'సాగర్ లోనే నిమజ్జనం..డీజేలు వద్దు' | ganesh idols immersion at tankband says naayani | Sakshi
Sakshi News home page

'సాగర్ లోనే నిమజ్జనం..డీజేలు వద్దు'

Published Tue, Sep 8 2015 8:09 PM | Last Updated on Fri, Aug 3 2018 2:57 PM

ganesh idols immersion at tankband says naayani

హైదరాబాద్: బక్రీద్, గణేష్ నిమజ్జనం కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సామరస్య పూరిత వాతావరణంలో ప్రజలు పండుగలు జరుపుకోవాలని సూచించారు. గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో హోం మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశానికి హైదరాబాద్ మంత్రులు, భాగ్యనగర్ ఉత్సవ సమితి నేతలు, పోలీసులు, ఇతర శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నెల 24న బక్రీద్, 27న గణేష్ నిమజ్జనం ఉంటుందని నాయిని తెలిపారు. ట్యాంక్ బండ్లోనే గణేష్ నిమజ్జనం ఉంటుందని, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement