Malladi Vishnu Slams Somu Veerraju, Chandrababu Over Ganesh Canopies Restrictions - Sakshi
Sakshi News home page

Malladi Vishnu: ఆ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు.. మల్లాది విష్ణు క్లారిటీ

Published Sun, Aug 28 2022 6:18 PM | Last Updated on Sun, Aug 28 2022 6:36 PM

MLA Malladi Vishnu Slams Somu Veerraju, Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి: వినాయక చవితిని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అబద్దాల కోరుగా మారాడని విమర్శించారు. వినాయకుడిని అడ్డం పెట్టుకుని బీజేపీ, చంద్రబాబు బురద జల్లాలని చూస్తున్నారన్నారు. వినాయక చవితి పందిళ్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని స్పష్టం చేశారు. 

చంద్రబాబు హయాంలోనే మండపాలకు విద్యుత్‌​ ఛార్జీలు వసూలు చేశారన్నారు. సీఎం జగన్‌ వచ్చాక ఎలాంటి చార్జీలు పెంచలేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సోమువీర్రాజు, చంద్రబాబుపై కేసు పెట్టాలని పోలీసుల్ని కోరారు. సోము వీర్రాజుకు దమ్ముంటే పోలవరానికి నిధులు ఇప్పించాలన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని కోరారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. 

అబద్ధపు ప్రచారాలు తగదు
గణేష్‌ మండపాల విషయంలో ఎలాంటి రుసుంలు వసూలు చేయడం లేదని దేవాదాయశాఖ తెలిపింది. సోషల్‌ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేయడం తగదని సూచించింది. రుసుంలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ హెచ్చరించింది.

చదవండి: (కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement