
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. టీమ్ ఎన్విజన్ విద్యార్థులు 14 రోజులు పాటు దేవుడికి దూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వహించి గణేష్ ఉత్సవాలను జరిపారు. దాదాపు 2 వేల మంది తెలుగు విద్యార్థులు, తెలుగు ఎన్‌ఆర్‌ఐలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. లేబర్ పార్టీ ఎంపీ నటాలీ హాచిన్స్ కూడా గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమంలో భాగంగా దాదాపు రూ.5 లక్షలకు గణేషుడి లడ్డూను ఆస్ట్రేలియా అల్లుడు సోషల్ మీడియా ఛానల్, డెలీషియస్ మెల్బోర్న్ టీమ్ దక్కించుకుంది. లడ్డు వేలంపాటలో వచ్చిన డబ్బును తెలుగు విద్యార్థుల చారిటీ నిధులుగా వాడుతామని టీమ్ ఎన్విజన్ నిర్వాహకులు అరుణ్ సోనిక్ అండ్ టీమ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment