idols
-
ఆలయం బావిలో విగ్రహాలు
సంభాల్: ఉత్తరప్రదేశ్‌లో సంభాల్‌లో దాదాపు 46 ఏళ్ల తర్వాత గత వారం తెరుచుకున్న ఆలయం సమీపంలోని బావిలో దెబ్బతిన్న మూడు దేవతా విగ్రహాలు లభించాయి. నవంబర్‌లో షాహి జామా మసీదులో కోర్టు ఆదేశాల మేరకు సర్వేకు ప్రయతి్నస్తుండగా హింస చెలరేగి నలుగురు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఆ ప్రాంతానికి కిలోమీటర్ దూరంలోని ఖగ్గూ సరాయ్లోనే శ్రీ కార్తీక్ మహదేవ్(భస్మా శంకర్)ఆలయం ఉంది. అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్న సమయంలో అక్కడే 1978 నుంచి మూతబడి ఉన్న ఆలయం విషయం బయటపడింది. ఆలయంలో హనుమాన్ విగ్రహం, శివలింగం ఉండగా, పక్కనే ఉన్న బావి శిథిలావస్థకు చేరుకుంది. ఈ బావిలో సోమవారం అధికారులు పూడిక తీత మొదలుపెట్టారు. సుమారు 15 అడుగుల లోతులో దెబ్బతిన్న స్థితిలో ఉన్న పార్వతి, గణేశ్, లక్ష్మీ దేవతా విగ్రహాలు లభించాయని అధికారులు చెప్పారు. ఆలయం ప్రాచీనతను కాపాడే లక్ష్యంతో పనులు చేపట్టామని చెప్పారు. ఈ విగ్రహాలను ఎవరు, ఎందుకు ధ్వంసం చేసి ఉంటారనే విషయపై వివరాలను సేకరిస్తున్నామని అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్న సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేందర్ పెన్సియా చెప్పారు. ఆలయం చుట్టూ ఆక్రమణల తొలగింపు కూడా జరుగుతోందన్నారు. కార్బన్ డేటింగ్ పరీక్షతో ఆలయంతోపాటు బావి ప్రాచీనతను నిర్థారించాలని కోరుతూ పురావస్తు శాఖకు లేఖ రాసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో జనం వచ్చి పూజలు చేస్తున్నారు. అధికారులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
గణేష్ చతుర్థి: స్వీట్స్ ఆర్డర్లలో ఆ నగరమే టాప్..
దేశంలో వినాయక చతుర్థి సంబరాలు అంబరాన్నంటాయి. ఎక్కడ చూసినా వినాయక విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ గణేష్ చతుర్థికి.. వినాయక విగ్రహాల విక్రయాలు ఏకంగా 10 రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది.ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ 'జెప్టో' గణాంకాల ప్రకారం.. వినాయక విగ్రహాలు మాత్రమే కాకుండా రెడీమేడ్ మోదకాలు గంటకు 1500 అమ్ముడైనట్లు.. మోదకాల అచ్చులు కూడా గంటకు 500 అమ్ముడయ్యాయని సమాచారం. ప్రధాన నగరాల్లో ఎక్కువ స్వీట్ ఆర్డర్స్ పొందిన నగరంగా బెంగళూరు రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తరువాత స్థానాల్లో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై ఉన్నాయి.ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న జెప్టో.. భారతదేశం అంతటా 10,000 పర్యావరణ అనుకూల గణేష్ విగ్రహాలను విక్రయించింది. వంద శాతం పర్యావరణ అనుకూల విగ్రహాలను అందించడానికి జెప్టో 100 మందికిపైగా స్థానిక కళాకారులతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్ గత 24 గంటల్లోనే జెప్టో 70,000కు పైగా స్వీట్లను విక్రయించింది. మోదకాలు అమ్మకాలలో ముంబై ముందంజలో ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్, హైదరాబాద్‌లలో లడ్డూల ఎక్కువగా అమ్ముడైనట్లు సమాచారం. గత ఏడాదితో పోలిస్తే.. మోదకాలు అమ్మకాలు ఐదు రెట్లు, లడ్డూల విక్రయాలు 2.5 రెట్లు, మిఠాయిలు అమ్మకాలు రెండు రెట్లు, పూజా సామాగ్రి రెండు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. -
గం.. గం.. గణేషా!.. ఈ చిత్రాలు చూడండయ్యా
-
ఆ విగ్రహం శ్రీవెంకటేశ్వరుడిది కావచ్చు: డా. పద్మజ దేశాయ్
రాయచూరు-తెలంగాణ సరిహద్దులోని శక్తి నగర్ సమీపంలో కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా జరిగిన తవ్వకాల్లో కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. ముఖ్యంగా శివ లింగం శ్రీకృష్ణుని దశావతార విగ్రహాలను సురక్షితంగా బయటకు తీసిన సంగతి తెలిసిందే. అయతే రాయచూర్ యూనివర్శిటీలోని చరిత్ర, పురావస్తు శాఖ అధ్యాపకులు డాక్టర్ పద్మజ దేశాయి ఏమంటున్నారంటే..! "రాయచూరు, హంపి పరిసరాల్లోని 30 గ్రామాల్లో ప్రాచీన దేవాలయాలపై పీహెచ్డీ చేశాను నేను. కృష్ణ నదీ తీరంలో బయటపడ్డ ఈ విష్ణుమూర్తి విగ్రహం 11వ శతాబ్ధానికి చెందినది కావచ్చునని, కళ్యాణ చాళుక్యుల కాలంలో తయారైందని ప్రాథమిక అంచనా ఉంది. కచ్చితమైన కాలావధి కావాలంటే కార్బన్ డేటింగ్ వంటివి నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో తాము పలు విగ్రహాలు చూశామని గ్రామస్తులు పలుమార్లు చెప్పేవారు. తాజాగా నదిలో నీటిమట్టం తక్కువగా ఉండటం వల్ల కొన్ని విగ్రహాలు అందరికీ కనిపించాయి. పైగా అయోధ్య రామ మందిరం గురించి దేశవ్యాప్తంగా ప్రచారం కావడం, అక్కడి రామ్ లల్లా విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి యోగిరాజ్ చెక్కడం వంటి నేపథ్యంలో రాయచూరుకు సమీపంలో బయటపడ్డ విగ్రహాన్ని చాలామంది రామ్ లల్లా విగ్రహంతో పోల్చి చూశారు. అయితే నా అంచనా ప్రకారం ఈ విగ్రహం వెంకటేశ్వరుడిది అయ్యేందుకు అవకాశముంది. ఎందుకంటే విగ్రహం దొరికిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు కావడం.. ఈ ప్రాంతంలో వెంకటేశ్వరుడి ఆరాధన ఎక్కువగా ఉండటం. అంతేకాదు.. విగ్రహ లక్షణాలను గమనిస్తే దీనిపై శంఖు, చక్రాలు అన్నాయి. తిరుపతి వెంకటేశ్వరుడి మాదిరిగానే అభయ, వరద హస్తాలు ఉన్నాయి. కళ్యాణ చాళుక్యుల కాలంలో అటు శైవారాధనతోపాటు వైష్ణవారాధన కూడా జరిగేది. ఇందుకు తగ్గట్టుగా ఈ విష్ణుమూర్తి విగ్రహం బయటపడ్డ ప్రాంతంలోనే శివలింగమూ లభించింది. ఇంకో విషయం.. ఈ విగ్రహాలు బయటపడ్డ చోట ఆలయం లాంటివి ఏమీ లేవు.’’ - డాక్టర్ పద్మజ దేశాయి, హిస్టరీ అండ్ ఆర్కియాలజీ లెక్చరర్,రాయచూర్ యూనివర్శిటీ. -
సామాజిక విప్లవ చైతన్యమూర్తికి నీరాజనం
విగ్రహాలు జాతి జీవన వికాస చారిత్రక ప్రతిబింబాలు. సమాజాన్ని చైతన్యపరచే విగ్రహాలు మౌన సందేశాలకు ప్రతిరూపాలు. భారతదేశం మినహా ప్రపంచదేశాల్లో ఇప్పటికి లక్షకు పైగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు ఉన్నాయని అధికారిక అంచనా. ప్రపంచ దేశాలు అంబేడ్కర్ జ్ఞాన సంపదకూ, సమసమాజ నిర్మాణ రచనా చాతుర్యానికీ, సమయస్ఫూర్తి గల వాగ్ధాటికీ ముగ్ధులై నిత్య నీరాజనాలు పలుకుతున్నాయంటే అది భారతదేశానికి గర్వకారణం. అంబేడ్కర్ సమాజం కోసం జీవించాడు. సమాజ పురోగతి కోసం నిరంతర పోరాటం జరిపిన అసమాన ప్రతిభావంతుడు. తాను నేర్చిన విద్య, విజ్ఞాన సంపద అంతా సమాజం కోసమే వినియోగించాడు. దీన్నే ‘పేబాక్ టు ది సొసైటీ’ అంటారు. అందుకే ఆయన విధానాలను పలు దేశాలు అనుసరిస్తున్నాయి. ‘నా జీవన పోరాటమే నా సందేశం’ (మేరా జీవన్ సంఘర్ష్ హీ మేరా సందేశ్) అని చెప్పిన మాటలే విశ్వ సందేశంగా వినువీధుల్లో వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అంబేడ్కర్ విగ్రహాలు నెలకొల్పి తమకున్న గౌరవాన్ని చాటుకున్నాయి. అమెరికాలో మిచిగన్ విశ్వవిద్యాలయం (1993)లో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2023 అక్టోబరు 14న మేరీలాండ్‌లో ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ అనే పేర 19 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిలిపారు. 1996లో టొరంటో విశ్వవిద్యాలయం (కెనడా) కూడా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొంది. ఇక బ్రిటన్‌లో చాలానే ఉన్నాయి. లండన్, బర్మింగ్ హామ్, మాంచిస్టర్లలో పలు విగ్రహాలను నెలకొల్పారు. అలాగే అంబేడ్కర్ చదివిన ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’ ముఖద్వారంలో 2000లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జర్మనీలోని బెర్లిన్, మ్యూనిక్, ఫ్రాంక్ ఫర్ట్లలో; జపాన్‌లోని టోక్యో, ఒకాసా, కొయెటోలల్లో; దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్ బర్గ్, కేప్‌టౌన్, డర్బన్‌లలో; ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెయిన్ వంటి నగరాల్లో; న్యూజిలాండ్‌లోని ఆక్లండ్ తదితర ప్రాంతాల్లో, మారిషస్ (2018), శ్రీలంక (కొలంబో). నేపాల్ (ఖాట్మండు 2019), బంగ్లాదేశ్ (ఢాకా 2021), దుబాయ్‌తో సహా మరెన్నో దేశాల్లో అంబేడ్కర్ విగ్రహాలు నెల కొన్నాయి. తెలంగాణలో గతేడాది ఏప్రిల్ 14న అంబేడ్కర్ ముని మనుమడు ప్రకాష్ అంబేడ్కర్చే 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించబడింది. లక్నోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పార్క్‌కు ‘డాక్టర్ భీమ్రావ్ సామాజిక్ పరిపర్తన్ స్థల్’గా నామకరణం చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రదేశంలోనే జ్యోతిరావ్ ఫూలే, నారాయణగురు, బిశ్రా ముండా, శాయాజి మహరాజ్, కాన్షీ రామ్ విగ్రహాలున్నాయి. ఇక్కడే 124 ఏనుగుల విగ్రహాలు కొలువుదీరి సందర్శకులకు ఆహ్లాదం కలుగచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లెక్కకు మించిన అంబేడ్కర్ విగ్రహాలున్నాయి. వీటికి తోడు విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ. 400 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన 206 అడుగుల విగ్రహాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహపీఠం 81 అడుగుల ఎత్తు ఉంది. దానిపై ప్రతిష్ఠించిన 125 అడుగుల ప్రధాన విగ్రహంతో మొత్తం 206 అడుగుల అంబేడ్కర్ శిల్పం విజయవాడ నలుదిక్కులకూ కనిపిస్తూ, చూడగానే ఆకర్షించేలా ఉంది. ఈ విగ్రహ ప్రదేశం ఒక స్మృతివనంగా భాసిస్తుంది. మూడు అంతస్తులున్న విగ్రహం కింది భాగంలో నాలుగు ఏసీ హాల్స్ ఉన్నాయి. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మినీ థియేటర్, మ్యూజియం, మరో రెండు హాల్స్‌లో అంబేడ్కర్‌కు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధంతో కూడిన ఛాయాచిత్రాలు, మరో మ్యూజియం ఉంది. వీటికి తోడు రెండు వేలమంది కూర్చోవడానికి సరిపడే మరో ఓపెన్ ఎయిర్ థియేటర్‌తో పాటు అందమైన పార్కు, మరో అందమైన ఫౌంటెన్ సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. విగ్రహం రంగు మాసిపోకుండా పాల్యూరెథేన్ కోటింగ్ వేయటం మరో ప్రత్యేకత! 15 మంది ఎక్కడానికి సరిపడ రెండు లిఫ్టులను ఏర్పాటుచేశారు. మూడు అంతస్తుల్లో నిర్మిత మైన ఈ ప్రదేశం ఒక పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతుందనటంలో ఎలాంటి అనుమానం లేదు. అంబేడ్కర్ విగ్రహ ప్రతి ష్ఠతో విజయవాడలో నూతన సాంస్కృతిక వికాసం మరింతగా వృద్ధిచెందుతుంది. దీనివల్ల సమాజ వికాసంతోపాటు దళిత అస్తిత్వానికీ, సర్వమత సామరస్యానికీ, సకల మానవ సౌభ్రాతృత్వానికీ మరింత దోహదం చేకూరుతుంది. ఈ విగ్రహ ప్రాంగణం నిత్యమూ విజ్ఞాన మేధామథనంతోపాటు సకల కళలు అభివృద్ధి చెందే సాంస్కృతిక కేంద్రంగా మారుతుంది. ఈ కేంద్రంలో ఏర్పరచే నూతన పుస్తక భాండాగారం పుస్తక ప్రియులకూ, పాఠకులకూ ఒక విజ్ఞాన వికాస కేంద్రంగా నిత్యం అందుబాటులో ఉంటుంది. అంబేడ్కర్ విగ్రహంతో పోరాటాల పురిటిగడ్డ విజయవాడ నగరానికి కొత్త అందాలు పురివిప్పుకుంటాయి. ఆయన జీవిత సందేశం అడుగడుగునా ప్రతిబింబించి ప్రగతిపథంలో పయనించే ప్రజలకు మార్గదర్శి కాగలదు. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త, 98481 23655 -
సాంస్కృతిక సంబంధాల మెరుగుతోనే ఆర్థిక వృద్ధి
(వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడటం ద్వారా దేశాల మధ్య ఆర్థిక, దౌత్యపరమైన పురోభివృద్ధి సాధ్యమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. భారత్ నుంచి ఎన్నో విలువైన పురాతన విగ్రహాలు, వెలకట్టలేని అతి పురాతన విగ్రహాలు దేశం దాటి వెళ్లాయని, వాటిని తిరిగి భారత్‌కు తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వారణాసిలో జరుగుతున్న జీ20 సాంస్కృతిక శాఖల మంత్రులు, అధికారుల సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 2014 ముందు ప్రభుత్వాలు విదేశాల నుంచి కేవలం 13 పురాతన విగ్రహాలను దేశానికి తిరిగి రప్పిస్తే, మోదీ అధికారంలోకి వచ్చాక దాదాపు 400 పురాతన విగ్రహాలను రప్పించి ఆయా రాష్ట్రాలకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. జీ20 సభ్య దేశాలు, ఆహ్వనిత దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో పాల్గొన్నాయని, అందరి సమ్మతితో శనివారం వారణాసి జీ20 డిక్లరేషన్ ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం అధికారుల స్థాయిలో జరిగిన చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందన్నారు. విలేకరుల సమావేశంలో ఆ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ, ఆ శాఖ కార్యదర్శి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. యూత్ టూరిజం క్లబ్స్దే కీలకపాత్ర విద్యార్థుల్లో వివేకం పెంపొందించేందుకు యూత్ టూరిజం క్లబ్స్ కీలకపాత్ర పోషిస్తాయని కిషన్‌రెడ్డి అన్నారు. ‘సాంస్కృతిక విరాసత్ స్పర్ధ –2023’లో భాగంగా యువ టూరిజం క్లబ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత భవిష్యత్తు అంతా విద్యార్థులదేనని, అందుకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అందిస్తున్న కృషి ఎనలేనిదన్నారు. 99 శాతం విద్యపై దృష్టి పెడితే.. కనీసం ఒక్క శాతమైనా పాఠ్యేతర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. స్పోర్ట్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో గానీ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో గానీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సేవా తత్పరతతోపాటు దేశం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతోనే ‘యువ టూరిజం క్లబ్స్’ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతీ ఇంట్లో కుటుంబసమేతంగా పర్యాటక క్షేత్రాలను సందర్శించాలంటే.. ఎక్కడకు వెళ్లాలో నిర్ణయించేది ఆ కుటుంబంలోని చిన్నారులు, విద్యార్థులేనని అన్నారు. అందుకే వారికి దేశంలోని, సమీపంలోని పర్యాటక క్షేత్రాలపై, ప్లాస్టిక్ రహిత పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
అయోధ్య విగ్రహాల కోసం.. సాలిగ్రామ శిలలతోనే ఎందుకంటే..
లక్నో: ఉత్తర ప్రదేశ్ అయోధ్య రామాలయం కోసం భారీ రాతి శిలలు.. గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకున్నాయి. ఆదివారం నేపాల్ నుంచి బయల్దేరిన ట్రక్కు.. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇవాళ(గురువారం ఫిబ్రవరి 2) అయోధ్యలో అడుగుపెట్టింది. పూజారులు, స్థానికులు దండలేసి.. ఆ పవిత్రమైన రాళ్లను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అప్పజెప్పారు. వాటిని రామ్ సేవక్ పురంలో భద్రపరిచారు ట్రస్ట్ నిర్వాహకులు. మరి వీటికి ఎందుకంత ప్రత్యేకతో చూద్దాం.. ప్రధాన ఆలయంలోని శ్రీరామ, జానకీ విగ్రహాలను చెక్కేందుకు వీటిని ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు రాళ్లలో ఒకటి 30 టన్నులు, మరొకటి 15 టన్నుల వరకు బరువు ఉంటాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. నేపాల్‌లోని మయాగ్డి-ముస్తాంగ్ జిల్లాల గుండా ప్రవహించే కలి గండకి నది ఒడ్డున ఉన్న జలపాతం చెంత నుంచి ఈ రెండు భారీ శిలలను తెప్పించారు. అంతకు ముందు సీత జన్మస్థలంగా భావించే జనక్‌పూర్(నేపాల్)లో వీటికి ప్రత్యేక పూజలు జరిగాయి కూడా. శాలిగ్రాముల ప్రత్యేకత ఏంటంటే.. సాలిగ్రామ (శాలిగ్రామ).. సాలిగ్రామ శిలలని కూడా పిలుస్తారు. నేపాల్ గంకీ రాష్ట్రంలో.. దామోదర్ కుండ్ నుంచి గండకీ నది ఉద్భవిస్తుంది. గండకీ నదికి ఉపనది అయిన కలి గండకీ ప్రవాహ తీరంలోనే ఇవి కనిపిస్తాయి. ఆ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 6వేల ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఈ శిలలను విష్ణు మూర్తికి ప్రతీకలుగా భావిస్తారు. వాస్తవానికి.. ఇవి డెవోనియన్-క్రెటేషియస్ కాలానికి చెందిన అమ్మోనైట్ షెల్ శిలాజాలు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇవి ఇక్కడ ఉంటున్నాయి. హిందువులు ఈ శిలాజాలను పవిత్రమైనవిగా గౌరవిస్తారు. ఎందుకంటే.. మధ్వాచార్య, అస్తమూర్తి(వ్యాసదేవ) నుండి అందుకున్నాడని, అందుకు వాటిపై ఉండే విష్ణు చిహ్నాలు, ముఖ్యంగా శంఖాన్ని పోలి ఉండడమే కారణమని భావిస్తారు. అదీ కాకుండా.. జానకీ మాత జన్మించిన నేల కావడంతో ఈ శిలలకు ప్రత్యేకత సంతరించుకుంది. అక్కడ ఉన్న శిలలకు కోట్లాది ఏళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆ విగ్రహాలు కూడా.. ఉడుపి కృష్ణ మఠంలో కృష్ణ విగ్రహం, బృందావనంలోని రాధా రామన్ ఆలయం, తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం, గర్వాల్లోని బద్రినాథ్ ఆలయంలోని విగ్రహాలు సాలిగ్రామ్ శిలలతోనే తయారు చేసినట్లు తెలుస్తోంది. దేవీ భాగవతా పురాణా, బ్రహ్మవైవర్థ పురాణా, శివ పురాణాలలో సాలిగ్రామ శిలల ప్రస్తావన కూడా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఆదిశంకర రచనలలోనూ.. సాలిగ్రామ(శాలిగ్రామ) శిలల గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. తైత్తిరీయ ఉపనిషత్తులోని 1.6.1వ శ్లోకం, బ్రహ్మ సూత్రాలలోని 1.3.14 శ్లోకాలకు ఆదిశంకర తన విష్ణువు ఆరాధనలో శిల ఉపయోగించడం సుప్రసిద్ధ హిందూ ఆచారంగా ఉండేదని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇవేకాదు.. చాలాచోట్ల సాలిగ్రామ శిలలు కొన్ని నకిలీవి వాడుకలో ఉండడం గమనార్హం. -
‘గణేష్ మహరాజ్ కి జై బోలో’.. భక్తుల సందడి (ఫొటోలు)
-
16వ శతాబ్దపు శిల్పాలను పరిరక్షించుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం, నాగిరెడ్డిపాలెం– మన్నె సుల్తాన్‌పాలెం మధ్య పొలాల్లో క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందిన విజయనగర రాజుల కాలానికి చెందిన వీరభద్రాలయం శిథిలమై, అందులో నిలువెత్తు శిల్పాలు దెబ్బతిన్నాయని, వాటిని పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలని పురావస్తు పరిశోధకుడు, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి (సీసీవీఏ) సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కోరారు. చారిత్రక సంపదను కాపాడి భవిష్యత్ తరాలకు అందించేందుకు సీసీవీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక పరిశోధనా కార్యక్రమంలో భాగంగా ఆదివారం బెల్లంకొండ మండలం పరిసర ప్రాంతాల్లో పర్యటించానని శివనాగిరెడ్డి ప్రకటనలో తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన వీరభద్రుడు, భద్రకాళి శిల్పాలు జీర్ణావస్థలో ఉన్నాయని వివరించారు. నాగిరెడ్డిపాలెం శివారు ప్రాంతంలో ఉన్న క్రీస్తు 16వ శతాబ్దానికి చెందిన శిథిలమైన శివాలయాన్ని కూడా పునర్నిర్మాణం చేసి భావితరాలకు వాటి గొప్పతనాన్ని చాటాలని ఆయన కోరారు. అక్కడ ఉన్న చారిత్రక సంపద గురించి సమీపంలోని గ్రామస్థులకు అవగాహన కల్పించామని పేర్కొన్నారు. -
మట్టిపుట్టలో మహావీరుడు
సాక్షి, హైదరాబాద్: దట్టంగా పెరిగిన ముళ్లచెట్టు.. దాని దిగువన మట్టిపుట్ట.. అందులో మహావీరుడితోపాటు మరో జైనవిగ్రహం. దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న రెండు విగ్రహాలు ఇలా మట్టిపుట్టలో వెలుగుచూశాయి. సిద్దిపేట శివారు పుల్లూరులో వీటిని గుర్తించారు. పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి బుధవారం వాటిని పరిశీలించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులో గిరన్న దిబ్బగా పిలుచుకుంటున్న ప్రాంతంలో వేములవాడ చాళుక్యుల కాలంలో జైన బసది ఉండేది. కాలక్రమంలో అది ధ్వంసం అయింది. దేవాలయ శిథిల రాళ్లు తరలిపోగా మిగిలిన 24వ జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు, మాతంగ యక్షుని శిల్పాలు పక్కనే పడిపోయి క్రమంగా మట్టిలో కూరుకుపోయాయి. కాలక్రమంలో వాటి చుట్టూ పుట్ట పెరిగిపోయింది. వాటి జాడ స్థానికుల ద్వారా తెలుసుకున్న కరుణాకర్, నసీరుద్దీన్ తదితరులు శివనాగిరెడ్డి దృష్టికి తేగా అక్కడికి వెళ్లి వాటిని పరిశీలించారు. 10వ శతాబ్దికి చెందిన విగ్రహాలుగా గుర్తించారు. నల్ల శానపు రాతిపై చెక్కిన ఈ విగ్రహాల్లో.. మహావీరుడి భంగిమ పద్మాసనంలో ధ్యాన ముద్రతో ఉంది. ఇప్పటికీ అక్కడ ఆలయ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మిగిలిన ఈ విగ్రహాలు ఇంకా ధ్వంసం కాకుండా కాపాడాలని వారు గ్రామ స్తులను కోరారు. జైన ఆరాధకులు ముందుకొస్తే ఆలయ పునర్నిర్మాణానికి సహకరిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు. -
"ఈశ్వర్ అల్లా" అంటే ఇదేనేమో
పశ్చిమబెంగాల్: ఇటీవల కాలంలో మతాల పేర్లుతో కోట్లాడుకోవడాలు చూసి ఉంటాం. అలాగే మాట వరసకు ఏదైనా చిన్న మాట అంటే చాలు మా మతాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఘర్షణకి దిగిపోతారు. అంతేందుకు ఒక ప్రాంతం లేదా గల్లీ మొత్తం ఒక మతంగా నివశిస్తారు. కానీ వాటిన్నింటకి విరుద్ధంగా ఒక ముస్లీం కుటుంబం హిందూ దేవుళ్ల విగ్రహాలను తయారు చేయడమే కాక అన్ని మతాలు ఒకటే భావనను కలిగిస్తున్నారు. (చదవండి: సార్ నా గర్ల్‌ఫ్రెండ్ సాక్స్ ఉతక లేదు.... కాబట్టి ఆఫీస్‌కి రాలేను) అసలు విషయంలోకి వెళ్లితే....పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మేదినీపూర్‌లో దాస్పూర్ గ్రామంలోనే ఇస్మాయిల్ కుటుంబం నలభై సంవత్సారాలుగా నివాసం ఉంటున్నారు. ఈ 61 ఏళ్ల ఇస్మాయిల్ వృత్తి రీత్యా విగ్రహాలు తయారు చేస్తాడు. అందులోనూ కాళీ విగ్రహాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. అక్కడున్న గ్రామస్తులకు కాళివిగ్రహాలు కావాలంటే ఇస్మాయిల్కే ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు ఈ కాళిమాత విగ్రహాలను అతని భార్య , ఐదుగురు కుమార్తెలు కలిసి తయారు చేస్తారు. పైగా ఇస్మాయిల్‌కి తన తన కూతుళ్లను చదివించడం తనకు భారమే అయినప్పటికీ నా పిల్లలకి "ఈశ్వర్" "అల్లా" అనే ఇద్దరి దేవుళ్ల ఆశీస్సులు ఉంటాయి కాబట్టి వాళ్లు బాగా చదువుకుని మంచి జీవితాన్ని గడుపుతారని నమ్మకంగా చెబుతాడు. ఈ మేరకు ఇస్మాయిల్ మాట్లాడుతూ..." “నేను చిన్నప్పటి నుండి ఇదే చేస్తున్నాను. మా ఊరి గ్రామస్తులే కాక ఇతర ప్రాంతాల నుండి సైతం ప్రజలు విగ్రహాల కోసం నా వద్దకే వస్తారు. నేను పేదవాడిని కానీ అందరి దీవెనలతో నా కుటుంబాన్ని చక్కగా నడపగలుగుతున్నాను. అంతేకాదు నాకు విగ్రహాలు సిద్ధమైనప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది." అని అన్నాడు. ఈ క్రమంలో ఆ గ్రామంలోని బీరేంద్ర రాయ్ అనే స్థానికుడు మాట్లాడుతూ....ఈ గ్రామంలోని ప్రతి హిందువు దేవతా విగ్రహన్ని ఇస్మాయిల్ తయారు చేస్తాడు. ఇది మాకు కొత్తేమి కాదు. అయినా మనమందరం కలిసి పెరిగాం, కలిసి ఉంటున్నాం, ఇదే మన సంస్కృతి" అని అన్నాడు. కానీ ఈ చిన్న గ్రామం నిజంగా మత సామరస్యాంగా ఎలా జీవించాలో ఎలా కొనసాగించాలో ఐక్యతగా జీవిస్తూ చూపించింది. ఈ మేరకు ఇస్మాయిల్ ప్రజలు ఐక్యత గురించి తెలుసుకునేలా ప్రపంచంలో ఇలాంటి దస్పూర్ గ్రామాలు మరిన్ని ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నాడు. (చదవండి: ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?) -
బంగ్లాదేశ్‌లో మత కలహాలు
ఢాకా/కోల్‌కతా: దుర్గాపూజల సందర్భంగా దైవదూషణకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగ్లాదేశ్‌లో మొదలైన మత కలహాలు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి ఫెని పట్టణంలో హిందువులకు చెందిన ప్రార్థనా మందిరాలు, దుకాణాలపై దాడులు జరిగాయి. విగ్రహాల ధ్వంసం, దుకాణాల లూటీ వేకువజామున 4.30 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో కనీసం 40 మంది గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం పారామిలటరీ బలగాలను రంగంలోకి దించింది. శనివారం దుండగులు మున్షిగంజ్‌లోని కాళీ మందిరంలోని ఆరు విగ్రహాలను ధ్వంసం చేశారని వార్తా సంస్థలు తెలిపాయి. దుర్గా మందిరాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చిట్టగాంగ్‌లోని బంగ్లాదేశ్ హిందు బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనియన్ ఈ నెల 23వ తేదీ నుంచి నిరశన దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. దాడులను నిరసిస్తూ ఢాకాలోని షాబాగ్, చిట్టగాంగ్‌లోని అందర్‌కిల్లాలో ప్రదర్శనలు జరిగాయి. హింసాత్మక ఘటనలకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్ అధ్యక్షుడు మిలన్‌దత్తా డిమాండ్ చేశారు. ఇలా ఉండగా, బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్రభుత్వాన్నిఅస్థిరపరిచే కుట్రలో భాగంగానే దుర్గాపూజ ఉత్సవాల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. బంగ్లా ఘటనలపై విదేశాంగ శాఖ స్పందించింది. పరిస్థితులు చేజారకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో బంగ్లా అధికార యంత్రాంగంతో అక్కడి భారత దౌత్య కార్యాలయం టచ్‌లో ఉందని పేర్కొంది. కోల్‌కతాలో ఇస్కాన్ నిరసన బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులను నిరసిస్తూ ఆదివారం కోల్‌కతాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఎదుట రెండు గంటలపాటు ఆందోళన నిర్వహించారు. -
రాతి విగ్రహాలను అపహరించిన దుండగులు : సిద్ధిపేట
-
రాజులమ్మతల్లి కలలో చెప్పిందని..
చీపురుపల్లి రూరల్: రాజులమ్మ తల్లి కలలో కనిపించి.. మీ భూముల్లో నేను విగ్రహాల రూపంలో ఉన్నాను.. తవ్వకాలు జరిపితే విగ్రహాలు లభ్యమవుతాయని చెప్పిందంటూ పుర్రేయవలస గ్రామానికి చెందిన కంది లక్ష్మి తవ్వకాలకు పూనుకున్నారు. గ్రామానికి సమీపంలోని చీపురుపల్లి–సుభద్రాపురం ప్రధాన రహదారి పక్కన 25 రోజులుగా తవ్వకాలు సాగిస్తున్నారు. వీటి కోసం రూ.లక్షా 50వేలు ఖర్చుచేశారు. ఆర్థిక భారం కావడంతో తవ్వకాలు మధ్యలో ఆపేశారు. అమ్మవారు కలలో కనిపించి మరో 50 అడుగుల లోతు తవ్వితే విగ్రహాలు కనిపిస్తాయని చెప్పడంతో మళ్లీ తవ్వకాలు ప్రారంభించినట్టు లక్ష్మి తో పాటు కుటుంబ సభ్యులు తెలిపారు. విగ్రహాలు లభిస్తే ఇళ్లు, భూమి అమ్మేసైనా సరే గుడి కడతామని చెబుతున్నారు. తవ్వకాలు చూసేందుకు ప్రతిరోజూ జనం క్యూ కడుతున్నారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్ నిత్య పెళ్లికూతురు కేసులో మరో మలుపు -
రామతీర్థానికి సీతారామలక్ష్మణ విగ్రహాలు
సాక్షి, విజయనగరం: రామతీర్థంలో ప్రతిష్టించడానికి సీతారామలక్ష్మణ విగ్రహాలు సిద్ధమయ్యాయి. ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో మూడు విగ్రహాలు రామతీర్థానికి తరలించారు. నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని నీలాచలంపైనున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గల సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో శ్రీరాముడి విగ్రహాన్ని గత నెల 28 వ తేదీ అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలి యని దుండగులు ధ్వంసం చేసిన విషయం విదితమే. చదవండి: గ్రామాల్లో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్: సీఎం జగన్) అయితే ఆ విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాలను పునఃప్రతిష్టించాలని ప్రభుత్వం సంకల్పించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన ఎస్వీ శిల్ప కళాశాలలో విగ్రహాలు తయారు చేయించారు. దేవాదాయశాఖ విజ్ఞప్తి మేరకు విగ్రహాలను 10 రోజుల్లో టీటీడీ తయారు చేయించింది. రాముడు విగ్రహం రెండున్నర అడుగులు, సీతా, లక్ష్మణ విగ్రహాలు రెండు అడుగులు చెక్కారు. రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాల నమూనాతోనే విగ్రహాల తయారీ జరిగింది. చదవండి: రామతీర్థంలో కొలువుకు సీతారాములు సిద్ధం -
దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలు చోరీ
నగరంపాలెం (గుంటూరు): దేవతా మూర్తుల విగ్రహాలను దొంగలించిన ఓ యువకుడిని గంటలోపే గుంటూరు అర్బన్ పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు లాలాపేట పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం అర్బన్ జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి వివరాలను మీడియాకు వెల్లడించారు. జిన్నాటవర్ కూడలిలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవన సముదాయంలో శ్రీకుసుమ హరనాథ ఆలయం ఉంది. ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో ఓ యువకుడు మద్యం మత్తులో ఆలయంలోకి ప్రవేశించాడు. ఆ యువకుడు వెళ్లిపోయాక ఆలయంలో కుసుమ, హరనాథ ఉత్సవ మూర్తుల ఇత్తడి విగ్రహాలు కనిపించలేదు. దీంతో ఆలయ వాచ్‌మన్ కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించారు. బీఆర్ స్టేడియం కూడలిలోని కోడిగుడ్డు సత్రం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న.. పాతగుంటూరులోని కట్టావారివీధికి చెందిన పోలిశెట్టి దుర్గను అరెస్ట్ చేశారు. అతని వద్ద శ్రీకుసుమ, హరనాథ ఇత్తడి విగ్రహాలను స్వాదీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.10 వేలు ఉంటుంది. దుర్గపై గతంలో పలు కేసులున్నాయి. చెడు వ్యసనాలకు బానిసగా మారిన దుర్గ దొంగతనాలు చేసేవాడని, దీనిలో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. గంటలోపే కేసును ఛేదించిన ఎస్ఐ నాగేంద్ర, కానిస్టేబుల్ వెంకటేశ్వరరావును అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు. -
సీఎంకు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రతిపక్షాలే చేశాయేమో?
తిరుమల: రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవాలయాల పరిరక్షణకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సినీ హీరో సుమన్ కోరారు. ఆదివారం తిరుమలలోని ఓ అతిథిగృహంలో ఆయన మాట్లాడుతూ రామతీర్థం ఘటనలో విగ్రహాలను ఎవరు ధ్వంసం చేశారో నిర్ధారణకు రాకుండా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిందలు వేయడం తగదన్నారు. ముఖ్యమంత్రికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు ప్రతిపక్ష నాయకులే విగ్రహాలు ధ్వంసం చేసి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా నిందితులను గుర్తించడకుండా ఒకరిమీద మరొకరు నిందలు వేసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారు దేవుని చేతిలో తప్పకుండా శిక్షను అనుభవిస్తారని చెప్పారు. సీసీ కెమెరాలతో ఆలయాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై కుట్ర జరుగుతోంది: మంత్రి చెల్లుబోయిన రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసే అవకాశం లేకపోవడంతో టీడీపీ నాయకులు దైవ నిందలకు పాల్పడుతున్నారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దైవ అపచారాల్లో కుట్రకోణముందన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విగ్రహాల ధ్వంసం కేసులో నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
42 ఏళ్ల క్రితం చెన్నైలో చోరీ.. లండన్‌లో దొరికాయి!
చెన్నై: 42 సంవత్సరాల క్రితం దొంగిలించబడిన మూడు విగ్రహాలు తిరిగి ఆలయానికి చేరాయి. వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని నాగపట్నం జిల్లా అనంతమంగళంలో ఉన్న పురాతన రాజగోపాల స్వామి ఆలయంలో 42 సంవత్సరాల క్రితం దొంగిలించబడిన మూడు విగ్రహాలు తిరిగి ఆలయానికి చేరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. లండన్‌లో స్వాధీనం చేసుకున్న ఈ విగ్రహాలు చెన్నై నుంచి శనివారం ఆలయానికి చేరుకున్నాయి. 1978లో, 15 వ శతాబ్దపు ఈ ఆలయానికి చెందిన రాముడు, సీత, లక్ష్మణ, హనుమంతుడి విగ్రహాలు దొంగిలించబడ్డాయి. ఆ రోజుల్లో పోరయార్ పోలీసులు కేసు నమోదు చేసి, ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే విగ్రహాలను గుర్తించలేకపోయారు. (శశికళ ఆశలు అడియాశలు..!) కాగా.. అంతర్జాతీయ మార్కెట్లో కళాఖండాల వ్యాపారాన్ని పర్యవేక్షించే సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చిన సమాచారం మేరకు దొంగిలించబడిన నాలుగు విగ్రహాలలో మూడు విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లండన్‌లోని ఒక పురాతన వస్తువులను సేకరించే వ్యక్తి వద్ద నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా... శుక్రవారం ముఖ్యమంత్రి పళనిస్వామి చెన్నైలోని విగ్రహాలను పరిశీలించి.. వాటిని అధికారికంగా ఆలయ కార్యనిర్వాహక అధికారి శంకరేశ్వరికి అప్పగించారు. (50 అడుగుల బావిలో గున్న ఏనుగు) -
అయోధ్యలో బయటపడ్డ దేవతా విగ్రహాలు
లక్నో : అయోధ్యలో పురాతన దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. రామజన్మభూమిలో స్థలాన్ని చదును చేస్తున్న క్రమంలో విరిగిన దేవతా విగ్రహాలతో పాటు ఐదు అడుగుల ఎత్తైన శివలింగం, ఏడు నల్లరాతి స్థంభాలు, ఆరు ఎర్ర రాతి స్థంభాలు, కలశంతో పాటు పలు పురాతన వస్తువులు లభించాయి. ఈ విషయం గురించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాజ్ మాట్లాడుతూ.. 'రామ జన్మభూమిలో గత పది రోజులుగా భూమిని చదును చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ శిథిలాలను తొలగిస్తున్నారు. (వీహెచ్‌పీ మోడల్లోనే మందిర్..) ఈ తవ్వకాల్లో పిల్లర్లతోపాటు శిల్పాలు వెలుగు చూశాయ'న్నారు. దీని గురించి విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) స్పందించింది. ఈ మేరకు వీహెచ్‌పీ నేత వినోద్ భన్సాల్ మాట్లాడుతూ.. మే 11న రామాయలం పనులు ప్రారంభమైనప్పటి నుంచి తవ్వకాల్లో పూర్ణ కుంభం వంటి ఎన్నో అవశేషాలు లభించాయన్నారు. కాగా యేళ్ల తరబడి వివాదాల్లో నానుతున్న అయోధ్య సమస్యను సుప్రీంకోర్టు గతేడాది పరిష్కరించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రామజన్మభూమి స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ తీర్పు వెల్లడించింది. మరోవైపు మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు వేరే ప్రదేశంలో ఐదు ఎకరాలను కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. (తాత్కాలిక ఆలయంలోకి రాముని విగ్రహం) -
400 ఏళ్ల తర్వాత మగాళ్లకు...
భువనేశ్వర్ : ఒడిశాలో ఓ పురాతన ఆలయంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సాంప్రదాయాలను పక్కకు పెట్టి తొలిసారి మగవాళ్లను గుళ్లోకి అనుమతించారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఏనాడూ పురుషులు గర్భగుడిలో అడుగుపెట్టింది లేదు. అలాంటిది ఈ ఘటన చోటుచేసుకోవటంతో జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. వివరాల్లోకి వెళ్తే... కేంద్రపారా జిల్లాలో సతాభ్యా అనే లంక గ్రామంలో పంచువారాహి అమ్మవారి ఆలయం ఉంది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయంలో మగవాళ్లకు అనుమతి లేదు. ఐదుగురు దళిత మహిళలు(వివాహితులై ఉండాలి) మాత్రం నిత్యం ఆలయ శుద్ధి, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇదిలా ఉంటే బంగాళా ఖాతంలో నీటి మట్టం పెరిగిపోతుండటం.. దాని ఒడ్డున్న ఉన్న గ్రామాలకు(అందులో సతాభ్యా కూడా ఉంది) ముంపు ముప్పు నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం గ్రామాల తరలింపు కార్యక్రమం చేపట్టింది. ఒడిశా డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ-ప్రపంచ బ్యాంకులు సంయుక్తంగా ఓడీఆర్పీ పేరిట ఆపరేషన్ నిర్వహించాయి. ఇందులో భాగంగా సతాభ్యా గ్రామాన్ని బాగాపాటియా ప్రాంతానికి తరలించారు. అయితే ఇంతకాలం తమను రక్షిస్తూ వస్తున్న అమ్మవారిని వదిలేయటానికి వాళ్లు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో విగ్రహాలను తరలించేందుకు నిర్ణయించారు. విగ్రహాల తరలింపు... సతాభ్యా నుంచి బాగాపాటియా 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ అధికారుల సాయంతో గ్రామస్థులు కొత్త ఆలయం నిర్మించుకున్నారు. అయితే విగ్రహాల తరలింపు ఆ మహిళా పూజారులకు కష్టతరంగా మారింది. ఐదు భారీ రాతి విగ్రహాలు ఒక్కోక్కటి టన్నున్నర బరువు ఉన్నాయి. దీంతో వాళ్లు పురుషుల సాయం తీసుకున్నారు. ఏప్రిల్ 20వ తేదీన ఐదుగురు వ్యక్తుల సాయంతో విగ్రహాలను తొలగించి.. పడవ ప్రయాణం ద్వారా కొత్త ఆలయానికి తరలించారు. ఆపై వాటికి శుద్ధి కార్యక్రమం నిర్వహించి.. తిరిగి పూజలు ప్రారంభించారు. -
దేవతా విగ్రహాలు కూడా అక్కడి నుంచే..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతీయుల్లో జాతీయ భావం పెరిగింది. ఫలితంగా దేశంలో ఉన్న 82 శాతం హిందూ మత విశ్వాసకుల్లో దైవ చింతన కూడా పెరిగి దేవతా విగ్రహాల కొనుగోళ్లు కూడా పెరిగిందట. ఏ పట్టణంలో, ఏ బజారుకెళ్లిన మనకు నచ్చే దేవతా విగ్రహాలు ఇట్టే దొరుకుతున్నాయి. అవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయో మనకు తెలియదు. దుకాణదారుడికి కూడా తెలియకపోవచ్చు, తెలిసినా చెప్పడు. ఎందుకంటే అవన్ని కూడా చైనా నుంచే దిగుమతి అవుతున్నాయట. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్ల విగ్రహాలను చైనా మార్కెట్ భారత్‌లో విక్రయించినట్లు ఓ అధ్యయనంలో తేలింది. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, వచ్చీరాగానే ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని తీసుకొచ్చారు. దానికి విస్తత ప్రచారాన్ని కల్పించారు. అయినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పులేదు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా చైనా వస్తువులను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో విస్తతంగా ప్రచారం జరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే చైనా వస్తువులు దేశీయంకన్నా చౌకవడమే. డబ్బుల దగ్గరకి వచ్చేసరకల్లా భారతీయులు జాతీయ భావాన్ని పక్కన పడేస్తున్నారు. ఒక్క 2016 సంవత్సరంలోనే భారత్ నుంచి చైనాకు 26,400 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరగ్గా, చైనా నుంచి భారత్‌కు 2,09,800 కోట్ల రూపాయల దిగుమతులు జరిగాయి. భారత్, చైనా మధ్య కుదుర్చుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కూడా చైనాకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. చైనా, భారత్‌ల మధ్య ఎగుమతి, దిగుమతుల నిష్పత్తి రేషియో 6–1గా ఉంది. చైనా వస్తువులు చౌకవడానికి చాలా కారణాలున్నాయి. కారణాలు..... 1. ఏ వస్తువులనైనా చైనా భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. ఓ భారతీయ ఉత్పత్తిదారుడి వద్ద మూడు ప్లాస్టిక్ ఇంజెక్షన్ మౌల్డింగ్ యంత్రాలుంటే చైనా ప్రత్యర్థి వద్ద 70 ఉంటాయి. ఎక్కువ యూనిట్లు ఉండి, ఎక్కువ ఉత్పత్తి చేస్తే ధర తగ్గుతుందని తెల్సిందే. 2. మ్యాక్ కిన్సే రిపోర్టు ప్రకారం భారతీయ కార్మికులతో పోలిస్తే చైనా కార్మికుల ఉత్పాదన రేటు నాలుగు నుంచి ఐదింతలు ఎక్కువ. భారత కార్మికులకన్నా జీతాలు ఎక్కువ తీసుకున్నప్పటికీ చైనా కార్మికులు జీతంతో పోల్చినా భారతీయులకన్నా ఎక్కువ పనిచేస్తారు. భారతీయ కంపెనీల్లో అత్యాధునిక యంత్రాలు లేకపోవడం, నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడం, సప్లై చైన్‌ను సరిగ్గా లేకపోవడం తదితర కారణాలే కాకుండా 99 మంది కార్మికుల సంఖ్యను మించకుండా ఉండేందుకు ప్యాక్టరీ సామర్థ్యాన్ని పరిమితం చేయడం. వందా, ఆపైనా కార్మికులన్న కంపెనీకి 1947 నాటి పారిశ్రామిక వివాదాల చట్టం వర్తించడమే అందుకు కారణం. ఈ చట్టం పరిధిలోకి వచ్చే కంపెనీలు నష్టాలు వచ్చినా ప్రభుత్వం అనుమతి లేకుండా కంపెనీని మూయరాదు, ఓ ఉద్యోగిని తీసేయరాదు. ఇలాంటి ఇబ్బందులు చైనా కంపెనీలకు లేవు. 3. అవినీతి ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన 176 దేశాల జాబితాలో భారత్–చైనా దేశాలు రెండూ కూడా 79వ స్థానాన్ని ఆక్రమించాయి. చైనాలో ఉన్నత స్థాయిలో అప్పుడప్పుడు మాత్రమే అవినీతి జరుగుతుండగా, భారత్‌లో కిందిస్థాయిలో తరచూ జరుగుతుందీ. ఫలింగా ఉత్పత్తిపై చైనా అవినీతి ప్రభావం పెద్దగా ఉండడం లేదు. భారత్‌లో ఎక్కువగా ఉంటోంది. 4. కార్మికుల సమ్మెలు కూడా కారణమే భారత దేశంలో దాదాపు 16 వేల బలమైన కార్మిక సంఘాలు ఉన్నాయి. ఇవి దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. కనుక సమ్మెలు, ఆందోళనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ సమ్మెలను నియంత్రించేందుకు కార్మిక చట్టాల్లో సవరణలు తీసుకొస్తానని నరేంద్ర మోదీ ప్రకటించారు. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దేశంలో సమ్మెల వల్ల ఏటా 2.30 కోట్ల మంది పని దినాల నష్టం జరుగుతోంది. చైనాలో అఖిల చైనా కార్మిక సంఘాల సమాఖ్య అనే ఏకైక కార్మిక సంఘం ఉంది. అది కూడా ప్రభుత్వం నియంత్రణలోనే ఉంటుంది. 5. విద్యుత్ అంతరాయం భారత్‌లో విద్యుత్ చార్జీలు ఎక్కువవడమే కాకుండా సరఫరాలో కూడా అంతరాయం ఎక్కువగా ఉంటుంది. పరిశ్రమలకు సరఫరాలో కోత కూడా విధిస్తారు. ఈ పరిస్థితి చైనాలో లేదు. పైగా భారత్‌తో పోలిస్తే చైనాలో రవాణా చార్జీలు కూడా చవకా. 6. స్థలం దొరకడం చాలా కష్టం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు స్థలం దొరకడం భారత్‌లో చాలా కష్టం. ఇరుదేశాల జనాభా దాదాపు ఒకే స్థాయిలో ఉన్న భారత భూభాగం చైనా భూభాగంలో మూడోవంతు ఉంది. కొత్త పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడంలో కూడా భారత్‌లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. బ్యూరోక్రసి ఎక్కువ. 7. ఎగుమతులకు ప్రోత్సాహం చైనా ప్రభుత్వం తమ దేశం నుంచి ఎగుమతులను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. అందుకు కారణం 45 శాతం ఉత్పత్తులు ప్రభుత్వరంగానివే కావడం. భారత్‌లో దేశీయ సరకులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, వాటి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు విధిస్తోంది. -
పూజలో ఎలాంటి విగ్రహాలుండాలి?
అనేక రకాల లోహాలతో తయారుచేసిన విగ్రహాలు చూస్తూవుంటాము. వాటిలో వేటిని పూజలో పెట్టుకోవచ్చు, వేటిని పూజించకూడదు అని కొన్ని సందేహాలొస్తూ వుంటాయి. అయితే, అందంగా వున్నాయి కదా అని మార్కెట్ లో దొరికే చెక్క విగ్రహాలు, మట్టి విగ్రహాలు నిత్య పూజకి వినియోగించ కూడదు. మరి మట్టి విగ్రహాలని గణపతి నపరాత్రులలో, దసరాలలో పూజిస్తాంకదా మరి నిత్య పూజలో ఎందుకు పెట్టుకోకూడదంటారా? మట్టి విగ్రహాలకు పగుళ్ళు వస్తాయి కదా, మరి అలాంటివాటిని పూజించ కూడదుకదా. గణపతి నవరాత్రులలో, దసరాలలో కేవలం ఆ నవరాత్రులలో పూజించి తర్వాత ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేస్తారు కానీ, ఎక్కువకాలం పూజ చెయ్యరు కదా. బంగారం, వెండి, ఇత్తడి, కంచు లోహాలతో తయారయిన విగ్రహాలను పూజలో పెట్టవచ్చు. అయితే ఈ విగ్రహాలు చిన్నవిగా వుండాలి. రాగితో తయారు చేసినది కేవలం గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించవచ్చు. స్ఫటిక విగ్రహాలు విశేష ఫలితాన్నిస్తాయి కానీ అవి పగలకుండా చాలా జాగ్రత్త వహించాలి. అలాగే ఉగ్ర స్వరూపం వున్న విగ్రహాలను, చాలా తేజస్సుతో, భయంకరంగా వున్న విగ్రహాలను పూజించకూడదు. పూజాసమయంలో మన దృష్టి దానిమీద వున్నప్పుడు మనకు ప్రశాంతత తగ్గే అవకాశం వున్నది. చిన్ముద్రతో, అభయ హస్తంతో ఆశీర్వదిస్తున్నట్లుండే విగ్రహాలను పూజిస్తే మనం నమస్కారం చేసి కళ్ళు తెరవగానే ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు, మనవంక శాంతంగా, చిరునవ్వుతో చూస్తున్నట్లు వుంటే మనకి ఎనలేని ప్రశాంతత,ఎక్కడలేని ధైర్యం లభిస్తాయి. అంతకన్నా మన పూజకి పరమార్ధం ఏముంటుంది. -
కాళేశ్వరం రాజగోపురంపై పిడుగు
పాక్షికంగా దెబ్బతిన్న శిఖర భాగం కాళేశ్వరం(మంథని): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రిలింగ క్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ రాజగోపురంపై మంగళవారం పిడుగు పడింది. దీంతో ప్రధాన గోపుర శిఖరం రెండు వైపులా పాక్షికంగా ధ్వంసమైంది. మంగళవారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో పిడుగు పడడంతో గోపురం రెండు వైపులా సింహం విగ్రహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గోపురం కింది భాగంలోని ఒక గదిలో ఉన్న ఆలయ విద్యుత్ మీటర్‌తో పాటు బోర్ మోటార్ స్టార్టర్ బోర్డులు కాలిపోయాయి. భక్తులు దగ్గరగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెద్ద శబ్దంతో పిడుగు పడడంతో భక్తులు పరుగులు తీశారు. ఆలయ రాజగోపురం, ప్రధాన ఆలయానికి అమర్చిన సీసీ కెమెరాలు సైతం కాలిపోయినట్లు ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. ప్రధాన రాజగోపురంపై పిడుగు పడడంతో భక్తులు అపశృతిగా భావిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు, ఈవో శ్రీనివాస్ ఈ విషయంపై మాట్లాడుతూ జరగబోయే అనర్థాన్ని పిడుగు రూపంలో దేవుడే తప్పించాడని పేర్కొన్నారు. ఆలయంలో సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు నిర్వహించాక పునఃనిర్మాణ పనులు చేపడుతామని వివరించారు. -
వైభవంగా దీపార్చన సేవ
ఇంద్రకీలాద్రి : ఇంద్రకీలాద్రిపై కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు జరుగుతున్న దీపార్చన సేవ శనివారం వైభవంగా జరిగింది. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల అనంతరం మల్లేశ్వరస్వామి వారి ఆలయం నుంచి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవ మూర్తులను పల్లకీపై ఊరేగింపుగా రాజగోపురం వద్దకు తీసుకువచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ రాజగోపురం వద్దకు చేరుకున్న ఆది దంపతులకు దీపార్చన సేవ జరిగింది. దీపార్చన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు... శనేశ్వర యంత్ర పూజ అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న యంత్ర పూజలలో భాగంగా శనివారం శని త్రయోదశిని పురష్కరించుకుని శనేశ్వర స్వామి వారి యంత్ర పూజలు జరిగాయి. అర్చకులు కరణం శరత్‌కుమార్ , సుదర్శన కృష్ణలు శనేశ్వర స్వామి వారి యంత్రాన్ని రంగు రంగుల మగ్గులతో వేసి పూజలు నిర్వహించారు. స్వామి వారి యంత్రం చుట్టు ఏర్పాటు చేసిన దీపాలను భక్తులు వెలిగించి పూజలు నిర్వహించారు. పౌర్ణమిన మహా పూజ ఇంద్రకీలాద్రిపై సోమవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మహా పూజ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. రాజగోపురం వద్ద నిర్వహించే ఈ పూజ రాత్రి 7–30 గంటలకు ప్రారంభం కానుంది. రూ. 1,116ల టికెటు కొనుగోలు చేసిన భక్తులు ఈ పూజలో పాల్గొనవచ్చు. -
