![Velampalli Srinivasarao About Vinayaka Chavithi Brahmotsavalu At Kanipakam - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/29/Velampalli-Srinivasarao.jpg.webp?itok=BOm43iSg)
సాక్షి, చిత్తూరు: వినాయక చవితి పర్వదినం సందర్భంగా వరసిద్ధి వినాయక స్వామికి బంగారు రథం చేయించాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాధాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాణిపాకంలో స్వయంభువుగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి రూ. 6కోట్ల వ్యయంతో బంగారు రథం తయారికి అనుమతి ఇచ్చామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత నాణ్యతతో రథాన్ని తయారు చేయిస్తున్నట్లుగా వివరించారు. ఇక పోతే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 2-22 వరకు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభంగా జరపనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులకు వసతి, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. అంతేకాక ఆలయంలో పరిశుభ్రత పాటించాలని ఈవో, ఇతర అధికారులను శ్రీనివాసరావు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment