Velampalli Srinivasa Rao
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు (ఫొటోలు)
-
సీఎంపై హత్యాయత్నానికి సూత్రధారి ‘బొండా’నే
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, తనపై హత్యాయత్నానికి సూత్రదారి టీడీపీ నాయకుడు బొండా ఉమానే అని వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజతో కలిసి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 28వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారమే సీఎం జగన్‌పై టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని, బొండా ఉమా, ఏ2 దుర్గారావులు దగ్గరుండి మాపై హత్యాయత్నం చేయించారని ఆరోపించారు. దీనికి సూత్రధారి బొండా ఉమా కాగా, మూలకారకుడు చంద్రబాబేనని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించిన అంశాలన్నీ బొండా ఉమా చుట్టూనే తిరుగుతున్నాయని, రాజకీయంగా తమను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ఇలా టీడీపీ నాయకులు రౌడీయిజం, గూండాయిజాన్ని పోషించి హత్యాయత్నాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. బొండా ఉమాకు నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ఉమా ఘోర ఓటమిని చవిచూడడం తథ్యమన్నారు. నిందితులు ఎందుకు టచ్‌లో ఉన్నట్టు? ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగితే పోలీసు అధికారులు విచారణ జరపడం తప్పా? అధికారులను బెదిరిస్తే నిజం అబద్దమవదనే విషయాన్ని బొండా ఉమా తెలుసుకోవాలని వెలంపల్లి హితవుపలికారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టం తనపని తాను చేసుకువెళుతుంటే బొండా ఉమాకు ఎందుకు వెన్నులో వణుకు పుడుతోందని ప్రశ్నించారు. సీఎం జగనన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెడుతుంటే.. చంద్రబాబు వారిని రౌడీలుగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఎవరైనా తమ మీద తామే దాడి చేయించుకుంటారా? దాడి ఘటనలో కన్నుకు దెబ్బ తగిలి ఇబ్బంది పడుతుంటే బొండా ఉమాకు కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా దు్రష్పచారం చేయడం దుర్మార్గమన్నారు. ‘సీఎంపై హత్యాయత్నం చేసినవారు బొండా ఉమాతో ఎందుకు టచ్‌లో ఉన్నారు? సతీష్ తల్లిదండ్రులు బొండా ఉమా ఇంటికి ఎందుకు వెళ్లారు?’ అని ప్రశ్నించారు. బొండా ఉమా, ఆయన ఇద్దరు కుమారులు చేస్తున్న రౌడీయిజానికి కచ్చితంగా అడ్డుకట్ట వేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో ఏ2గా ఉన్న దుర్గారావు, బొండా ఉమా ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ఈ దాడి చేయించారని ఆయన ఆరోపించారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని కోరారు. -
జాతీయ పతాక రూపకల్పనకు బెజవాడ వేదిక
విజయవాడ కల్చరల్: జాతీయ పతాకం రూపకల్పనకు బెజవాడ వేదిక కావడం గర్వకారణమని దేవదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఎక్స్‌రే సాహిత్యసేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జాతీయ పతాక రూపకల్పన శతజయంతి వేడుకలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు జాతీయ కీర్తిపతాక పురస్కారాల కార్యక్రమం జరిగింది. వెలంపల్లి మాట్లాడుతూ జాతీయ పతాకం రూపకల్పనకు తెలుగు జాతి రత్నం పింగళి వెంకయ్య పూనుకోవడం చరిత్ర చెప్పిన సాక్ష్యమన్నారు. శాసనమండలి సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ పింగళి వెంకయ్య సేవలను నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సంస్థ అధ్యక్షుడు కొల్లూరి అధ్యక్షతన నిర్వహించిన సభలో పింగళి వెంకయ్య మనుమరాలు పింగళి రమాదేవి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కె.విద్యాధరరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులకు జాతీయ కీర్తి పతాక పురస్కారాలను అందజేశారు. -
రూ.3 కోట్లతో రామతీర్థం ఆలయ పునఃనిర్మాణం
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీరామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి, పునఃనిర్మాణానికి మూడుకోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఆయన సోమవారం దేవదాయశాఖ కార్యదర్శి గిరిజాశంకర్, ప్రత్యేక కమిషనర్ అర్జునరావు, ఆర్జేసీ భ్రమరాంబ, ఎస్ఈ శ్రీనివాస్‌తో సమావేశం నిర్వహించారు. 700 అడుగుల ఎత్తులో కొండపై ఉన్న స్వామి ఆలయాన్ని పూర్తిగా రాళ్లతోనే పునఃనిర్మించాలని నిర్ణయించారు. ఒకటి రెండు నెలల ముందు వరకు కనీసం విద్యుత్ సౌకర్యం లేని ఈ ఆలయ పరిసరాల్లో పునఃనిర్మాణ ప్రక్రియలో భాగంగా విద్యుత్ దీపాలంకరణ చేయాలని, కొండపైన శాశ్వత నీటివసతిని కల్పించాలని, ఆలయ ప్రాకారం నిర్మించాలని నిర్ణయించారు. కొత్తగా హోమశాల, నివేదనశాల నిర్మించటంతోపాటు ధ్వజస్తంభం ప్రతిష్టించాలని నిర్ణయించారు. కొండపైన ఆలయం వద్ద సహజ సిద్ధంగా ఉన్న కోనేటిని పూర్తిస్థాయిలో ఆధునికీకరించి దాని చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, ఆలయం వద్దకు వెళ్లేందుకు ఇప్పుడున్న ఇరుకు మెట్ల మార్గాన్ని బాగా వెడల్పు చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 13న అంతర్వేది ఆలయ రథప్రతిష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణం వేగంగా పూర్తయింది. ఫిబ్రవరి 13న కొత్తగా నిర్మించిన రథానికి అభిషేకం, పుర్ణాహుతి, రథప్రతిష్ట కార్యక్రమాలను దేవదాయశాఖ అధికారులు నిర్వహించనున్నారు. మూడురోజుల పాటు నూతన రథానికి వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం సంప్రోక్షణ చేస్తారు. 11న సంకల్పం, 12న అధివాస కార్యక్రమం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 22వ తేదీన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది. 23న స్వామి ఊరేగింపును కొత్త రథంపై నిర్వహిస్తారు. -
రేపటి నుంచి విగ్రహాల పునఃప్రతిష్ట సన్నాహక పనులు
సాక్షి, అమరావతి: రామతీర్థం శ్రీరామస్వామి వారి ఆలయంలో విగ్రహాల పునః ప్రతిష్ట సన్నాహక కార్యక్రమాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విగ్రహ పునఃప్రతిష్టతో పాటే ఆగమ పండితుల సలహాలతో పురాతన ఆలయాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పునః ప్రతిష్టకు ముందు చేపట్టాల్సిన పనులు ప్రారంభించేందుకు దేవదాయ శాఖ అధికారులు సోమవారం ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించనున్నారు. హోమం అనంతరం సంప్రదాయ బద్ధంగా ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసే బాలాలయంలో ఉంచుతారు. ఆలయంలోని గర్భాలయం పాతకాలపు కట్టడం అయినా ఇప్పటికీ పటిష్టంగా ఉండడంతో గర్భాలయ గోడలను అలానే ఉంచుతూ.. లోపలి భాగాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. గర్భాలయం ముందు భాగాన ఉన్న మండపం, భక్తులు ప్రదక్షిణ చేసే ప్రాకారం వంటి వాటిని కూడా పూర్తిస్థాయిలో పునర్నిర్మించాలని నిర్ణయించింది. కొండపై ఉన్న ఆలయం వద్ద ఏ పనులు చేపట్టాలన్నా తగిన స్థాయిలో నీటిని అందుబాటులో ఉంచేందుకు యుద్ధప్రాతిపదికన కొండపై నీటి ట్యాంకును కూడా దేవదాయ శాఖ ఏర్పాటు చేయనుంది. కొండపై ఆలయం వద్దకు భక్తులు సులభంగా వచ్చి వెళ్లేందుకు వీలుగా మెట్ల మార్గాన్ని కూడా విస్తరిస్తారు. కొండపై ఆలయాన్ని ఆనుకుని ఉన్న కోనేరును కూడా ఆధునికీకరిస్తారు. ఇదిలా ఉండగా, రామతీర్థం ఆలయంలో పునః ప్రతిష్టించేందుకు శ్రీరాముడి మూలవిరాట్ విగ్రహంతో పాటు సీతమ్మ, లక్ష్మణుడి విగ్రహాలను టీటీడీ శిల్పులు ఈ నెల 23 నాటికి సిద్ధం చేస్తారు. ఆయా కార్యక్రమాల పర్యవేక్షణకు దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంబను ప్రత్యేకాధికారిగా నియమించారు. ఆలయ ఆధునికీకరణపై రేపు మంత్రి సమీక్ష శ్రీరామస్వామి గర్భాలయాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మించాలని ఒకరిద్దరు స్వామీజీలు దేవదాయ శాఖకు సూచన చేసినట్టు తెలిసింది. ఆ సూచనలను ఇతర ఆగమ పండితుల దృష్టికి తీసుకెళ్లే విషయమై దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సోమవారం శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. -
పోస్టల్ ద్వారా ఆలయాల నుంచి ప్రసాదాలు
సాక్షి,అమరావతి/వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో పెద్ద, ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలు వంటివి భక్తులకు చేరవేసేందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్టు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. దీనికోసం పోస్టల్ శాఖ సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ పంచారామాలైన అమరారామం (అమరావతి), సోమారామం (భీమవరం), క్షీరారామం (పాలకొల్లు), భీమారామం (ద్రాక్షారామం), కుమారారామం (సామర్లకోట) చిత్రాలు ముద్రించిన ఐదు రకాల పోస్టు కార్డులను పోస్టల్ శాఖ ప్రత్యేకంగా రూపొందించింది. ఈ పోస్టుకార్డులను మంత్రి వెలంపల్లి బుధవారం విజయవాడలోని మంత్రి కార్యాలయంలో ఆవిష్కరించారు. అదే సమయంలో ఆయా ఆలయాల్లోనూ పోస్టల్ శాఖ, దేవదాయ శాఖ అధికారులు పోస్టుకార్డుల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆన్లైన్లో ఏకకాలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయాలు, దేవాలయాలపై పోస్టు కార్డులు ప్రింట్ చేయడం సంతోషకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లు, విజయవాడ సర్కిల్ పోస్ట్ మాస్టర్ జనరల్ టి.యం. శ్రీలత, రీజియన్ పోస్టల్ డైరెక్టర్ ఎస్.రంగనాథన్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్ కేవీఎల్ఎన్ మూర్తి, విజయవాడ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ కందుల సుదీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
‘గోవును పూజిస్తే తల్లిని పూజించినట్టే’
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ‘గుడికో గోమాత’ కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి హిందూ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి వెల్లంపల్లి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ,టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, జేఈవో బసంత్ కుమార్, రమణ దీక్షితులు, దుర్గ గుడి ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు, ఎమ్మెల్యే జోగి రమేష్, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘గుడికో గో మాత’ కార్యక్రమం ప్రారంభించాలని టీటీడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. గోవును పూజిస్తే తల్లిని పూజించినట్టే. అన్ని దేవాలయాలకు గోవులను అందజేస్తాం. భక్తులు కూడా టీటీడీకి గోవులను ఇవ్వటానికి ముందుకు రావాలి. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలకు గోవులను అందిస్తాము. భక్తులు గో దానము కొరకు టీటీడీని సంప్రదించండి. గోవుల సంరక్షణ విషయంలో ఆలయ అధికారులు పూర్తి బాధ్యత వహిస్తారు’ అని తెలిపారు. (చదవండి: ‘పూజాదికాల’పై కోర్టులెలా నిర్ణయిస్తాయి?) దాతలు ముందుకు వచ్చి గోవులను అందజేయాలి మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరు గోవులను పెంచాలనే ముఖ్య ఉద్దేశ్యం తో ఈ కార్యక్రమం ప్రారంభించాం. దాతలు కూడా ముందుకు వచ్చి టీటీడీ, హిందు ప్రచార పరిషత్‌కి గోవులు అందజేయాలి’ అని కోరారు -
రేపటి నుంచి ఆలయ దర్శనం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర నెలలుగా ఆలయాల్లో నిలిచిపోయిన భక్తుల దర్శనాలు సోమవారం (ఈనెల 8) నుంచి పాక్షికంగానూ.. బుధవారం నుంచి పూర్తిస్థాయిలోనూ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అన్ని ఆలయాల ఈఓలను ఆదేశిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ అర్జునరావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, ఈ నెల 8, 9 తేదీల్లో ట్రయల్ రన్ విధానంలో ఆలయం ఉండే ప్రాంతంలోని స్థానికులకు మాత్రమే దర్శనాలకు అనుమతిచ్చి ఆ సమయంలో గుర్తించిన లోటుపాట్లను సరిచేసుకుని పదో తేదీ నుంచి పూర్తిస్థాయిలో దర్శనాలకు అనుమతి తెలపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భక్తులకు సూచనలు.. ► గంటకు 300 మంది భక్తులకు మించకుండా దర్శనాలకు అనుమతించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. శ్రీశైలం, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం, విజయవాడ దుర్గగుడి వంటి 11 పెద్ద ఆలయాలకు వెళ్లదలిచిన భక్తులు 12 గంటల ముందు తమ పేర్లను ఆలయ ఈఓ ఫోను నెంబరుకు ఎస్ఎంఎస్ చేయాలి. ► దర్శనానికి వచ్చే భక్తులు మాస్క్‌లు ధరించి ఉండాలి. కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ► క్యూలైన్ ప్రారంభంలో థర్మల్ స్క్రీనింగ్‌లో జ్వరం ఉన్నట్లు నిర్ధారణ అయితే లోపలికి అనుమతించరు. ► క్యూలైన్‌లోనూ ప్రతిఒక్కరు ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి. ► భక్తులు ఆధార్ లేదా ఏదైన గుర్తింపు కార్డు తీసుకురావాలి. ► 65 ఏళ్లు పైబడిన వారు, పదేళ్లలోపు పిల్లలు, గర్భవతులు రావొద్దు. విజయవాడ దుర్గ గుడి దర్శనం క్యూలైన్లలో భక్తులు భౌతికదూరం పాటించేలా మార్కింగ్ చేసిన దృశ్యం ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు.. ► సాధారణ పరిస్థితులు ఏర్పడేవరకూ కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి దేవాలయాల్లో కొంతకాలం తీర్థ ప్రసాదాల పంపిణీ, శఠగోపం వంటివి ఉండవు. ► నిత్యాన్నదానాలను కొంతకాలం అమలుచేయవద్దు. ► ఉ.6 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య కాలంలో మాత్రమే దర్శనాలకు అనుమతించాలి. ► కేవలం రెండే రెండు క్యూలైన్ల ద్వారా దర్శనాలకు అనుమతి. ఇందులో ఒకటి ఉచిత దర్శనం క్యూలైన్. ► భక్తులను అంతరాలయం, గర్భగుడిలోనికి మరికొంత కాలం పాటు అనుమతించరు. ► ఆలయ మండపంలో ఒకే సమయంలో 30 మంది భక్తులకు మించి ఉండకూడదు. ► ఆలయాల్లో భక్తులకు శానిటైజేషన్ ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలి. ► 50 ఏళ్ల పైబడి వయస్సు ఉండి, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ఆలయ సిబ్బందిని కార్యాలయ వ్యవహారాలకో లేదంటే రద్దీ తక్కువ ఉండే ప్రాంతాలలో విధులకు పరిమితం చేయాలి. భక్తులూ స్వీయ నియంత్రణ పాటించాలి : మంత్రి వెలంపల్లి ప్రస్తుత పరిస్థితుల్లో భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కోరారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణుతో పాటు ఆ శాఖ అధికారులతో కలిసి మంత్రి శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో 8వ తేదీ నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. కేశ ఖండనశాలలు తెరిచే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. 65 ఏళ్లకు పైబడిన వారు చిన్న పిల్లలను తీసుకురావద్దని మంత్రి కోరారు. -
ఆలయ భూములను పవిత్రంగా భావిస్తాం
సాక్షి, అమరావతి: దేవదాయ భూములను పవిత్ర భూములుగా భావించే ప్రభుత్వం తమదని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. భీమిలిలో భూచోళ్లు అంటూ ఈనాడు అసత్య కథనాలు ప్రచురించిందని మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలు ఎల్లో మీడియాకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. భీమిలిలో దేవదాయ భూముల లీజుల వ్యవహారంలో అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. దేవదాయ భూముల లీజుకిచ్చే వ్యవహారంలో అధికారులు నిబంధనల ప్రకారమే వ్యవహరించారన్నారు. కోట్ల విలువ చేసే 67 ఎకరాల భూముల్ని అక్రమంగా కట్టబెడుతున్నారనే ఆరోపణలు సరికావని తెలిపారు. జనవరి 28నే భూముల లీజు వేలాన్ని రద్దు చేస్తూ పత్రికల్లో ప్రకటన ఇచ్చారని పేర్కొన్నారు. దేవదాయ భూములు గజం స్థలం విక్రయించాలన్నా హైకోర్టు అనుమతి తప్పనిసరి అని చెప్పారు. అది తెలియకుండా ఇళ్ల స్థలాలకు దేవదాయ భూములు తీసుకుంటున్నారని దుష్పప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దుష్ప్రచారం చేసిన వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల్లో అన్యమత ప్రచారం ఎక్కడ జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో మఠం భూములను ఇష్టారాజ్యంగా లీజుకు ఇచ్చేశారన్నారు. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ అర్చక సంక్షేమ నిధులపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. గతంలో టీడీపీ నేతలు పెన్షన్లను కూడా మింగేశారన్నారు. -
మంచిపని చేస్తుంటే బాబు, పవన్‌కు ఎప్పుడూ నచ్చదు
-
కాణిపాకం వినాయకుడికి బంగారు రథం
సాక్షి, చిత్తూరు: వినాయక చవితి పర్వదినం సందర్భంగా వరసిద్ధి వినాయక స్వామికి బంగారు రథం చేయించాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాధాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాణిపాకంలో స్వయంభువుగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి రూ. 6కోట్ల వ్యయంతో బంగారు రథం తయారికి అనుమతి ఇచ్చామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత నాణ్యతతో రథాన్ని తయారు చేయిస్తున్నట్లుగా వివరించారు. ఇక పోతే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 2-22 వరకు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభంగా జరపనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులకు వసతి, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. అంతేకాక ఆలయంలో పరిశుభ్రత పాటించాలని ఈవో, ఇతర అధికారులను శ్రీనివాసరావు ఆదేశించారు. -
సదావర్తి భూముల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తాం
సాక్షి, అమరావతి : సదావర్తి భూముల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తామని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో దేవదాయ శాఖ భూములపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి వెల్లంపల్లి సమాధానమిచ్చారు. సింహాచలం దేవస్థానం పంచగ్రామాల ప్రజలను మభ్యపెట్టేందుకు గత ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి కేబినెట్లోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి అడ్వొకేట్ జనరల్‌తో సమీక్ష చేపట్టారని వెల్లడించారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సదావర్తి భూముల్లో అక్రమాలకు సబంధించి పలు అంశాలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. ‘2018 ఆగస్టులో సదావర్తి భూములను అమ్మేయాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ అప్పటి ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో గత ప్రభుత్వం తమిళనాడులోని చిన్న పేపర్లో ప్రకటన ఇస్తే.. గుంటూరులోని చంద్రబాబు బినామీలు వెళ్లి ఆ వేలంలో పాల్గొన్నారు. వేలంలో ఎకరం భూమి ధరను రూ. 50 లక్షలు నిర్ణయిస్తే.. చంద్రబాబు బినామీలు రూ. 22లక్షలకే వేలం పాడారు. ఆ తర్వాత సదావర్తి భూముల వేలం అధికారి తమను బతిమిలాడితే.. మరో రూ. 5లక్షలు అధిక ధరకు పాడినట్టు మినిట్స్‌లో రాసుకున్నారు. దేవదాయ శాఖ అధికారి భ్రమరాంబ ఎకరం భూమి ధర రూ. 6 కోట్లు ఉంటుందని ఆర్టీఐ యాక్ట్ ద్వారా తెలిపారు. దీంతో సదావర్తి భూముల అక్రమాలపై న్యాయం కోసం నేను కోర్టును ఆశ్రయించాను. అయితే కోర్టుకెళ్లిన నాపై ఐటీ దాడులు చేయిస్తామంటూ అప్పటి మంత్రి నారా లోకేశ్ బెదిరింపులకు పాల్పడ్డారు. అందుకే సదావర్తి భూములపై విజిలెన్స్ దర్యాప్తు చేయించాల’ని ఆర్కే కోరారు. దీనిపై మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. సదావర్తి భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. సీనియర్ అధికారి ద్వారా దీనిపై విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతూ.. సదావర్తి భూములకు టైటిల్ డీడ్ లేదని చెప్పుకొచ్చారు. అయితే దీనిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి తప్పుపట్టారు. సదావర్తి భూములకు టైటిల్ డీడ్ లేదని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. టైటిట్ డీడ్ లేని భూమిని రాష్ట్ర ప్రభుత్వం మరొకరికి అంటగట్టొచ్చా అని ప్రశ్నించారు. -
భవానీ ద్వీపాన్ని సందర్శించిన మంత్రులు
సాక్షి, విజయవాడ: కృష్ణా నదిలో నెలవైన భవానీ ద్వీపాన్ని మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా భవానీ ద్వీపం అభివృద్ధితోపాటు పర్యాటక ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పించడం వంటి అంశాలపై అధికారులతో మంత్రులు చర్చించారు. పర్యాటక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన విషయమై అధికారులతో జరిగిన ఈ సమావేశంలో మంత్రులతోపాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్ పాల్గొన్నారు. -
విధేయతకు పట్టం
ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. కృష్ణా జిల్లా నుంచి ముగ్గురిని అమాత్య పదవులువరించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డివెన్నంటి ఉండి.. ఆయనకు సన్నిహితులుగా పేరున్న మచిలీపట్నం, గుడివాడఎమ్మెల్యేలు పేర్ని వెంకట్రామయ్య(నాని), కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)లతోపాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్కుమంత్రులుగా అవకాశం దక్కింది. శనివారం జరిగే ప్రమాణ స్వీకారానికిరావాల్సిందిగా ముగ్గురికి సీఎం పేషీ నుంచి సమాచారం అందింది. దీంతోనేతలు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు రాజధాని బాట పట్టారు. సాక్షి, అమరావతి బ్యూరో: విధేయతకు పట్టం కడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు. సీఎం వైఎస్ జగన్‌కు అండగా ఉన్న పేర్ని నాని, కొడాలి నానిలకు కేబినెట్లో స్థానం ఖరారైంది. పేర్నినాని తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ 2004లో కాంగ్రెస్ తరఫున మొదటిసారి బరిలో దిగి గెలుపొందారు. తర్వాత 2009లోనూ ఆయన ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా ఉండగానే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ మంత్రి కొల్లురవీంద్రపై గెలుపొందారు. ఇక గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. నాని మొదట రెండు పర్యాయాలు టీడీపీతరఫున గెలుపొందగా.. 2014లో వైఎస్సార్ సీపీ తరఫున విజయం సాధించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ తరఫున బరిలోకి దిగిన కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలనేపట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేసినా.. ఆయన విజయాన్ని అడ్డుకోలేకపోయారు. కొడాలి నాని సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడనే పేరుంది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మొదటిసారి 2009లో ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు. బందరు నుంచి ఐదో మంత్రి.. రాజకీయ పరంగా ఎంతో ప్రత్యేక స్థానం ఉన్న బందరు నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల నుంచి గెలుపొందిన వారు మంత్రులుగా పదవులు అలంకరించిన చరిత్ర మచిలీపట్నం నియోజకవర్గానికి ఉంది. 1984లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వడ్డి రంగారావుకు మంత్రి పదవి వరించింది. తర్వాత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి పేర్ని కృష్ణమూర్తి మంత్రి పదవి చేపట్టారు. చంద్రబాబు సారథ్యంలో నడకుదటి నరసింహారావు, 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన అల్లుడు కొల్లు రవీంద్రలు అమాత్యులుగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ తరఫున రెండు పర్యాయాలు విజయం సాధించిన పేర్ని వెంకట్రామయ్య(నాని) 2012లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. టీడీపీ కోటలు బద్దలు కొట్టిన నాని.. రాష్ట్ర రాజకీయాల్లో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు తొలిసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది. ఈ నియోజకవర్గం నుంచే. టీడీపీ ఆవిర్భావం నుంచి ఈ స్థానం ఆ పార్టీకి పట్టుగొమ్మగా నిలిచింది. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో రెండు పర్యాయాలు కొడాలి నాని టీడీపీ తరఫున గెలుపొందారు. అయితే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాక.. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కోటలకు బీటలు వారాయి. వైఎస్సార్ సీపీ తరఫున బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. అప్పటి వరకు ఉన్న టీడీపీకి పట్టుగొమ్మగా నిలిచిన ఆ నియోజకవర్గంలో తొలిసారి వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది. ఆ తర్వాత ఆ పంథాను కొనసాగిస్తూ 2019 ఎన్నికల్లోనూ ఆయన ఘన విజయం సాధించారు. -
వైఎస్ఆర్సీపీలోకి విజయవాడ మైనారిటీ సెల్ అధ్యక్షుడు
-
అవినీతి అనకొండలు.. నారా బాబులు
► దోచుకోవడం.. దాచుకోవడమే వారి లక్ష్యం ► వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వెలంపల్లి భవానీపురం (విజయవాడ పశ్చిమ) : అభివృద్ధి, అవినీతిలో నవ్యాంద్రప్రదేశ్ను ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలుపుతానని అసెంబ్లీలో బల్లగుద్ది చెప్పిన చంద్రబాబు, అభివృద్ధి మాటెలా ఉన్నా అవినీతిలో మాత్రం నిజం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. అన్నింటిలోనూ కమీషన్లకు కక్కుర్తి పడుతున్న చంద్రబాబు, ఇసు క, ల్యాండ్ మాఫియాను ప్రోత్సహిస్తూ అందినకాడికి దండుకుంటున్న ఆయన తనయుడు చినబాబును అవినీతి అనకొండలుగా అభివర్ణించారు. వైఎస్సార్ సీపీ నగర ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన పదిలం రాజశేఖర్ అభినందన సభ భవానీపురంలోని సాయి అన్న గార్డెన్స్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వెలంపల్లి ప్రసంగిస్తూ దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా ఇద్దరు బాబులు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. తాము వేయించిన రోడ్లుపై నడుస్తూ, తామిచ్చే పెన్షన్, రేషన్ తీసుకుంటూ టీడీపీకి ఎందుకు ఓట్లేయరని, అవసరమైతే ఓటుకు రూ.5 వేలు ఇచ్చయినా కొనగలనని చెప్పటం చంద్రబాబు అహంకారానికి నిదర్శనమన్నారు. అవినీతికి పాల్పడకపోతే ఓటుకు రూ.5 వేలు ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి భయపడుతున్న చంద్రబాబు మతి స్థిమితం కోల్పోతున్నారన్నారు. చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే జలీల్‌ఖాన్‌తో రాజీనామా చేయించి అదే స్థానంలో నిలబెట్టాలని, ఆయనపై తాను పోటీ చేసి గెలిచి పశ్చిమ సీటును జగన్‌కు కానుకగా సమర్పిస్తానని చెప్పారు. 2019 ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని, అప్పుడే రాజన్న పాలన వస్తుందని చెప్పారు. పదిలం యువసేన ఆధ్వర్యంలో పార్టీ నగర అధికార ప్రతినిధి ఏలూరు వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ గౌస్ మొహిద్దీన్, పోతిరెడ్డి సుబ్బారెడ్డి, మైలవరపు దుర్గారావు, కట్టా మల్లేశ్వరరావు, మనోజ్ కొఠారి, లేళ్ల లాజర్, సంకా పరమేశ్వరరావు, విశ్వనాధరవి, పడిగపాటి సుబ్బారెడ్డి, గుడివాడ నరేంద్ర, కంపా గంగాధరరెడ్డి, పోలిమెట్ల శరత్, పిళ్లా సూరిబాబు, ఏనుగుల సునీల్, షకీల్, ఏపీ భాస్కరరావు, ఎం.చటర్జీ, అనుమాలశెట్టి జ్యోతి, కె.విద్యాధరరావు, వెన్నం రజని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వెలంపల్లి, రాజశేఖర్‌ను గజమాలతో సత్కరించారు. -
విశ్వాసం లేని వారు పుష్కరాలు ఎలా నిర్వహిస్తారు..
మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి వన్‌టౌన్ : భక్తి విశ్వాసాలపై ఏమాత్రం నమ్మకం లేని ప్రభుత్వం పుష్కరాలను ఏవిధంగా నిర్వహిస్తుందని మాజీ శాసనసభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. వన్‌టౌన్‌లోని వివిధ ప్రాంతాల్లో కూల్చివేసిన ఆలయాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. భక్తుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో పురాతనమైన ఆలయాలను ముందస్తు హెచ్చరికలు లేకుండా కూల్చివేస్తున్న అధికారులు, ప్రభుత్వ తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. 86 ఏళ్ల చరిత్ర ఉన్న దాసాంజనేయస్వామి ఆలయాన్ని, రాయల్‌హోటల్ సమీపంలోని గంగానమ్మ గుడిని రాత్రికిరాత్రి తొలగిం చటం అమానుషమన్నారు. హెచ్‌బీ కాలనీ వద్ద రోడ్డు పక్కన ఉన్న కనకమహాలక్ష్మీ ఆలయాన్ని, పక్కనే జెండాచెట్టును కూల్చటం ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రార్థన మందిరాలను కాపాడుకోవాలే తప్పఅరాచకానికి తెగబడితే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. పార్టీ ఓబీసీ విభాగ ఇన్చార్జి శివకుమార్పట్నాయక్, నేతలు అడ్డూరి శ్రీరామ్, భోగవల్లి గురుదత్, పోతిన శ్రీనివాసరావు, డేరుంగుల రమణ, పిళ్లా శ్రీను పాల్గొన్నారు. -
అత్యుత్తమం భారతీయ సంస్కృతి
వన్‌టౌన్, న్యూస్‌లైన్ : ప్రపంచానికే భారతీయ సంస్కృతి దిక్సూచి వంటిదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అంత మహోన్నతమైన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడానికి విద్యార్థులంతా కంకణం కట్టుకోవాలని కోరారు. మూడు రోజుల పాటు జరిగే కృష్ణా విశ్వవిద్యాలయం ‘కృష్ణాతరంగ్-2013’ అంతర్ కళాశాల యువజనోత్సవాలు శనివారం కేబీఎన్ కళాశాలలో ప్రారంభమయ్యాయి. జ్యోతి వెలిగించి యువజనోత్సవాలను వెలంపల్లి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి యావత్ సాంస్కృతిక రంగంలోనే ఇమిడి ఉందన్నారు. ముఖ్యఅతిథిగా హజరైన విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ ఆచార్య డీ.సూర్యచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న కళాత్మకతను వెలికి తీసేందుకే విశ్వవిద్యాలయం ప్రతి ఏటా కృష్ణాతరంగ్ పేరుతో యువజనోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుందన్నారు. యువజనోత్సవాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు ఈ మూడు రోజుల పాటు వివిధ సాహితీ, సాంస్కృతిక, వైజ్ఞానిక అంశాల్లో తమ ప్రతిభను చాటి చెప్పనున్నారని చెప్పారు. గౌరవ అతిథిగా హజరైన ఉన్నత విద్యాశాఖ రీజినల్ జాయింట్ డెరైక్టర్ గీతాంజలి మాట్లాడుతూ యువత నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలను సద్వినియోగించుకుని మరింత ఉన్నతస్థానాలకు చేరుకోవాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన నూజివీడు పీజీ సెంటర్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.బసవేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలు అన్ని రంగాల్లోనూ ప్రతిభను ప్రదర్శిస్తూ తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటుతున్నారన్నారు. ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో అనేక మంది ప్రముఖులను జల్లా అందించిందని చెప్పారు. అటువంటి సాంస్కృతిక రంగంలో యువత సైతం అద్భుత ప్రతిభను కనబరుస్తూ ముందుకు సాగడం అభినందనీయమని చెప్పారు. విశ్వవిద్యాలయం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరకృష్ణ, హిందూహైస్కూల్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య, కేబీఎన్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు ఉప్పల సాంబశివరావు తదితరులు ప్రసంగించారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు... కృష్ణాతరంగ్-2013 అంతర్ కళాశాలల యువజనోత్సవ పోటీల్లో తొలి రోజు శనివారం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన వివిధ పోటీల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, జాతీయ బృందగానం, పాశ్చాత్య బృందగానం, క్విజ్ ప్రిలిమ్స్, స్పాట్ ఫొటోగ్రఫీ, క్లేమోడలింగ్, శాస్త్రీయ నృత్యం, జానపద వాద్యం, వక్తృత్వం తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. విజయవాడ, మచిలీపట్నం, తిరువూరు, మొవ్వ, ఉయ్యూరు. నందిగామ, నూజివీడు తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పోటీలకు హజరయ్యారు.