
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గత నెల 25న రాజాసింగ్‌ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ రాజాసింగ్ భార్య ఉషాభాయ్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు వ్యతిరేకంగా ఆగస్టు 26 నుంచి రాజాసింగ్‌ను అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు.
పలు కేసుల గురించి చెప్పకుండానే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోరారు. దీనిపై జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం విచారణ చేపట్టి.. కౌంటర్ దాఖలు కోసం ప్రభుత్వానికి నాలుగు వారాలు గడువిచ్చింది. విచారణను వాయిదా వేసింది.
చదవండి: పాతబస్తీ క్షుద్రపూజల కలకలం
Comments
Please login to add a commentAdd a comment