నుర్మతి గ్రామంలో గురువారం వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామంలో ఏర్పా టు చేసిన వినాయక
జి.మాడుగుల : నుర్మతి గ్రామంలో గురువారం వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామంలో ఏర్పా టు చేసిన వినాయక విగ్రహాన్ని సమీపంలోని గెడ్డలో నిమజ్జనానికి గురువారం సాయంత్రం ఊరేగింపుగా తీసుకెళ్లారు. గెడ్డలో దిగిన అంగనేని సన్యాసినాయుడు (26)నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. శుక్రవారం ఉదయం మృతదేహం బయటపడడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
కలువ పువ్వుల కోసమని వెళ్లి దుర్మరణం
ఎస్.రాయవరం : దార్లపూడి లింగాల చెరువులో శుక్రవారం కలువ పువ్వులు కోసేందుకు దిగిన యువకుడు ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతిచెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... వినాయక చవితి పర్వదిన వేడుకల్లో పూజకు అవసరమైన కలువ పువ్వులు తీసుకొచ్చి విక్రయించేందుకు బంగారి నూకరాజు(25) చెరువు వద్దకు వెళ్లాడు. చెరువులో దిగి పువ్వులు కోస్తుండగా ఊబిలో కూరుకుపోయి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు నూకరాజును రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దురదృష్టవశాత్తూ నూకరాజు అప్పటికే మృతిచెందాడు. వీఆర్వో పార్వతి సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ రామారావు కేసు నమోదు చేశారు.