
ఆసక్తిని రేకెత్తిస్తోన్న‘మఫ్టీ’ పోస్టర్
ఉగ్రం, రథావర తదితర హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న శ్రీమురళి కొత్త చిత్రం మఫ్టీకి ...
బెంగళూరు : ఉగ్రం, రథావర తదితర హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న శ్రీమురళి కొత్త చిత్రం మఫ్టీకి సంబంధించిన పోస్టర్ ను వినాయక చవితి సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు విడుదల చేశారు. నర్తన్ దర్శకత్వంలో జయణ్ణ భోగేంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీమురళికి జోడీగా మాస్టర్‌పీస్ ఫేమ్ శాన్వి శ్రీవాత్సవ్ హీరోమాన్‌గా నటించనుంది.
అంతేకాకుండా కన్నడ హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ఈ చిత్రంలో నటిస్తుండడంతో ఆయన అభిమానులతో పాటు, శ్రీమురళి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వినాయక చవితిని పుసరస్కరించుకొని విడుదల చేసిన పోస్టర్ ఇరువురి హీరోల అభిమానులతో పాటు శాండల్‌ఉడ్ జనాలను కూడా ఆకర్షిస్తూ చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది.