31 నుంచి పాఠశాలలు తెరుస్తున్నారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు | TS High Court Hearing On Covid Situation In Telangana | Sakshi
Sakshi News home page

31 నుంచి పాఠశాలలు తెరుస్తున్నారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

Published Fri, Jan 28 2022 1:20 PM | Last Updated on Fri, Jan 28 2022 5:31 PM

TS High Court Hearing On Covid Situation In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై  ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అదే విధంగా వారాంతవు సంతల్లో కోవిడ్ నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సమ్మక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని కూడా హైకోర్టు ఆదేశించింది.

ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టిన విచారణకు డీహెచ్ శ్రీనివాస్ రావు హాజరయ్యారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని తెలిపారు. 77 లక్షల ఇళ్లల్లో జ్వరం చేసి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవన్న న్యాయవాదులు ప్రస్తావించగా.. పిల్లలకు మందులు కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదన్న డీహెచ్ తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను మూడు రోజుల్లో  సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్థితులపై విచారణ ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.
చదవండి: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి షాకింగ్‌ న్యూస్‌.. ఇక ఇంటికొస్తారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement