Excavations At Purrevalasa For Idols: రాజులమ్మతల్లి కలలో చెప్పిందని.. - Sakshi
Sakshi News home page

రాజులమ్మతల్లి కలలో చెప్పిందని..

Published Mon, Jun 14 2021 10:24 AM | Last Updated on Mon, Jun 14 2021 12:13 PM

Excavations At Purrevalasa For Idols - Sakshi

30 అడుగుల పైగా లోతులో తవ్వుతున్న గొయ్యి

చీపురుపల్లి రూరల్‌: రాజులమ్మ తల్లి కలలో కనిపించి.. మీ భూముల్లో నేను విగ్రహాల రూపంలో ఉన్నాను.. తవ్వకాలు జరిపితే విగ్రహాలు లభ్యమవుతాయని చెప్పిందంటూ పుర్రేయవలస గ్రామానికి చెందిన కంది లక్ష్మి తవ్వకాలకు పూనుకున్నారు.  గ్రామానికి సమీపంలోని చీపురుపల్లి–సుభద్రాపురం ప్రధాన రహదారి పక్కన 25 రోజులుగా తవ్వకాలు సాగిస్తున్నారు.

వీటి కోసం రూ.లక్షా 50వేలు ఖర్చుచేశారు. ఆర్థిక భారం కావడంతో తవ్వకాలు మధ్యలో ఆపేశారు. అమ్మవారు కలలో కనిపించి మరో 50 అడుగుల లోతు తవ్వితే విగ్రహాలు కనిపిస్తాయని చెప్పడంతో మళ్లీ తవ్వకాలు ప్రారంభించినట్టు లక్ష్మి తో పాటు కుటుంబ సభ్యులు తెలిపారు. విగ్రహాలు లభిస్తే ఇళ్లు, భూమి అమ్మేసైనా సరే గుడి కడతామని చెబుతున్నారు. తవ్వకాలు చూసేందుకు ప్రతిరోజూ జనం క్యూ కడుతున్నారు.

చదవండి: సాక్షి ఎఫెక్ట్‌: పల్లా ఆక్రమణలకు చెక్‌   
నిత్య పెళ్లికూతురు కేసులో మరో మలుపు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement