
సాక్షి, కాణిపాకం(యాదమరి): కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 11వ తేదీన దర్శించుకోనున్నట్లు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తెలిపారు. శనివారం ఆయన కాణిపాకంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పర్యటనలో భాగంగా సీఎం.. స్వామివారిని దర్శించుకున్న అనంతరం నూతనంగా వినాయక స్వామివారికి టీటీడీ తయారు చేసి ఇచ్చిన బంగారు రథాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
చదవండి: (మహిళా మార్ట్.. సరుకులు భేష్)
Comments
Please login to add a commentAdd a comment