వినాయక మంటపంలో గొంతు కోసుకుని..! | A man committed suicide at Ganesh mandap | Sakshi
Sakshi News home page

వినాయక మంటపంలో గొంతు కోసుకుని..!

Published Sun, Aug 27 2017 7:18 PM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM

వినాయక మంటపంలో గొంతు కోసుకుని..! - Sakshi

వినాయక మంటపంలో గొంతు కోసుకుని..!

సాక్షి, తిరువళ్లూరు : వినాయకుడి విగ్రహం వద్ద గొంతు కోసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని మనవాలనగర్‌లో కలకలం సృస్టించింది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌ ప్రాంతానికి చెందిన వెంకట్రామన్‌ కుమారుడు శోభన్‌బాబు(35). ఇతనికి వివాహం కాలేదు. ఎనిమిది నెలల క్రితం వెంకట్రామన్‌ అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటినుండి మానసికస్థితి సరిగాలేని శోభన్‌బాబు అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నాడు.

ఈ క్రమంలో శనివారం రాత్రి పదిగంటల సమయంలో మనవాలనగర్‌ సిగ్నల్‌ వద్ద ఉన్న వినాయకుడి విగ్రహం వద్ద తచ్చాడుతూ కనిపించాడు. అనంతరం వినాయక మండపం వద్ద అవసరాల కోసం ఉంచిన బ్లేడుతో ఒక్కసారిగా గొంతు కోసుకున్నాడు. రక్తస్రావం కావడంతో గట్టిగా కేకలు వేస్తూ కింద పడిపోయాడు. స్థానికులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్ల సూచన మేరకు చెన్నైకి తరలించగా అక్కడే చిక్సిత పొందుతూ మృతిచెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన మనవాలనగర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement