Actress Niharika Konidela Leg Palm Injured In Shooting Photo Goes Viral - Sakshi
Sakshi News home page

నిహారిక కాలికి గాయం..సేవలు చేస్తున్న చైతన్య

Published Sun, Mar 7 2021 2:06 PM | Last Updated on Sun, Mar 7 2021 4:48 PM

Niharika Leg Injured Photo Goes Viral - Sakshi

మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక వివాహం గతేడాది డిసెంబర్‌ 9న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మెగా డాటర్‌ భర్త చైతన్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తుంది. అలాగే వృత్తి పరంగాను బిజీగా ఉంది. పెళ్లి త‌ర్వాత తొలి వెబ్ సిరీస్ మొద‌లు పెట్టిన నిహారిక ప్ర‌స్తుతం దానికి సంబంధించిన షూటింగ్‌తో బిజీగా ఉంది. అయితే షూటింగ్‌ సమయంలో నిహారిక కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. కాలికి పట్టి కట్టిన ఫోటోని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసిన నిహారిక.. ‘భార్యను భర్త బుజ్జగిస్తున్న కార్యక్రమంలో నేటి ఎపిసోడ్ ఏంటంటే.. ''కాటన్ క్యాండీ'' అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఆ ఫొటో తన చేతిలో ఓ బాక్స్ కనిపించింది.

అందులో కాటన్ క్యాండీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన కాలికి గాయం అయిన విషయాన్ని మాత్రం నిహారికగా డైరెక్ట్‌గా చెప్పలేదు. అసలు ఆ గాయం ఎందుకు అయిందో కూడా పేర్కొనలేదు. కానీ ఫొటోలో ఆమెకు కాలికి ఉన్న పట్టీ చూసి.. ఖచ్చితంగా గాయపడిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె  రాయుడు చిత్రాలు బ్యానర్‌పై భాను రాయుడు దర్శక నిర్మాతగా  రూపొందుతున్న ఓ  వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో మరో కీలక పాత్రలో యాంకర్‌ అనసూయ నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement