![Niharika Konidela: Another step into the feature film category - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/11/niharika.jpg.webp?itok=5kSy7m49)
యూనిట్‌కి స్క్రిప్ట్ అందిస్తున్న అల్లు అరవింద్
‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో ఇప్పటివరకు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ చేశాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్‌ప్రారంభించాం. ఇంతమంది కొత్తవాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను’’ అన్నారు నిహారిక కొణిదెల. యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న చిత్రం శుక్రవారంప్రారంభమైంది.
తొలి సన్నివేశానికి నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు. యదు వంశీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ద్వారా 11 మందిని హీరోలుగా, నలుగురిని హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంతో నేను, నా సతీమణి జయలక్ష్మి నిర్మాతలుగా పరిచయమవుతున్నాం’’ అన్నారు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ అధినేత ఫణి. ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్ దేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: మన్యం రమేశ్.
Comments
Please login to add a commentAdd a comment