Bapu Bommaku Pellanta Show, Niharika Wedding Is Special Theme | కొత్త పెళ్లి కూతురుగా నిహారిక‌ - Sakshi
Sakshi News home page

బా‌పు బొమ్మ‌కు పెళ్లంట: సిగ్గు ప‌డుతోన్న నిహారిక‌

Published Thu, Aug 13 2020 3:34 PM | Last Updated on Thu, Aug 13 2020 7:23 PM

Bapu Bommaku Pellanta: Niharika Wedding Is Special Theme - Sakshi

ఇప్ప‌టికే ద‌గ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు మోగ‌గా త్వ‌ర‌లోనే మెగా ఫ్యామిలీలోనూ పెళ్లి ప‌నులు మొద‌ల‌వ్వ‌నున్నాయి. కొణిదెల నాగ‌బాబు కూతురు, హీరోయిన్ నిహారిక త‌న మెడ‌లో కోరుకున్న వ‌రుడితో మూడు ముళ్లు వేయించుకోనున్నారు. త‌న చేయి ప‌ట్టి ఏడ‌డుగులు నడ‌వ‌బోయే ఆ పెళ్లి కొడుకు గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌ కుమారుడు చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ అని సోష‌ల్ మీడియాలో ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ప్రేమ జంట ఫొటోల‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు. అయితే పెళ్లి తేదీ మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు. కానీ ఓ షోలో పెళ్లి కూతు‌రుగా ముస్తాబైన నిహారిక‌ తెగ సంద‌డి చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆమె తండ్రి నాగ‌బాబే జ‌డ్జి కావ‌డం విశేషం. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా "బా‌పు బొమ్మ‌కు పెళ్లంట" అని ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం రాబోతోంది. (హ్యాపీ బర్త్‌డే.. లవ్‌ : నిహారిక)

దీనికి సంబంధించిన ప్రోమోలు యూట్యూబ్‌లో అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక ఈ షోలో నిహారిక ప‌ల్ల‌కి నుంచి దిగారు. ఎప్పుడూ పంచ్‌ల‌తో ఎదుటివారిని మాట్లాడకుండా చేసే నిహారిక‌ కాబోయే భ‌ర్త గురించి అడిగేసరికి సిగ్గుల మొగ్గయ్యారు. భ‌ర్త‌తో క‌లిసి ప్రోగ్రామ్‌కు విచ్చేసిన‌ యాంక‌ర్ అన‌సూయ.. నిహారిక‌కు ముంద‌స్తు కానుక‌ను కూడా అందించారు. మ‌రోవైపు ఈ కార్య‌క్ర‌మంలో జానీ మాస్ట‌ర్‌తో పాటు బిగ్‌బాస్ కంటెస్టెంట్ బాబా భాస్క‌ర్ కూడా పాల్గొన్నారు. ఇదిలా వుంటే నిహారిక, చైత‌న్య‌ల నిశ్చితార్థం నేడు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో‌ ఆర‌ణాల అచ్చ‌ తెలుగు అమ్మాయి నిహారిక కొత్త‌ పెళ్లి కూతురిగా త‌యారైన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. (కుమారి శ్రీమతి కానుంది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement