ఆంధ్రుల హక్కును గుర్తుచేస్తూ ఒక చేతిలో 'హోదా' ఫ్లకార్డు, రెండో చేతిలో జాతీయ జెండా పట్టుకున్న గణపతి ప్రతిమ అందరినీ ఆకర్శిస్తోంది.
నెల్లూరు(బృందావనం): ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇక్కట్లు చూడలేక గణనాథుడు కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నాడు. అవును. ఆంధ్రుల హక్కును గుర్తుచేస్తూ ఒక చేతిలో 'హోదా' ఫ్లకార్డు, రెండో చేతిలో జాతీయ జెండా పట్టుకున్న గణపతి ప్రతిమ అందరినీ ఆకర్శిస్తోంది.
వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరుకు చెందిన స్వర్ణకారుడు షేక్ ముసవ్వీర్ వినూత్న రీతిలో వెండితో ప్రత్యేక హోదా గణనాథుని సూక్ష్మరూపాన్ని తీర్చిదిద్దాడు. దీనిని తయారు చేయడానికి మూడు రోజులు శ్రమించానని చెప్పిన ముసవ్వీర్ చెప్పారు. ఐదు సెంటీమీటర్ల ఎత్తు, మూడు సెంటీమీటర్ల వెడల్పుతో రూపుదిద్దుకున్న ఈ హోదా వినాయకుడి తయారీకి 1.5 మిల్లీగ్రాముల వెండిని వినియోగించానని ఆయన తెలిపారు. రాష్ట్రానికి హోదా ఇచ్చేలా కేంద్ర పాలకుల మనసు మార్చాలని తాను గణనాథుని వేడుకున్నట్లు ముసవ్వీర్ పేర్కొన్నారు.