హైదరాబాద్: పాతబస్తీ జాంబాగ్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దొంగలు పడ్డారు. రెండు కంప్యూటర్లతో పాటు వ్యాక్సిన్ వయల్స్‌ను దొంగిలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పంజేషాలోని జాంబాగ్ పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాన్ని రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం వైద్య సేవలు అందించిన అనంతరం సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయారు.
సోమవారం ఉదయం 8.30 గంటలకు వచ్చి చూడగా.. ఆస్పత్రి తలుపు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. రెండు కంప్యూటర్ మానిటర్లు, 2 సీపీయూలు, 2 కీ బోర్డులు, మౌస్‌లతో పాటు 17 కోవాగ్జిన్ వయల్స్, 27 కోవిషీల్డ్ వయల్స్, 22 బీసీజీ, 44 ఓపీవీ, 15 డీటీపీ, 7 ఐపీవీ 7, 39 హెపాటీబీ, 38 ఎంఆర్, 7 పీసీపీ, 23 పెంటా, 21 డీటీ, 2 ఏఈఎఫ్‌ఐ కిట్స్‌చోరీకి గుర య్యాయి. ఆస్పత్రి గోడకు ఉన్న స్మార్ట్ టీవీని సైతం దొంగిలించేందుకు యత్నించి విఫలమయ్యారు. ఈ ఘటనపై ఎంఓ లింగమూర్తి మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment