సాక్షి, హైదరాబాద్: గోషామహల్ శాసనసభ్యుడు, తన భర్త రాజాసింగ్‌కు జైలులో సౌకర్యాలు కల్పించాలని టి.ఉషాభాయ్ కోరారు. ఈ మేరకు ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత నెలలో పీడీ యాక్ట్ కింద రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. జైలులో ఉంటున్న రాజాసింగ్‌కు సౌకర్యాలు కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత విచారణ చేపట్టారు.
రాజాసింగ్‌కు జైల్లో మంచం, పరుపు, కుర్చీ, టేబుల్, టీవీ వంటి సౌకర్యాలు అందజేసేందుకు ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేయా లని పిటిషనర్ తరఫు న్యాయవాది కె. కరుణసాగర్ నివేదించారు. ప్రజలు, కుటుంబసభ్యులను కలుసుకునేందుకు కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ వాదనలు వినిపించేందు కు గడువు కావాలని రాష్ట్ర ప్రభు త్వ తరఫు న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment