suryaprakash
-
Eco Friendly Ganesha: వెరైటీ కప్పుల గణపయ్య
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా వినాయక విగ్రహాలను సుద్దా, లేదా మట్టితో తయారు చేస్తారు. కానీ.. నాచారం డివిజన్ బాబానగర్‌కు చెందిన సూర్యప్రకాష్ వివిధ రకాల వస్తువులతో భిన్నవిభిన్న ఆకృతుల్లో వినాయక విగ్రహాలను తయారు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. కాలనీ వాసులతో కలిసి ప్రతి ఏటా గణనాథుడిని కాలనీలో ప్రతిష్టించేవాడు. తానే స్వయంగా వైరటీగా తయారు చేయాలని నిర్ణయించుకొని 2010లో ప్రారంభించాడు. పర్యావరణ రహిత గణనాథుడిని తయారు చేయాలనే సంకల్పంతోనే వైరటీగా తయారు చేయడానికి శ్రీకారం చుట్టినట్లు సూర్యప్రకాష్ ‘సాక్షి’కి తెలిపారు. 11 ఏళ్లుగా.. 2010 మొదటగా ఏకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని న్యూస్ పేపర్లలతో తయారు చేశాడు. 2011లో 35వేల టీ కప్పులతో, ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో రకంగా లక్ష ప్రమీదాలతో, 5 వేల లీటర్ల టాటా వాటర్ ప్యాకెట్ల్‌తో వాటర్ పెడల్స్‌తో 18వేల టిష్యూ పేపర్లతో డోరమెన్ బాల్స్‌తో, 6 వేల ఐస్‌క్రీమ్‌లతో వినాయకుడిని తయారు చేశాడు. రెండేళ్ల క్రితం 20 వేల ఇయర్ బడ్స్‌తో 2021కి మూడు కిలోల కాఫీ గింజలతో తయారు చేశాడు. ఈ సారి 25 వేల టీ కప్పులతో తయారు భారీ వినాయకుడిని తయారు చేస్తున్నట్లు సూర్య ప్రకాష్ పేర్కొన్నాడు. 15 మంది సభ్యులతో.. సూర్యప్రకాష్ తాతా, పెద్ద నాన్న, నాన్న మొదటి నుంచి మంచి ఆర్టిస్ట్‌లు సూర్య ప్రకాష్ ఇంటికి కూడా చిత్రకళ అనే పేరు పెట్టారు. వారింట్లో ఎక్కడా చూసిన బొమ్మలు, మొక్కలే కనిపిస్తాయి. తాను వెరైటీగా తయారు చేస్తున్నట్లు తెలుసుకున్న చాలా మంది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, కర్నూలు, చిలుక లూరిపేట, తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలు, హైదరాబాద్‌లో కూడా ఆర్డర్స్ మీదా తన 15 మంది టీమ్ సభ్యులతో తయారు చేయడానికి వెళ్తుంటారు. టీకప్ గణనాథుడి తయారీతో తనకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. -
మంత్రి సునీత అనుచరుడి ఘరానా మోసం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మంత్రి సునీత అనుచరుడు రంగయ్య ఘరానా మోసానికి పాల్పడ్డాడు. జిల్లాలోని సీకేపల్లిలో ఓ రైతు నుంచి భూమి కొనుగోలు చేసి డబ్బు ఎగ్గొట్టాడు. ఎకరా రూ. 2.50 లక్షలకు రైతుతో బేరమాడి.. ఇప్పుడేమో రూ.50 వేలే ఎక్కువ అంటూ రైతు సూర్యప్రకాష్‌ను బెదిరిస్తున్నాడు. దీంతో దిక్కుతోచని స్ధితిలో తనకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించాడు. -
50 శాతం రాయితీతో స్ప్రింక్లర్ల పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్ : తుంపర సేద్యానికి అవసరమైన స్ప్రింక్లర్లను 50 శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ చేయనున్నట్లు మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు(ఏపీఎంఐపీ) ప్రాజెక్టు అధికారి సూర్యప్రకాశ్ మంగళవారం తెలిపారు. ఈ నెలాఖరులోగా 5వేల హెక్టార్లకు సరిపడా స్ప్రింక్లర్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అందుకోసం ఎంపిక చేసిన మండలాలు, గ్రామాల్లో ఈ వారంలో స్ప్రింక్లర్ మేళా నిర్వహించి రైతుల్లో అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. హెక్టారుకు సరిపడా స్ప్రింక్లర్ సెట్ ఖరీదు రూ.18 వేలు కాగా, అందులో రైతులు తమ వాటాగా రూ.9 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. యూనిట్ కింద 25 పైపులు, ఐదు చిరకలు(గన్స్) అందజేస్తామన్నారు. హెచ్ఎల్సీ, హంద్రీ–నీవా కాలువ పరిసర ప్రాంతాల రైతులకు ఇవి ఎంతో ఉపయోగమన్నారు. ఆసక్తి గల రైతులు ఎంఐఏఓలు, ఏపీఎంఐపీ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. -
BJP సభ్యులకు శివప్రకాశ్ క్లాస్
-
తాట తీసి ఉతికి ఆరేసింది....
-
తాట తీసి ఉతికి ఆరేసింది....
ఒకప్పుడు వేధింపులను మహిళలు, యువతులు మౌనంగా భరించేవారు. ఆధునిక సమాజంలోనూ అతివలపై ఆగడాలు ఆగడంలేదు. పరువు పోతుందనో, ఇంకోటో అని భయపడి మహిళలు మౌనంగా వేధింపులు సహిస్తున్నారు. లేదంటే ఎందుకొచ్చిన గొడవ అని సైలెంట్ అయిపోతుంటారు. విద్యాధికులైన మగవలు సైతం వేధింపులపై మిన్నకుండిపోవడం జరుగుతోంది. అయితే ఈ పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తున్నట్టు కనబడుతోంది. ఇందుకు బెంగళూరులో ఓ యువతి చూపిన తెగువే తాజా నిదర్శనం. తన వెంట పడుతున్న పోకిరికి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది బెంగళూరు యువతి. తను అల్లరి చేయాలని చూసిన ఆకతాయి తాటతీసి.. గట్టిగా బుద్ధి చెప్పింది. వేధింపులకు గురి చేస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఆకతాయికి ధైర్యంగా ఎదుర్కొంది. అంతేకాదు తనపట్ల అసభ్యంగా వ్యవహరించి పారిపోతున్న అతన్ని ఆమె వెంటాడి పట్టుకోవడమే కాకుండా.. మరీ చితక్కొట్టింది. మళ్లీ తన జోలికి వస్తే ఖబద్దార్ అంటూ కాళిక అవతారం ఎత్తింది. ఈ తతంగాన్ని ఆమె స్నేహితురాలు వీడియో తీసి ఫేస్బుక్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో ఫేస్ బుక్‌లో హల్ చల్ చేస్తోంది. తనలాగే ఎదురు తిరిగితే పోకిరిలు తోక ముడుస్తారంటూ తోటి స్త్రీలకు ఈ వీడియో ద్వారా సందేశం ఇచ్చింది. ఇప్పుడు ఆ వీడియోకు లైక్‌లు మీద లైక్‌లు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే జయనగర్‌కు చెందిన వీణా ఆషియా...తన స్నేహితురాలితో ఓ రోజు జాగింగ్‌కు వెళ్లేది. అసలు విషయం ఆమె వెర్షన్లోనే విందాం. ‘ఈవ్‌టీజర్‌కు నేను గట్టి గుణపాఠం చెప్పాను. నేను రోజూ జాగింగ్‌కు వెళ్లే పార్కులో ఈ రోజు ఉదయం ఓ వ్యక్తి నన్ను సతాయించాడు. అతన్ని వెంటాడి పట్టుకోవడమే కాకుండా..నాలుగు గట్టిగా అంటించాను. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశా. పోలీసులు ఎంతో అండగా నిలిచారు’ అని ఈ నెల 8న ఆ వీణా ఆషియా తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. ‘మనం కోరుకుంటూనే మార్పు వస్తుందని మహిళలకు చాటేందుకు నేను ఈ వీడియోను ఫేస్బుక్లో పెట్టాను’ అని ఆమె స్పష్టం చేసింది. ఈ వీడియోకు అప్పుడే 4 వేలకు పైగా లైకులు వచ్చాయి. పోకిరి సూర్యప్రకాష్ ప్రస్తుతం ఖాకీల అదుపులో ఉన్నాడు. పోకిరీని బుద్ధి చెప్పిన వీణా ఆషియాకు పోలీసుల నుంచి ప్రశంసలు లభించాయి.