సాక్షి, హైదరాబాద్: కరోనా సమయంలో వినాయక చవితి ఉత్సవాలపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. వినాయక నిమజ్జనంపై పూర్తి వివరాలు సమర్పించాలని మరోసారి హైకోర్టు అధికారులను ఆదేశించింది. నిమజ్జనం సందర్భంగా జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. రసాయనాలతో కూడిన విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకుండా ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని పేర్కొంది. సెప్టెంబరు1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌లను హైకోర్టు ఆదేశించింది. లేని పక్షంలో సీనియర్ అధికారులు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.
ఇళ్లల్లోనే మట్టి గణపతులను పూజించాలని ప్రజలకు సూచిస్తామన్న ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే సూచనలు కాకుండా స్పష్టమైన ఆదేశాలు ఉండాలని హైకోర్టు తెలిపింది. సెంటిమెంట్లు మంచిదే కానీ, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. వినాయక నిమజ్జనంపై తదుపరి విచారణ సెప్టెంబరు1కి హైకోర్టు వాయిదా వేసింది.
చదవండి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ముగ్గురు మహిళలు
ఏపీ గృహ నిర్మాణశాఖ రివర్స్ టెండరింగ్‌తో భారీగా ఆదా
Comments
Please login to add a commentAdd a comment