సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో బహిరంగ స్థలాల్లో గణేశ్ చతుర్ధి ఉత్సవాలపై ఉత్కంఠ వీడిపోయింది. గరిష్టంగా అయిదు రోజులపాటు మండపాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పలు షరతులతో సమ్మతించింది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలనపై పూర్తిగా నిషేధం విధించింది. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అధ్యక్షతన ఆదివారం బెంగళూరులో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ చవితి పండుగ ఆచరణ గురించి వెల్లడించారు.
చదవండి: గణేష్ మండపాల ఏర్పాటులో ఈ జాగ్రత్తలు పాటించండి
గణేశ్ ఉత్సవాలకు షరతులు
► కరోనా నియమాలతో సార్వజనిక గణనాథుల విగ్రహాల ప్రతిష్టాపనకు జిల్లా యంత్రాంగం అనుమతి తప్పనిసరి. తాలూకా, గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అధికారుల అనుమతి ఉండాలి
►నగర ప్రాంతాల్లో వార్డుకు ఒకచోట మాత్రమే విగ్రహం ఏర్పాటు చేయాలి
►గణేశ ఉత్సవ సంఘాలవారు కోవిడ్ టీకా వేసుకోవాలి
►గణనాథుల మండపాల వద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ అభియాన్ నిర్వహించాలి
►మండపాల్లో సాంస్కృతిక ప్రదర్శనలకు, డీజేలకు అనుమతిలేదు
►నిమజ్జన సమయంలో వాయిద్యాలు, ఊరేగింపులకు నో
►సరిహద్దు జిల్లాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 2 శాతం కంటే తక్కువగా ఉన్నచోటే అనుమతిస్తారు.
►నగరాల్లో అపార్టుమెంట్లలో విగ్రహాలను ప్రతిష్టించవచ్చు. 20 మంది కంటే ఎక్కువ మంది గుంపుగా చేరరాదు.
►రాత్రి 9 గంటల తర్వాత విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతి లేదు.
చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment