curses
-
ఆ సవరణలు సహకార బ్యాంకులకు శాపాలు
పట్టణ సహకార బ్యాంకుల సమాఖ్య విమర్శ సాక్షి, హైదరాబాద్: సహకార సంఘాల చట్ట సవరణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహకార బ్యాంకులను తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పలువురు ఆందోళన చెందుతున్నారు. అధికారుల తీరు సహకార బ్యాంకుల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏపీ సహకార సంఘాల చట్టాన్ని తెలంగాణకు అన్వయిస్తూ తయారు చేసిన చట్టంలో అనేక మార్పులు, చేర్పులూ చేశారని, అవి పట్టణ సహకార బ్యాంకులకు శాపంగా మారాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బహుళ రాష్ట్ర సహకార పట్టణ బ్యాంకుల సమాఖ్య విమర్శించింది. శుక్రవారం ఇక్కడ ‘తెలంగాణ సహకార సంఘాల చట్టం’పై జరిగిన సదస్సులో సమాఖ్య అధ్యక్షుడు జి.రామమూర్తి మాట్లాడుతూ ఐదేళ్లకోసారి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోవాలని సవరణ తీసుకొచ్చారని, లెసైన్స్ రెన్యువల్ ఉంటుందే కానీ, రిజిస్ట్రేషన్‌కు రెన్యువల్ చేసుకోవాలని పేర్కొనడం అర్థరహితమని అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని కలసి వివరించగా ఆయన కూడా విస్మయం వ్యక్తం చేశారన్నారు. అధికారులను తాము నిలదీయగా ఈ నిబంధన నుంచి పట్టణ సహకార బ్యాంకులకు మినహాయింపు ఇచ్చారని చెప్పారు. సహకార బ్యాంకుల్లో ఎన్నికల అధికారిని నియమించే అధికారాన్ని సహకారశాఖకు కట్టబెట్టి అధికారుల జోక్యాన్ని మరింత పెంచారన్నారు. జనరల్ బాడీ మీటింగ్‌లకు సహకార సంఘాల రిజిస్ట్రార్ హాజరవుతారని పేర్కొన్నారని, ఇది అప్రజాస్వామికమని పేర్కొన్నారు. సమావేశంలో సమాఖ్య చైర్మన్ వేమిరెడ్డి నర్సింహారెడ్డి, డెరైక్టర్ జి.మదన గోపాలస్వామి, సుధా సహకార పట్టణ బ్యాంకు సీఈవో పెద్దిరెడ్డి గణేష్, సమాఖ్య సీఈవో గంగాధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
వాళ్లు శపించగలరు.. జాగ్రత్త!
వినాయక చవితి రోజున వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మాంచి జోరు మీద ఉన్నట్లున్నారు. ముందుగా వినాయకుడిని రకరకాల వెరైటీ కోరికలు కోరి, దేవుడికే అమ్మో అనిపించేలా చేసిన వర్మ.. ఆ తర్వాత హీరో మంచు విష్ణు మీద సెటైర్లు వేశాడు. ఏదో వినాయక చవితి వచ్చింది కదాని అందరికీ శుభాకాంక్షలు చెబుదామని మంచు విష్ణు ట్విట్టర్లో ఓ కామెంట్ పెట్టాడు. తన రహస్య స్నేహితుడు, దీర్ఘ కాల అభిమాన దేవుడు గణేశుడి దీవెనలు అందరికీ అందాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపాడు. గణపతి బప్పా మోరియా అంటూ అందరినీ పలకరించాడు. అయితే, కాసేపటికల్లా వర్మ ఆ ట్వీట్ చూశాడు. ''నీ రహస్య స్నేహితుడు, అభిమాన దేవుడు ఎవరో అందరికీ తెలియనివ్వకు. అలా తెలిస్తే తిరుపతి, యాదగిరిగుట్టలకు జెలసీ వచ్చి, నిన్ను శపించగలవు జాగ్రత్త..'' అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసి జనమంతా నవ్వుకున్నారు. Praying my secret friend and long time favorite Lord Ganesha for his blessings to all. Ganapathi Bappa Moriya!!!!! — Vishnu Manchu (@iVishnuManchu) September 17, 2015 @iVishnuManchu Better not let everyone know ur secret faviourate or thirupathi and Yadagiri Gutta might become jealous and curse you — Ram Gopal Varma (@RGVzoomin) September 17, 2015 -
కౌగిలింతలు.. శాపనార్థాలు!!
ఒకవైపు కౌగిలింతలు.. మరోవైపు శాపనార్థాలు! ఇదీ ఇద్దరు ముఖ్యమంత్రుల తీరు. బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఏర్పాటుచేసిన అలయ్-బలయ్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కలుసుకున్నారు. పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. కేసీఆర్ కొద్దిగా తటపటాయించినా దత్తాత్రేయ చొరవతో ముఖ్యమంత్రులిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అది చూసినవాళ్లంతా ఇంకేముంది, చంద్రులిద్దరూ కలిసిపోయారు.. ఇక రెండు రాష్ట్రాలకు మధ్య గొడవలు ఏమీ లేవన్నట్లే అనుకున్నారు. అయితే.. గట్టిగా కొన్ని గంటలు కూడా గడవక ముందే మళ్లీ ముసలం పుట్టింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణకు కరెంటు రాకుండా అడ్డుకుంటున్న కర్కోటకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో విద్యుత్ ప్లాంట్లు పెట్టని కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యుత్ కొరతకు కారణమని విమర్శించారు. మన కరెంటు మనకు రాకుండా చేసిన కర్కోటకుడు చంద్రబాబేనని, కృష్ణపట్నం రాకుండా అడ్డుకున్న చంద్రబాబును ప్రశ్నించకుండా కొందరు ఆ పార్టీ నాయకులు ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. దీంతో మళ్లీ ఇద్దరి మధ్య ఉన్న పొరపొచ్చాలు మరోసారి బయటపడ్డాయి. ఇంతకుముందు కూడా గవర్నర్ సమక్షంలోను, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు చేతులు కలుపుకొన్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవతో ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. పలు అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని కూడా అంగీకారానికి వచ్చారు. అయినా వ్యవహారం మామూలుగానే ఉంది. ఇద్దరి మధ్య గొడవలు ఏమాత్రం తగ్గలేదన్న విషయం మరోసారి రుజువైపోయింది.