నగరం నడిబొడ్డున... | Manchu Vishnu in Ram Gopal Varma's next | Sakshi
Sakshi News home page

నగరం నడిబొడ్డున...

Published Tue, Apr 29 2014 10:43 PM | Last Updated on Fri, Sep 28 2018 4:53 PM

నగరం నడిబొడ్డున... - Sakshi

నగరం నడిబొడ్డున...

రామ్‌గోపాల్‌వర్మ చిత్రాల్లోని పాత్రలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. దానికి తగ్గట్టే తెరపై ఆర్టిస్టుల బిహేవియర్ ఉంటుంది. అందుకే వర్మ దర్శకత్వంలో నటించడం నటీనటులకు ఓ కొత్త అనుభూతి. ప్రస్తుతం మంచు విష్ణు ఆ అనుభూతినే ఆస్వాదిస్తున్నారు. ఇప్పటికే వర్మ దర్శకత్వంలో ఆయన ‘రౌడీ’ సినిమా చేశారు. ఆ సినిమా ద్వారా నటునిగా మంచి మార్కులే దక్కించుకున్నారు. మళ్లీ వెంటనే వర్మ దర్శకత్వంలో విష్ణు నటిస్తున్నారు.
 
 వెంటవెంటనే ఒకే దర్శకునితో సినిమాలు చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఇదే. అందుకే ఫిలింనగర్‌లో ఇది చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ సినిమా రెండు షెడ్యూల్స్‌ని పూర్తి చేసుకొని మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. హైదరాబాద్ అమీర్‌పేట్ పరిసరాల్లో విష్ణుపై పోరాట దృశ్యాలను వర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ -‘‘ ‘రౌడీ’ తర్వాత వెంటనే వర్మతోనే సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అవుట్‌పుట్ అద్భుతంగా వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement