1/11
సకల విఘ్నాలను తొలగించే దేవాధిదేవుడు విఘ్నేశ్వరుడి పండుగ వచ్చేసింది. మండపాల్లో కొలువైన బొజ్జ గణపయ్యకు ఈ నవరాత్రులు నిత్యం పూజలు జరుగుతాయి. అయితే గణేషుడి ఆకృతితో అందరి దృష్టిని ఆకర్షించేందుకు చేసిన కొన్ని ప్రయత్నాలు ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కాయి.
2/11
ముంబై లోకల్ ట్రైన్‌లో గం గం గణేషా
3/11
కర్ణాటక గంగావతి తాల్లూల్ శ్రీరామనగర విద్యానికేతన పబ్లిక్ స్కూల్ రెండు వేల మంది విద్యార్థులతో భారీ వినాయకుడి ఆకృతిని రూపొందించారు. ఐదు వందల అడుగుల ఎత్తు నుంచి డ్రోన్‌తో ఆ ఆకృతిని ఇలా ఫొటో తీశారు.
4/11
వినాయక చవితి సందర్భంగా.. జగిత్యాల జిల్లాకు చెందిన కళాకారుడు(మైక్రోఆర్టిస్ట్) దయాకర్.. గరికపోచపైన గణనాథుని ప్రతిమను రూపొందించారు. కొన్నేళ్లుగా ప్రతీ ఏటా ఆయన ఏదో ఒక కొత్తదనంతో ఔరా అనిపిస్తూనే ఉన్నారు.
5/11
తమిళనాడులో 6,000 వేల తాంబులం పాత్రలు, 1,500 కామాక్షి ప్రమిదలు, 350 సముద్రపు గవ్వలతో రూపొందించిన 40 అడుగుల బొజ్జ గణపయ్య.
6/11
బప్పా ఈజ్ కమింగ్ హోం అంటూ ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో చేసిన పోస్ట్ ఇది
7/11
టీమిండియా టీ20 వరల్డ్ కప్ నెగ్గిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ఆ థీమ్‌తో పొందించిన గణేషుడు.. పక్కనే కప్పు చేతబూనిన ఆయన వాహనం మూషికం
8/11
సైతకశిల్పి సుదర్శన్ పట్నాయక్ నుంచి వచ్చిన మరో కళాత్మక చిత్రం ఇది. పూరీ బీచ్‌లో ఇరవై రకాల పండ్లతో ప్రపంచ శాంతి అనే సందేశంతో ఆయన ఈ ఆర్ట్‌ను రూపొందించారు.
9/11
రకరకాల గణేషుడి ప్రతిమలు చూశారు కదా. ఇప్పుడీ స్వీట్ గణేషుడిని చూడండి. రాజస్థాన్ నుంచి తెప్పించిన బెల్లం గడ్డలతో 75 అడుగుల ఎత్తైన విఘ్నేషుడ్ని నిలబెట్టారు. ఇది ఎక్కడో కాదు.. వైజాగ్ గాజువాక బస్ డిపో పక్కన కొత్త నక్కవాణిపాలెం దగ్గర. లంబోదర ఛారిటబుల్ ట్రస్ట్ వాళ్లు ఆ ఆలోచన చేశారు.
10/11
దేవుడ్ని దేవుడిలాగే పూజించాలి. అంతేగానీ వైరల్ కోసమో.. ట్రెండ్‌ను ఫాలో అవుతున్నామో చెప్పడం కోసమో.. కొందరు రకరకాల ఆకృతుల్లో తయారు చేసి మనోభావాల్ని దెబ్బ తీస్తుంటారు. వీటిల్లో సినిమా థీమ్‌లు, సినీ తారలవే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే పైవాటిల్లో మాత్రం ఎక్కడా.. ఎవరి సెంటిమెంట్లు దెబ్బ తీయకపోగా.. అదనంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి కూడా.
11/11
వివిధ ఆకృతులు మాత్రమే కాదు.. ఏఐ సాయంతో లంబోదరుడు బండి నడిపినట్లు, సముద్రంలోంచి పైకి లేచినట్లు.. ఇలా రకరకాల ఆలోచనలతో ఫొటోల్ని జనరేట్ చేస్తున్నారు. అయితే ఎన్నిరకాలుగా గణేషుడు దర్శనమిస్తున్నా.. మట్టితో రూపుదిద్దుకుంటే ఆ లుక్కే వేరు.