శిరీష కేసులో రోజుకో ట్విస్ట్‌ | Beautician Sirisha's audio tape leaked | Sakshi
Sakshi News home page

శిరీష కేసులో రోజుకో ట్విస్ట్‌

Published Wed, Jun 21 2017 10:48 AM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

శిరీష కేసులో రోజుకో ట్విస్ట్‌

శిరీష కేసులో రోజుకో ట్విస్ట్‌

హైదరాబాద్‌: మేకప్‌ ఆర్టిస్ట్‌ శిరీష అనుమానాస్పద​ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన మరో ఆడియో టేపులు సంచనలం రేపుతోంది. రాజీవ్‌ స్నేహితులతో శిరీష ఫోన్‌ సంభాషణ టేపులు బయటకు వచ్చాయి. రాజీవ్‌పై తన ప్రేమను ఫోన్‌లో నవీన్‌, నందుతో శిరీష​ చెప్పింది. తనకు రాజీవ్‌ అంటే ప్రాణం అని పేర్కొంది. రాజీవ్‌ను ఎవరన్నా ఏమన్నా అంటే చంపేస్తానని ఆమె హెచ్చరించింది. రాజీవ్‌ ప్రియురాలు తేజశ్విని గురించి శిరీష​ మాట్లాడిన మాటలు ఆడియోలో ఉన్నాయి. తమ మధ్య తేజశ్విని రాకుండా చూడాలని రాజీవ్‌ స్నేహితులను కోరింది. అయితే ఈ ఆడియో టేపులు ఎవరి బయటపెట్టారనేది వెల్లడికాలేదు.

అంతకుముందు విడుదలైన ఆడియో టేపులు తాము విడుదల చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా, శిరీషపై అత్యాచారం జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఫోరెన్సిక్‌ రిపోర్టులు వచ్చిన తర్వాత పూర్తి నిర్ధారణకు రానున్నారు. ఈనెల 12న అర్ధరాత్రి కుకునూర్‌పల్లి పోలీస్‌ క్వార్టర్‌లో చోటుచేసుకున్న విషయాలను పోలీసులు రిమాండ్‌ డైరీలో కోర్టుకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement