kanipakam Varasiddhi vinayaka swamy
-
బ్రహ్మండం..కాణిపాకం బ్రహ్మోత్సవం
సత్యప్రమాణాల దేవుడు శ్రీకాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సల ఏర్పాట్లకు దేవస్థానం రెండు నెలల ముందే శ్రీకారం చుట్టింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తజనాన్ని దృష్టిలో ఉంచుకుని మహా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. సెప్టెంబర్ 18వ తేదీ వినాయక చవితి నుంచి 21 రోజుల పాటు నిర్వహించి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్ద పీటవేస్తు, ఉభయదారులు, ప్రజాప్రతినిధులు, వీఐపీలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి చిన్న పొరబాటు చోటు చేసుకోకుండా దర్శనం కల్పించేలా ముందస్తు ఏర్పాట్లను ప్రారంభించింది. కాణిపాకం(యాదమరి): కాణిపాకంలో స్వయంభుగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈఓ వెంకటేశు రెండు నెలల ముందే తగు ఏర్పాట్లుకు నడుం బిగించారు. గతంలో కంటే ప్రస్తుతం వేలాదిగా భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివస్తున్నారు. నిత్యం భక్తులు 20 వేలకు పైగా విచ్చేస్తున్నారు. సెలవురోజుల్లో, పండుగ రోజుల్లో 50 వేలకు పైగా భక్తులు వస్తున్నారు. ఒక్కోసారి దర్శనానికి 6,7 గంటల సమయం కూడా పడుతోంది. బ్రహ్మోత్సల సమయంలో దర్శనం, ఉత్సవమూర్తుల ఊరేగింపు చూసేందుకు భక్తులు అశేషంగా తరలివస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులతో ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈఓ వెంకటేశు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తు పలు అంశాలను చర్చిస్తూ, ఏర్పాట్లకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా గతంలో బ్రహ్మోత్సవాలకు ముందు హడావుడిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవారు. భక్తులకు ఈ సౌకర్యాలు సరిపోయేవి కావు. దీంతో ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రత్యేక క్యూలు, నిత్య అన్నప్రసాదం, లడ్డూ, పులిహోరా ప్రసాదాలు, వాహనాల పార్కింగ్ స్థలాలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, తాగునీటి వసతి, వీఐపీలు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ దర్శనాలు, మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయంలో, ఊరేగింపులో స్వామివారిని దర్శించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తున్నారు. భక్తులకు సంతృప్తి కలిగించేలా.. శ్రీవినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండ కర్ణాటక, తమిళనాడు, మహరాష్ట్రాల నుంచి కూడా అశేషంగా తరలివస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో మాదిరి కాకుండా రెండు నెలలకు ముందు నుంచే మహా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాం. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వీఐపీలకు ప్రత్యేక సమయం కేటాయించి ప్రత్యేక దర్శనం కల్పిస్తే బాగుంటుందని చర్చిస్తున్నాం. బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులు చాలా బాగా దర్శనం చేసుకున్నాం అనే సంతృప్తి కలిగించేలా ఏర్పాట్లు చేస్తాం. –మోహన్‌రెడ్డి, ఆలయ చైర్మన్ భక్తులందరికీ నిత్య అన్న ప్రసాదం ప్రస్తుతం నిత్యాన్నదానంలో 7 వేల మందికి భోజనం పెడుతున్నాం. బ్రహ్మోత్సవాల సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్న ప్రసాదం అందించాలని భావిస్తున్నాం. ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉండాలనే రెండు నెలలకు ముందే ముందస్తు చర్యలు ప్రారంభించాం. బ్రహ్మోత్సవాలకు వారం ముందే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులతో సమీక్షిస్తూ సలహాలు తీసుకుంటున్నాం. అన్నిశాఖల అధికారులు, ఉభయదారులతో సమన్వయంగా పనిచేస్తూ విస్తృత ఏర్పాట్లు చేస్తాం –వెంకటేశు, ఆలయ ఈఓ ఆలయంలో భక్తుల రద్దీ కాణిపాకం(యాదమరి):కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిట లాడింది. స్వామివారి దర్శనార్థం ఉదయం నుంచి భక్తులు తరలి రావడంతో కంపార్ట్మెంట్లు, క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులకు త్వరితగతిన దర్శనం చేసుకునేలా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు. -
సత్యప్రమాణాల దేవుడికి బ్రహ్మోత్సవాలు
దేశంలోని గణపతి క్షేత్రాల్లో కాణిపాకం ప్రత్యేకమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం గ్రామంలో స్వయంభూ క్షేత్రంగా వెలసింది. ఇక్కడ వెలసిన గణపతి సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి పొందాడు. బాహుదా నదీతీరంలోని ఈ స్థలపురాణానికి సంబంధించి ఒక గాథ ప్రచారంలో ఉంది. బాహుదా నదీతీరాన విహారపురంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకరు అంధుడు, ఇంకొకరు మూగవాడు, మరొకరు బధిరుడు. వారికి ‘కాణి’ భూమి ఉండేది. ‘కాణి’ అంటే, పావు ఎకరం. అందులోనే వాళ్లు వ్యవసాయం చేసుకునేవాళ్లు. ఒకసారి కరవు వచ్చి, ఆ భూమిలోని బావి ఎండిపోయింది. నీటికోసం ఆ బావిని మరింత లోతుగా తవ్వేందుకు ముగ్గురు అన్నదమ్ములూ పలుగు పారలు తీసుకుని, అందులోకి దిగారు. తవ్వుతూ ఉండగా, ఇసుకపొరలో రాయి అడ్డు వచ్చింది. దానిపై పలుగుపోటు పడగానే, దాని నుంచి నెత్తురు చిమ్మింది. ఆ రక్తస్పర్శతో ముగ్గురు అన్నదమ్ముల వైకల్యాలూ తొలగిపోయాయి. వారి ద్వారా సంగతి తెలుసుకున్న గ్రామస్థులు అక్కడకు చేరుకుని, బావిలోని ఇసుక తొలగించారు. అందులో వినాయక విగ్రహం దొరికింది. అలా ఇక్కడ స్వయంభువుగా వెలసిన గణపతిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల జనం తండోపతండాలుగా వచ్చారు. వారు కొట్టిన టెంకాయల నీటితో ‘కాణి’ విస్తీర్ణం ఉన్న పొలమంతా తడిసిపోయింది. ‘కాణి’ నేలలో నీరు పారినందున తమిళంలో దీనికి ‘కాణిపారకం’– (‘పారకం’ అంటే ప్రవహించడం) అనే పేరు వచ్చింది. కాలక్రమేణా జనుల నోట ఈ పేరు కాణిపాకంగా మారింది. ఇదీ చరిత్ర కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక ఆలయానికి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. మొదటి కుళోత్తుంగ చోళుడు పదకొండో శతాబ్దిలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత పద్నాలుగో శతాబ్దిలో విజయనగర రాజులు దీనిని మరింతగా అభివృద్ధిపరచారు. ఈ క్షేత్రంలో చోళ, పాండ్య, గంగవంశ రాజులు వేయించిన శాసనాలు బయటపడ్డాయి. కాణిపాకం వినాయక ఆలయ ప్రాంగణంలోనే వరదరాజ, మణికంఠేశ్వర, వీరాంజనేయ ఉపాలయాలు ఉన్నాయి. ముప్పయ్యేళ్లుగా ఈ ఆలయంలో భక్తులకు నిత్యాన్నదానం జరుగుతోంది. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో వివాహం చేసుకోవడం శుభకరమని భక్తుల విశ్వాసం. ఇటీవలి కాలంలో ఇక్కడ వివాహాలు పెరుగుతున్నందున, దేవస్థానం నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం ఏడు కళ్యాణ మండపాలను నిర్మించారు. (క్లిక్: అందరూ నా పుట్టినరోజును సంబరంగా, సంతోషంగా జరపుకోవాలి!) వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకునికి ఏటా బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈ ఏడాది ఆగస్టు 31న వినాయక చవితి మొదలుకొని తొమ్మిదిరోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు, తర్వాత పన్నెండు రోజుల పాటు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుని తర్వాత కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకునికి మాత్రమే స్వర్ణరథం ఉంది. -
అక్టోబర్ 11న కాణిపాకానికి సీఎం వైఎస్ జగన్
సాక్షి, కాణిపాకం(యాదమరి): కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 11వ తేదీన దర్శించుకోనున్నట్లు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తెలిపారు. శనివారం ఆయన కాణిపాకంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పర్యటనలో భాగంగా సీఎం.. స్వామివారిని దర్శించుకున్న అనంతరం నూతనంగా వినాయక స్వామివారికి టీటీడీ తయారు చేసి ఇచ్చిన బంగారు రథాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చదవండి: (మహిళా మార్ట్.. సరుకులు భేష్) -
కాణిపాకం వినాయకుడికి బంగారు రథం
సాక్షి, చిత్తూరు: వినాయక చవితి పర్వదినం సందర్భంగా వరసిద్ధి వినాయక స్వామికి బంగారు రథం చేయించాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాధాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాణిపాకంలో స్వయంభువుగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి రూ. 6కోట్ల వ్యయంతో బంగారు రథం తయారికి అనుమతి ఇచ్చామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత నాణ్యతతో రథాన్ని తయారు చేయిస్తున్నట్లుగా వివరించారు. ఇక పోతే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 2-22 వరకు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభంగా జరపనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులకు వసతి, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. అంతేకాక ఆలయంలో పరిశుభ్రత పాటించాలని ఈవో, ఇతర అధికారులను శ్రీనివాసరావు ఆదేశించారు. -
నేటి నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు
-
నేటి నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు
–21 రోజుల పాటూ ప్రత్యేక కార్యక్రమాలు కాణిపాకం : చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 21 రోజుల పాటూ వైభవంగా జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 5న వినాయక చవితి, 6న హంసవాహనం,7న నెమలి వాహనం, 8న మూషిక వాహనం, 9న శేష వాహనం, 10న వృషభ వాహనం, 11న గజవాహనం, 12న రథోత్సవం, 13న అశ్వవాహనం,14న ధ్వజ అవరోహణం,15న అధికార నంది వాహనం,16న రావణబ్రహ్మ వాహనం,17న యాళి వాహనం, 18న సూర్య ప్రభ వాహనము, 19న చంద్రప్రభ వాహనము, 20న కామధేను వాహనం, 21న పూలంగి సేవ, 22న కల్పవృక్ష వాహనం, 23న విమానోత్సవం,24న పుష్పపల్లకి సేవ, 25న తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగే రోజులలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిత్యం భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు ఈఓ పూర్ణచంద్రారావు తెలిపారు. -
5నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు
కాణిపాకం : చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 5 నుంచి 21 రోజుల పాటూ వైభవంగా జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఈఓ పూర్ణచంద్రారావు తెలిపారు. బ్రహ్మోత్సవాల వివరాలు...5న వినాయక చవితి, 6న హంసవాహనం,7న నెమలి వాహనం, 8న మూషిక వాహనం, 9న శేష వాహనం, 10న వృషభ వాహనం, 11న గజవాహనం, 12న రథోత్సవం, 13న అశ్వవాహనం,14న ధ్వజ అవరోహణం,15న అధికార నంది వాహనం,16న రావణబ్రహ్మ వాహనం,17న యాళి వాహనం, 18న సూర్య ప్రభ వాహనము, 19న చంద్రప్రభ వాహనము, 20న కామధేను వాహనం, 21న పూలంగి సేవ, 22న కల్పవృక్ష వాహనం, 23న విమానోత్సవం,24న పుష్పపల్లకి సేవ, 25న తెప్పోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలు జరిగే రోజులలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. నిత్యం భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు పూర్ణచంద్రారావు చెప్పారు.