ప్రధాన నిందితుడు సతీష్ కుటుంబ సభ్యులను బొండా ఉమా ఇంటికి పిలిపించుకుని ఏం మాట్లాడినట్టు?
వైఎస్సార్‌సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, తనపై హత్యాయత్నానికి సూత్రదారి టీడీపీ నాయకుడు బొండా ఉమానే అని వైఎస్సార్‌సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజతో కలిసి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 28వ డివిజన్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారమే సీఎం జగన్‌పై టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని, బొండా ఉమా, ఏ2 దుర్గారావులు దగ్గరుండి మాపై హత్యాయత్నం చేయించారని ఆరోపించారు. దీనికి సూత్రధారి బొండా ఉమా కాగా, మూలకారకుడు చంద్రబాబేనని ఆరోపించారు.
ఈ కేసుకు సంబంధించిన అంశాలన్నీ బొండా ఉమా చుట్టూనే తిరుగుతున్నాయని, రాజకీయంగా తమను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ఇలా టీడీపీ నాయకులు రౌడీయిజం, గూండాయిజాన్ని పోషించి హత్యాయత్నాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. బొండా ఉమాకు నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ఉమా ఘోర ఓటమిని చవిచూడడం తథ్యమన్నారు.
నిందితులు ఎందుకు టచ్‌లో ఉన్నట్టు?
ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగితే పోలీసు అధికారులు విచారణ జరపడం తప్పా? అధికారులను బెదిరిస్తే నిజం అబద్దమవదనే విషయాన్ని బొండా ఉమా తెలుసుకోవాలని వెలంపల్లి హితవుపలికారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టం తనపని తాను చేసుకువెళుతుంటే బొండా ఉమాకు ఎందుకు వెన్నులో వణుకు పుడుతోందని ప్రశ్నించారు. సీఎం జగనన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెడుతుంటే.. చంద్రబాబు వారిని రౌడీలుగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు.
ఎవరైనా తమ మీద తామే దాడి చేయించుకుంటారా? దాడి ఘటనలో కన్నుకు దెబ్బ తగిలి ఇబ్బంది పడుతుంటే బొండా ఉమాకు కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా దు్రష్పచారం చేయడం దుర్మార్గమన్నారు. ‘సీఎంపై హత్యాయత్నం చేసినవారు బొండా ఉమాతో ఎందుకు టచ్‌లో ఉన్నారు? సతీష్ తల్లిదండ్రులు బొండా ఉమా ఇంటికి ఎందుకు వెళ్లారు?’ అని ప్రశ్నించారు.
బొండా ఉమా, ఆయన ఇద్దరు కుమారులు చేస్తున్న రౌడీయిజానికి కచ్చితంగా అడ్డుకట్ట వేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో ఏ2గా ఉన్న దుర్గారావు, బొండా ఉమా ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ఈ దాడి చేయించారని ఆయన ఆరోపించారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment