విఘ్నేశ్వరుడు, వినాయకుడు, గణపతి, గణనాధుడు.. రకరకాల పేర్లతో ఆ దేవదేవుణ్ణి మనం కొలుస్తున్నాం.
విఘ్నేశ్వరుడు, వినాయకుడు, గణపతి, గణనాధుడు.. రకరకాల పేర్లతో ఆ దేవదేవుణ్ణి మనం కొలుస్తున్నాం. ఏ పనిని మొదలు పెట్టినా విఘ్నాలు రాకుండా ఉండాలని ఆ గణపతిని పూజిస్తాం. ప్రతి ఇంట్లోనే కాకుండా గణనాధుడు ఇప్పుడు వాడవాడలా పూజలు అందుకుంటున్నాడు. అయితే వినాయక చవితి సామూహిక ఉత్సవాలు ఎప్పుడు, ఎలా మొదలయ్యాయో తెలుసా?
చవితి పర్వదినాన్ని సామూహికంగా జరుపుకునే అతి పెద్ద పండుగా మార్చిన ఘటన మాత్రం లోకమాన్య బాలగంగాధర తిలక్కు దక్కుతుంది. స్వాతంత్ర్య సమర పోరాటంలో భాగంగా 1893లో సామూహిక గణపతి ఉత్సవాలను ప్రారంభించారు. మొదట మహారాష్ట్రలో ప్రారంభమైన సామూహిక వినాయక చవితి వేడుకలు దేశమంతా విస్తరించాయి.
కాగా 1857 మొదటి స్వాతంత్ర్య సమరం తర్వాత బ్రిటిష్ వారు దేశంలో రాజకీయ సభలు, సమావేశాలను నిషేధించారు. అయితే మత పరమైన వేడుకలపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఈ నేపథ్యంలో గణపతి పూజలు ఇంటికే పరిమితం చేయకుండా సామూహికంగా జరుపుకుంటే ప్రజల్లో ఐక్యత, జాతీయ భావం పెరుగుతుందని తిలక్ భావించారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాల ద్వారా అంతర్లీనంగా దేశభక్తిని ప్రభోదించారు. ఈ సందర్భంగా తిలక్ చవితి ఉత్సవాల్లో పాల్గొన్న అరుదైన ఫోటోలు మీ కోసం...