సాక్షి, హైదరాబాద్: విద్యా సంస్థల్లో సిబ్బందికి 2 నెలల్లో, రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా బుధవారం రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై జరిపిన విచారణలో.. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని, ప్రసుత్తం రాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో 10శాతమే ఆర్టీపీసీఆర్ జరుగుతున్నాయని పేర్కొంది. కరోనాకు సంబంధించి ప్రభుత్వ పాలసీలే అమలు చేస్తారా.. కోర్టు ఆదేశాలు అమలు చేయరా అంటూ ప్రశ్నించింది.
కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఈనెల 30లోగా సీసీజీఆర్ఏ రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. కరోనా ఔషధాలను అత్యవసర జాబితాలో చేర్చడంలో జాప్యంపై స్పందిస్తూ.. ఇంకా ఎంత మంది మరణించాక చేరుస్తారని అసహనం వ్యక్తం చేసింది. అక్టోబరు 31లోగా వీటిని అత్యవసర జాబితాలో చేర్చాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. కరోనాపై తదుపరి విచారణను అక్టోబరు 4కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment