లేకుండా తెల్లముఖాలు వేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న గణిత ఉపాధ్యాయుడిని చూస్తూ.. ఇక్కడి విద్యార్థులు చిన్నపాటి లెక్కల్లో కూడా పరిజ్ఞానం లేకపోవ డం దారుణమంటూ తప్పు పట్టారు. 9వ తరగతి విద్యార్థులు ఎక్కాలు కూడా చెప్పలేకపోవడం సబ్‌కలెక్టర్‌ను మరింత బాధించింది. ఓ విద్యార్థిని సబ్‌కలెక్టర్ లేపి ఇంగ్లిష్‌లో తల్లితండ్రుల పేర్లు రాయమన్నా తెలియదని సమాధానం ఇవ్వడంతో ఇక్కడ విద్యార్థులకు విషయ పరిజ్ఞానం లోపించిందని సబ్‌కలెక్టర్ బేరీజు వేశారు. ఉపాధ్యాయులకు క్లాసు... గ్రామాల్లో చదువుకున్న సమయంలోనే విద్యార్థులకు సరైన ప్రాథమిక విద్య అబ్బలేదని, నేరుగా ఆశ్రమ పాఠశాలలో చేరుతుండటంతో మళ్లీ బోధించాల్సి వస్తోందని గణిత ఉపాధ్యాయుడు సబ్ కలెక్టర్‌కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతే వెంటనే సబ్ కలెక్టర్ వెంకటేష్ ప్రసన్న మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యాబోధన సక్రమంగా లేదని హైస్కూల్ స్థాయిలో కూడా బోధన కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తారా అంటూ ఉపాధ్యాయులను నిలదీశారు. చదువులో గిరిజన విద్యార్థులు ఇంత వెనుకబడితే ఫలితాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఒక దశలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఈ పాఠశాలకు తనిఖీకి వస్తానని అప్పటికైనా విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లోనూ పరిణతి చెందేలా శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయుల గైర్హాజరుపై ఆరా అనంతరం పాఠశాల మూవ్మెంట్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. హెచ్ఎం సెలవు చీటి ఈ రిజిస్టర్లో ఉండటాన్ని సబ్‌కలెక్టర్ తప్పు పట్టారు. హెచ్ఎం సెలవు చీటిని గిరిజన సంక్షేమ కార్యాలయానికి అందజేసి అధికారుల అనుమతి తరువాతే సెలవు తీసుకోవాలనిసూచించారు. డిప్యుటీ వార్డెన్, పీఈటీలు కూడా పాఠశాలలో లేకపోవడంపై సబ్‌కలెక్టర్ విచారణ జరిపారు. విద్యార్థులకు మెనూ, తాగునీటి సదుపాయంపై సమీక్షించారు. తహశీల్దార్ రాజకుమారి, డీటీ వంజంగి త్రినాథనాయుడు, వీఆర్వో పద్మ ఆయన వెంట ఉన్నారు.