తెలుగు రాష్ట్రాల్లో మట్టి గణపయ్యల సందడి
-
గణేష్ విగ్రహాల ధరలకు రెక్కలు
సాక్షి,సిటీబ్యూరో: వినాయక నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తుండటంతో నగరంలో పండుగ కళ కనిపిస్తోంది. వైవిధ్య రూపాల్లో. ఆకట్టుకొనే రంగుల్లో తీర్చిదిద్దిన వినాయకులు రకరకాల భంగిమలు. అనేక అవతరాల్లో మార్కెట్లో సందడి చేస్తున్నాడు. మరో మూడు రోజుల్లో కొలువుదీరనుండటంతో బొజ్జగణపయ్య చిన్న విగ్రహాలు మొదలుకొని భారీ విగ్రహాల వరకు వేలాదిగా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు విగ్రహాల కొనుగోలుకోసం ధూల్‌పేట్‌కు తరలి వస్తున్నారు. గత రెండు నెలలుగా విగ్రహాల తయారీలో నిమగ్నమైన ధూల్‌పేట్ కళాకారులు ఒకవైపు విగ్రహాలకు తుదిమెరుగులు దిద్దుతూనే మరోవైపు విక్రయాలకు సిద్ధం చేస్తున్నారు. కాగా గత సంవత్సరం కంటే ఈ ఏడాది గణనాధుల ధరలు బాగా పెరిగాయి. గతంలో రూ.10 వేలకు లభించిన విగ్రహాన్ని ఈ ఏడాది రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. కళాకారుల జీతాలు, ముడిసరుకు ధరలు, రవాణా ఖర్చులు, గోడౌన్ల అద్దెలు భారీగా పెరిగినందునే విగ్రహాల ధరలు పెంచాల్సి వచ్చిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరల కారణంగా దీంతో కోరుకున్న విగ్రహాలను కొనుగోలు చేయలేకపోతున్నామని మండపాల నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏటా సృజనాత్మకతకు పదునుపెడుతూ అద్భుతమైన విగ్రహాలను రూపొందించే ధూల్‌పేట కళాకారులు ఈ ఏడాది కూడా వివిధ రకాల ఆకృతులలో అందమైన విగ్రహాలను తయారు చేశారు. రూ.2 వేల నుంచి రూ.2 లక్షలకు పైగా విలువైన విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. విభిన్నంగా, వినూత్నంగా విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. శివాజీగా, శ్రీకృష్ణుడిగా, తిరుపతి వెంకటేశ్వరుడిగా, రాధా సమేతుడైన గోపాలుడిగా ఆకట్టుకుంటున్నాడు. అర్ధనారీశ్వరుడి సమక్షంలో కొలువైన బొజ్జ గణపయ్య, అంగరక్షకులు, సేవకుల సమక్షంలో మందిరంలో కొలువైన దేవదేవుడు, షిరిడీ సాయిబాబా, ముంబయి గణేశుడిగా, మూషికవాహనుడు, స్పైడర్‌మెన్‌గా, ప్రధాని నరేంద్రమోదీ ధరించే తలపాగా తరహాలో అలంకృతుడై... నవరాత్రి ఉత్సవాల్లో కొలువుదీరేందుకు సిద్ధమయ్యాడు. ధూల్‌పేట్ నుంచి ఏటా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలకు విగ్రహాలను ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాకు కూడా వినాయక విగ్రహాలను ఎగుమతి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 200 కార్ఖానాల్లో విగ్రహాలను అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. గత ఏడాది 18 అడుగుల విగ్రహం ధరS రూ.65వేలు ఉండగా, ఈసారి ఏకంగా రూ.85 వేలకు పెరిగింది. 16 అడుగుల విగ్రహాలకు రూ.70 వేల వరకు చెబుతున్నారు. గత సంవత్సరం రూ. 45 వేలకు లభించిన భారీ విగ్రహాలు ఈ సారి రూ.60 వేలకు పెంచడంతో కొనుగోలుదారులు బిత్తరపోతున్నారు. 15 అడుగు విగ్రహాన్ని కొనేందుకు వచ్చిన వారు 10 అడుగులతో సరిపెట్టుకుంటున్నారు. -
విగ్రహాలు తొలగించాలంటూ ఆందోళన
కందుకూరు: కందుకూరు చౌరస్తా శ్రీశైలం రహదారిపై రాకపోకలకు అడ్డుగా ఉన్న అన్ని విగ్రహాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వ్యాపార సంఘం ఆధ్వర్యంలో షాపులను మూసేసి నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మండల సర్వసభ్య సమావేశం కొనసాగుతున్న హాల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రహదారిపై ఉన్న విగ్రహాలతో రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని, దీంతో డ్రైనేజీ నిర్మాణం లేక మురుగు నీటితో పాటు వర్షం నీరు వెళ్లడం లేదని చెప్పారు. దీంతోపాటు తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రహదారులపై విగ్రహాలు తొలగించాలని స్పష్టంగా ఎందుకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అన్ని విగ్రహాలను వదిలేసి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన వారిపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆందోళనకారులతో తహసీల్దార్ సుశీల, సీఐ విజయ్‌కుమార్ మాట్లాడారు. నెల రోజుల్లో విగ్రహాలు తొలగిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
గబ్బర్ సింగ్, బాహుబలి..వినాయకుడి ప్రతిమలేంటి?
విశాఖపట్నం: వినాయక ఉత్సవాల నిర్వహణ తీరుపై ఉత్తరాంధ్ర సాధు పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మాన్ని పాటించకుండా వినాయక ప్రతిమలను ఏర్పాటు చేయడాన్ని సాధుపరిషత్ ఆక్షేపించింది. గబ్బర్ సింగ్, బాహుబలి, సిక్స్ ప్యాక్ వినాయకుడంటూ ఏర్పాట్లు చేస్తున్నారని సాధువు శ్రీనివాసనంద సరస్వతి మండిపడ్డారు. ఇది అపరాధం, పాపం కాదా అని ప్రశ్నించారు. దేవున్ని దేవునిగానే చూడండి.. విందు వినోదాల కోసం వినాయక ప్రతిమలను ఏర్పాటు చేయొద్దన్నారు. వినాయ చవితి నిర్వహణ పై హైకోర్టులో రిట్ వేస్తామన్నారు. -
'సాగర్ లోనే నిమజ్జనం..డీజేలు వద్దు'
హైదరాబాద్: బక్రీద్, గణేష్ నిమజ్జనం కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సామరస్య పూరిత వాతావరణంలో ప్రజలు పండుగలు జరుపుకోవాలని సూచించారు. గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో హోం మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్ మంత్రులు, భాగ్యనగర్ ఉత్సవ సమితి నేతలు, పోలీసులు, ఇతర శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నెల 24న బక్రీద్, 27న గణేష్ నిమజ్జనం ఉంటుందని నాయిని తెలిపారు. ట్యాంక్ బండ్లోనే గణేష్ నిమజ్జనం ఉంటుందని, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. -
కొలువు తీరిన గణనాథులు
-
బహురూపాయా.. గణేషా..!!