సాక్షి, హైదరాబాద్: సాధారణంగా వినాయక విగ్రహాలను సుద్దా, లేదా మట్టితో తయారు చేస్తారు. కానీ.. నాచారం డివిజన్ బాబానగర్‌కు చెందిన సూర్యప్రకాష్ వివిధ రకాల వస్తువులతో భిన్నవిభిన్న ఆకృతుల్లో వినాయక విగ్రహాలను తయారు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. కాలనీ వాసులతో కలిసి ప్రతి ఏటా గణనాథుడిని కాలనీలో ప్రతిష్టించేవాడు. తానే స్వయంగా వైరటీగా తయారు చేయాలని నిర్ణయించుకొని 2010లో ప్రారంభించాడు. పర్యావరణ రహిత గణనాథుడిని తయారు చేయాలనే సంకల్పంతోనే వైరటీగా తయారు చేయడానికి శ్రీకారం చుట్టినట్లు సూర్యప్రకాష్ ‘సాక్షి’కి తెలిపారు.
11 ఏళ్లుగా..
2010 మొదటగా ఏకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని న్యూస్ పేపర్లలతో తయారు చేశాడు. 2011లో 35వేల టీ కప్పులతో, ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో రకంగా లక్ష ప్రమీదాలతో, 5 వేల లీటర్ల టాటా వాటర్ ప్యాకెట్ల్‌తో వాటర్ పెడల్స్‌తో 18వేల టిష్యూ పేపర్లతో డోరమెన్ బాల్స్‌తో, 6 వేల ఐస్‌క్రీమ్‌లతో వినాయకుడిని తయారు చేశాడు. రెండేళ్ల క్రితం 20 వేల ఇయర్ బడ్స్‌తో 2021కి మూడు కిలోల కాఫీ గింజలతో తయారు చేశాడు. ఈ సారి 25 వేల టీ కప్పులతో తయారు భారీ వినాయకుడిని తయారు చేస్తున్నట్లు సూర్య ప్రకాష్ పేర్కొన్నాడు.
15 మంది సభ్యులతో..
సూర్యప్రకాష్ తాతా, పెద్ద నాన్న, నాన్న మొదటి నుంచి మంచి ఆర్టిస్ట్‌లు సూర్య ప్రకాష్ ఇంటికి కూడా చిత్రకళ అనే పేరు పెట్టారు. వారింట్లో ఎక్కడా చూసిన బొమ్మలు, మొక్కలే కనిపిస్తాయి. తాను వెరైటీగా తయారు చేస్తున్నట్లు తెలుసుకున్న చాలా మంది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, కర్నూలు, చిలుక లూరిపేట, తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలు, హైదరాబాద్‌లో కూడా ఆర్డర్స్ మీదా తన 15 మంది టీమ్ సభ్యులతో తయారు చేయడానికి వెళ్తుంటారు. టీకప్ గణనాథుడి తయారీతో తనకు మంచి పేరు వచ్చిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment