వాళ్లు శపించగలరు.. జాగ్రత్త! | they may feel jealous and curse you, tweets ram gopal varma to vishnu | Sakshi
Sakshi News home page

వాళ్లు శపించగలరు.. జాగ్రత్త!

Published Thu, Sep 17 2015 12:31 PM | Last Updated on Sun, Sep 3 2017 9:34 AM

వాళ్లు శపించగలరు.. జాగ్రత్త!

వాళ్లు శపించగలరు.. జాగ్రత్త!

వినాయక చవితి రోజున వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మాంచి జోరు మీద ఉన్నట్లున్నారు. ముందుగా వినాయకుడిని రకరకాల వెరైటీ కోరికలు కోరి, దేవుడికే అమ్మో అనిపించేలా చేసిన వర్మ.. ఆ తర్వాత హీరో మంచు విష్ణు మీద సెటైర్లు వేశాడు. ఏదో వినాయక చవితి వచ్చింది కదాని అందరికీ శుభాకాంక్షలు చెబుదామని మంచు విష్ణు ట్విట్టర్లో ఓ కామెంట్ పెట్టాడు.

తన రహస్య స్నేహితుడు, దీర్ఘ కాల అభిమాన దేవుడు గణేశుడి దీవెనలు అందరికీ అందాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపాడు. గణపతి బప్పా మోరియా అంటూ అందరినీ పలకరించాడు. అయితే, కాసేపటికల్లా వర్మ ఆ ట్వీట్ చూశాడు. ''నీ రహస్య స్నేహితుడు, అభిమాన దేవుడు ఎవరో అందరికీ తెలియనివ్వకు. అలా తెలిస్తే తిరుపతి, యాదగిరిగుట్టలకు జెలసీ వచ్చి, నిన్ను శపించగలవు జాగ్రత్త..'' అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసి జనమంతా నవ్వుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement