beautician sirisha
-
‘శిరీష’ భయంతోనే ఎస్ఐ ఆత్మహత్య
డీజీపీకి చేరిన పూర్తి నివేదిక సాక్షి, హైదరాబాద్: కుకునూర్ పల్లి సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్‌రెడ్డి శిరీష వ్యవహారం వల్లనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని విచారణాధికారి, అదనపు డీజీపీ గోపీకృష్ణ డీజీపీ అనురాగ్‌శర్మకు నివేదిక సమర్పించినట్టు తెలిసింది. శిరీషతో అసభ్యకరంగా ప్రవర్తించడంవల్లే ఆమె చనిపోయి ఉంటుందన్న భయంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని విచారణాధికారి రిపోర్ట్‌లో స్పష్టంచేశారు. గత నెల 14న ఉదయం 10 గంటల సమయంలో బంజారాహిల్స్ ఎస్ఐ హరీందర్‌తో ప్రభాకర్‌రెడ్డి ఫోన్లో శిరీష ఆత్మహత్య గురించి మాట్లాడినట్టు నివేదికలో స్పష్టం చేశారు. అదే రోజు ఉదయం 10.50–11.00 గంటల మధ్య తన క్వార్ట ర్స్‌లోనే రివాల్వర్‌తో కాల్చుకొని చనిపోయినట్టు తెలి పారు. ఈ వ్యవహారంలో 27 మంది అధికారులు, సిబ్బం దిని గోపీకృష్ణ విచారించారు. అదే విధంగా గజ్వేల్ ఏసీపీ గిరిధర్ ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డిని పలుసార్లు టార్గెట్ చేసుకొని వేధించినట్టు నివేదికలో స్పష్టంచేశారు.ఈ కేసులో అల్లర్లకు కారకులైన ఇద్దరు కానిస్టేబుళ్లపై ఇప్పటికే పోలీస్ శాఖ చర్య తీసుకుందని, మిగతా ప్రైవేట్ వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నట్టు తెలిపారు. -
నందు ఎవరు?
♦ శిరీష కేసులో రాజీవ్, శ్రవణ్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు ♦ నిందితులకు రెండు రోజుల పోలీసు కస్టడీ హైదరాబాద్: మేకప్ ఆర్టిస్ట్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో నిందితులుగా ఉన్న బోదాసు శ్రావణ్‌కుమార్ అలియాస్ శ్రవణ్, వల్లభనేని రాజీవ్త్రివిక్రమ్ అలియాస్ రాజీవ్‌లను విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులు సోమవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇరువురినీ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీరిద్దరినీ రెండు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో... అడ్వొకేట్ సమక్షంలో పోలీసులు విచారిస్తున్నారు. పది కోణాల్లో ప్రశ్నావళి... ఈ నెల 13 తెల్లవారుజామున షేక్‌పేట్‌లోని రాజీ వ్‌కు సంబంధించిన ఆర్జే ఫొటోగ్రఫీ కార్యాలయం గదిలో శిరీష ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి రాజీవ్, శ్రవణ్‌ల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. వీరి అరెస్టు తర్వాత శిరీష–నందు–నవీన్ మధ్య జరిగిన సంభాషణలంటూ కొన్ని ఆడియోలు బయటకు వచ్చాయి. వీటిపైనా పోలీసులు రాజీవ్, శ్రవణ్‌లను ప్రశ్నిస్తున్నారు. నందు ఎవరనే దానిపై రాజీవ్, శ్రవణ్ నుంచి వివరాలు రాబడుతున్నారు. అయితే తమకు నందు, అతడి స్నేహితుడైన నవీన్ ఎవరో తెలియదని, బహుశా శిరీష స్నేహితులై ఉండవచ్చని చెప్పినట్లు తెలిసింది. మొత్తమ్మీద పది కోణాల్లో వివిధ ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి తయారు చేసుకున్న పోలీసులు దాని ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. రాజీవ్–శిరీష గొడవలపై ఆరా శిరీషపై అత్యాచారం జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరింత లోతుగా నిందితుల్ని విచారిస్తున్నారు. తాము కాస్త తెరిచి ఉన్న తలుపు సందులోంచి చూసినప్పుడు ఎస్సై.. శిరీషపై అత్యాచారయత్నం చేస్తున్నట్లు కనిపించిందని, వెంటనే తాము లోపలకు వెళ్లగా కోపంతో అతను తమను బయటకు పంపించాడని నిందితులు వెల్లడించారు. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి అనుచిత ప్రవర్తన శిరీషను బాగా కుంగదీసిందని... కారులో తను పలుమార్లు లెంపలేసుకుందని చెప్పుకొచ్చారు. ఆమె అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని రాజీవ్, శ్రవణ్ వివరించారు. ప్రయాణ సమయంలో రెండు, మూడు సార్లు తాను ఆమెను కొట్టిన విషయం నిజమేనని రాజీవ్ చెప్పాడు. మంగళవారం కూడా పోలీసులు వీరిని విచారించనున్నారు. రాజీవ్‌కు తెలియకుండా తాను, శిరీష తరచుగా కలుస్తుండేవారమని శ్రవణ్ తెలిపాడు. శిరీష కేసుకు, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి కేసుకు లింకులున్న నేపథ్యంలో ఆ కేసు విచారణాధికారిగా ఉన్న సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న సైతం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌కు వచ్చి నిందితుల్ని విచారిస్తున్నారు. ఎస్సై క్వార్టర్స్‌లో ఏం జరిగింది..! ఈ నెల 12 ఉదయం 8 గంటల సమయంలో శిరీష ఆర్జే ఫొటోగ్రఫీ కార్యాలయానికి రాగా, గంట తర్వాత రాజీవ్.. మరో గంటకు శ్రవణ్ వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. గత నెల 30న రాజీవ్ ప్రియురాలు తేజస్విని వచ్చి గొడవ చేయడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, శిరీష అంతుచూస్తానని హెచ్చరించిందని నిందితులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమెను అడ్డు తొలగించుకోవడానికి ఏం చేయాలన్న దానిపై చర్చించేందుకు ముగ్గురం కలసి బంజారాహిల్స్ రోడ్ నం.10లోని కప్పా కాఫీ షాప్‌నకు వెళ్లి, అక్కడ మూడు గంటల పాటు సమాలోచనలు జరిపామన్నారు. శ్రవణ్ సూచించిన మేరకే ముగ్గురం కలసి కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి వద్దకు వెళ్లామని రాజీవ్ అంగీకరించాడు. బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని మండల కార్యాలయం ఎదురుగా ఉన్న వైన్‌షాప్‌లో మద్యం కొనుగోలు చేసి రాయదుర్గం ప్రాంతంలో కబాబ్‌లు తీసుకొని కుకునూర్‌పల్లికి బయల్దేరామని నిందితులు పోలీసులకు చెప్పారు. ఆ రోజు రాత్రి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి క్వార్టర్స్‌లో ఏం జరిగిందనే దానిపై అధికారులు కూపీ లాగుతున్నారు. -
శిరీషను ఆ ముగ్గురే కొట్టి చంపారు
హంతకులను పోలీసులే కాపాడుతున్నారు శిరీష మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి మృతురాలి బాబాయి, పిన్ని డిమాండ్ సాక్షి, అమరావతి బ్యూరో: బ్యూటీషియన్ శిరీషను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, వాస్తవాలు వెలుగు చూడాలంటే సీబీఐ విచారణ జరిపించాలని ఆమె బాబాయి శ్రీనివాసరావు, పిన్ని దుర్గారాణి డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. కర్ణాటకలోని రాయచూరులో ఉండే శిరీష బాబాయి, పిన్ని శ్రీనివాసరావు, దుర్గారాణి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట వెళుతూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద మీడియాతో మాట్లాడారు. హంతకులను కాపాడేందుకే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే శిరీష మీద అపనిందలు మోపుతున్నారని విమర్శించారు. రాజీవ్‌తో శిరీష నాలుగేళ్లుగా సహజీవనం చేసిందని అపనిందలు వేశారని వారు ఆరోపించారు. శిరీష 2016, జూలై వరకు హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో సొంతంగా బ్యూటీపార్లర్, ఓ కిరణా దుకాణం నిర్వహించిందన్నారు. గత ఆరు నెలలుగా మాత్రమే ఆమె రాజీవ్‌కు చెందిన ఆర్జే ఫొటో స్టుడియోలో పనిచేస్తోందన్నారు. శిరీష పేదింటి పిల్ల కాబట్టి డబ్బు ప్రభావానికి గురైందని కూడా మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, అది వాస్తవం కాదని, తమది మధ్యతరగతి కుటుంబమని వారు స్పష్టం చేశారు. రాజీవ్, శ్రావణ్, ఎస్ఐ ప్రభాకరరెడ్డి కలసి తమ బిడ్డను కొట్టి, హింసించి, హత్యచేశారని, అనంతరం ఎస్ఐ రివాల్వర్‌తో కాల్చుకుని మృతిచెందాడన్నది వాస్తవమన్నారు. శిరీష ఆత్మహత్య చేసుకుంటే వంటిపై గాయాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. ఆమెను ఎలాగైనాసరే లొంగదీసుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతోనే హత్య చేశారని ఆరోపించారు. శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె మేనమామ సూర్యారావు పేర్కొన్నారు. రాజీవ్, శ్రావణ్ కుటుంబ సభ్యులను కూడా విచారించాలని కోరారు. అదే విధంగా ఈ కేసులో అనుమానస్పద పాత్ర పోషించిన తేజస్వినిని ఎందుకు బయటకు తేవడం లేదని శ్రీనివాసరావు, దుర్గారాణి ప్రశ్నించారు. ఇవేవీ పట్టించుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు ఏకపక్షంగా కేసును ముగించాలని శిరీష నడవడిక మీద అపనిందలు వేయడం దారుణమని ఆరోపించారు. శిరీష ఫోన్ సంభాషణల పేరుతో ఏవో టేపులు తెచ్చి ఆమె ప్రవర్తనను తప్పుపట్టేలా పోలీసులు ప్రచారం చేయడం దారుణమన్నారు. వాస్తవాలను వెలికితీసేలా విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
ఎవరీ నందు, నవీన్?
శిరీష కేసులో తెరపైకి మరో రెండు పేర్లు ► వారితో జరిపిన సంభాషణలు వెలుగులోకి.. శిరీష స్నేహితులుగా అనుమానం ► ముందు తేజస్విని విషయం వారికే చెప్పిన శిరీష ► అంతా అయిపోయిందంటూ ఫోన్లో చెప్పిన ఇరువురూ ► అయినా ఫలితం లేకపోవడంతో ఎస్సై ప్రభాకర్‌రెడ్డి వద్దకు వివాదం ► రాజీవ్, శ్రవణ్ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు ► తాజాగా వెలుగులోకి వచ్చిన రెండు ఫోన్ కాల్ రికార్డింగ్ ఆడియోల్లో ఉన్న అంశాలివీ.. హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో మరణించిన బ్యూటీషియన్ శిరీష కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో రెండు పేర్లు వెలుగులోకి వచ్చాయి. నందు, నవీన్ అనే ఇద్దరితో శిరీష మాట్లాడినట్లు భావిస్తున్న రెండు ఫోన్ కాల్ రికార్డింగ్ ఆడియోలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కాల్ రికార్డింగ్స్‌పై పోలీసులు దృష్టి సారించారు. వెలుగులోకి వచ్చిన ఆడియోలను పరిశీలిస్తే.. తనకు, రాజీవ్‌కు తేజస్వినితో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా శిరీష తొలుత నందును కోరినట్లు తెలుస్తోంది. అతడితో పాటు అతడి స్నేహితుడైన నవీన్ సైతం తేజస్వినితో మాట్లాడామని, విషయం సెటిల్ అయి పోయిందని, ఇక ఆమె మీ జోలికి రాదంటూ శిరీషతో చెప్తున్న మాటలు ఆడియోల్లో ఉన్నాయి. వీరిలా చెప్పినా తేజస్వినితో ఇబ్బందులు కొనసాగిన నేపథ్యంలోనే శిరీష మరో స్నేహితుడైన శ్రవణ్ సహాయం కోరి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. శిరీష–రాజీవ్.. శ్రవణ్ ద్వారానే కుకునూర్‌పల్లి వెళ్లడం, అక్కడ ఎస్సై ప్రభాకర్‌రెడ్డిని కలవడం తదితర పరిణామాలు చోటు చేసుకున్న విషయం విదితమే. రాజీవ్ ఇబ్బంది పడకూడదని.. రాజీవ్‌ను శిరీష ఎంతో సన్నిహితంగా భావించినట్లు ఈ ఆడియోల్లో స్పష్టమవుతోంది. ఫోన్ సంభాషణలో నందు.. రాజీవ్‌ను ఉద్దేశించి ‘వాడు’అని సంబోధించగా.. దీన్ని శిరీష తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతి సందర్భంలోనూ రాజీవ్ ఇబ్బంది పడకూడదని, అతడికి ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదని శిరీష ప్రయత్నించినట్లు ఆడియో రికార్డుల ద్వారా స్పష్టమవుతోంది. తేజస్విని నుంచి ఎదురైన ఇబ్బందుల వల్ల ఆమెపై పెంచుకున్న ద్వేషంతోనే నందు, నవీన్ ఆమెను ఫోన్లో ఏమని దూషించారో తెలుసుకోవాలని శిరీష భావించింది. వారు తేజస్వినితో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ పంపమని వారిని పదేపదే కోరడం ఆడియోల్లో స్పష్టంగా తెలుస్తోంది. వారిద్దరూ ఎవరు.. నందు, నవీన్ ఎవరు? శిరీష కోరిన మీదట వారు తేజస్వినితో మాట్లాడారా? లేక మాట్లాడామంటూ శిరీషతో చెప్పారా? అనే అంశాలపై పోలీసులు దృష్టి పెట్టారు. శిరీష కాల్ డిటైల్స్ ఆధారంగా వీరిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో అరెసై్టన రాజీవ్, శ్రవణ్‌లను తదుపరి విచారణ నిమిత్తం ఐదు రోజులు కస్టడీకి అప్పగించాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరు కస్టడీలోకి వచ్చిన తర్వాత నందు, నవీన్ వివరాలు రాబట్టాలని నిర్ణయించారు. ఎక్కడివా ఆడియోలు? మీడియాలో హల్చల్ చేస్తున్న శిరీష –నందు –నవీన్ సంభాషణల ఆడి యోలు ఎక్కడివనేది ఇప్పు డు కీలకంగా మారింది. వీటిని ఎవరో ఉద్దేశపూర్వ కంగా లీక్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంభాషణను బట్టి అవి శిరీష, ఆమె స్నేహితుడు నందు ఫోన్ల మధ్య జరిగినట్లు తెలు స్తోంది. వారి ఫోన్లలోనే వీటి రికార్డింగ్‌కు ఆస్కారం ఉంది. శిరీష చనిపోయిన రోజే ఆమె ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని అరెస్టు చేసిన శుక్రవారం వారి ఫోన్లతో పాటు శిరీష ఫోన్‌ను సీజ్ చేశామని, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని పేర్కొంటున్నారు. అయితే మంగళవారం రాత్రి నుంచి ఈ ఆడియోలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే వీటితో తమకు ఎలాంటి సంబంధం లేదని, మీడియాలో వచ్చిన తర్వాతే ఆడియోల విషయం తమకు తెలిసిందని, కొత్తగా తెరపైకి వచ్చిన నందు, నవీన్‌ల విషయం రాజీవ్, శ్రవణ్‌లను కస్టడీలోకి తీసుకున్నాక ఆరా తీస్తామని పోలీసులు చెపుతున్నారు. శిరీష ప్రవర్తనపై మచ్చ తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగానే వీటిని కొందరు లీక్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శిరీష ఫోన్ నుంచి లీక్ అయ్యాయా? లేక రాజీవ్ స్నేహితులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా? అనేది స్పష్టం కావాల్సి ఉంది. శిరీష ఫోన్లో అనేక ఆడియోలు ఉండగా.. వాటిలో ‘ఎంపిక’చేసిన వాటినే లీక్ చేస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. కస్టడీ పిటిషన్లో పలు అంశాలు.. శ్రవణ్, రాజీవ్‌ల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ కేసుకు సంబంధించి కొన్ని కోణాలు వెలికి తీయాలని, అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంలో తేజస్విని పాత్రపై ఆరా తీయాల్సి ఉందని, ఆమెకు, శిరీషకు ఉన్న గొడవలకు కారణాన్ని వెలికితీయాల్సి ఉందని, రాజీవ్–తేజస్విని మధ్య సంబంధాలను ఆరా తీయాల్సి ఉందన్నారు. శిరీష–శ్రవణ్–రాజీవ్ కారులో కుకునూర్‌పల్లి వెళ్లే దారిలో ఏమైందనే దానిపై అనుమానాలు ఉన్నాయని, వాటినీ నివృత్తి చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కుకునూర్‌పల్లి వరకు ఉన్న మార్గంలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు వాటిని నిందితులకు చూపించి ధ్రువీకరించుకోవాల్సి ఉందని పిటిషన్లో ప్రస్తావించారు. కుకునూర్‌పల్లి పోలీసుస్టేషన్లో జరిగిన అంశాలను రూఢీ చేసుకోవాల్సి ఉందని, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి పాత్రపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి నిందితుల్ని విచారించాలని పేర్కొన్నారు. మొదటి కాల్ రికార్డింగ్ నందు: డార్లింగ్. నాకు రికార్డింగ్ అయితే కనపడట్లేదు. శిరీష: నీ పక్కన రవికి ఫోన్ ఇయ్. నందు: రవియా..? నా పక్కన రవి ఎవరూ ఉండరు. నా పక్కన ఉండేది నవీన్. శిరీష: ఊ.. వాడికివ్వు.. నవీన్: హలో.. శిరీష: హలో.. వాడు.. ఇందాక మాట్లాడింది నీతోనే కదా..? నవీన్: ఆఆఆ శిరీష:గుర్తుందా..శిరీషఇందాక మాట్లాడాను.. నవీన్: బాలకృష్ణ.. నాకైతే గుర్తుంది.. నీకైతే గుర్తుందా..? శిరీష: ఆ.. నవీన్: గుర్తుంది.. ఇందాక మాట్లాడా శిరీష నీతోనే.. నేను నవీన్ మాట్లాడేది.నువ్వొక కాల్ రికార్డింగ్ పంపియ్యమన్నావు.. నువ్వే కదా? శిరీష: నేనే నేనే.. వాడికి దాంట్లో ఎక్కడుందో తెలియట్లేదంట. ప్లీజ్ కొంచెం వెతికి పంపించవా? కావాలంటే నంబర్ చెప్తాను దీనిది(తాను మాట్లాడుతున్న ఫోన్‌ది).. నవీన్: ఇప్పుడు ఎవరు.. ఇందాక మాట్లాడిందా? దాన్నైతే(తేజస్విని) గలీజ్ గలీజ్ తిట్టి ––––– ఓకేనా.. శిరీష: తిట్టాడు కానీ నాకు ఆ రికార్డు కావాలి నవీన్: ఓకే తను నీకేమవుద్ది? ఫ్రెండా? ఎనిమీ అయిద్దా? శిరీష: ఎనిమీ.. నా ఎనిమీ అది(తేజస్విని) నవీన్: ఇంక నువ్వు హ్యాపీగా ఉండు. అంత టార్చర్ చూపెట్టాం దానికి.. దానికైతే టార్చర్ చూపెట్టాడు నందు. శిరీష: నాకు రికార్డు కావాలి. ప్లీజ్.. అర్థం చేసుకోండి. ఎందుకు నన్నిలా చేస్తున్నారు? నవీన్: శిరీష, శిరీష.. కాల్ రికార్డింగ్ ఆల్రెడీ ఆన్ ఉందా?(నందుని ఉద్దేశించి అడిగిన నవీన్). సారీ కొత్త ఫోన్ కదా మనోడు ఇంకా రికార్డింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోలే.. శిరీష: ఇందాక దాంట్లో రికార్డింగ్ నోక్కాడు. రికార్డింగ్ ఆప్షన్ ఉంది వాడికి (నందుకు). ఫోన్లో రికార్డు అయింది ఆ.. నవీన్: ఒక్క నిమిషం శిరీష నేనే చెక్ చేస్తా.. ఒక్కసారి లైన్లో అట్లానే ఉండు. నువ్వు వాట్సాప్ నుంచి హాయ్ అని పంపు అట్లానే.. శిరీష: ఆ.. సరే.. రెండో కాల్ రికార్డింగ్.. శిరీష:హలో..హలో..(వెనక నుంచి గందర గో ళంతో కూడిన శబ్దాలు) ఏహే.. వాడు ప్రతి కాల్‌రికార్డింగ్ చేసుకుంటున్నా అన్నాడు నాతో.. నవీన్: లైన్లో అట్లానే ఉండు.. దానికి (తేజస్వినికి) ఫోన్ చేసి కలుపుతా.. నువ్వు కామ్‌గా ఉండు. శిరీష: ఇంకా కెలికితే అది ఫైర్ అయిపోయి ఇష్టం వచ్చినట్లు చేస్తదేమో.. నవీన్: –––– ఏం కాదు. నందు ఉన్నాడు. నేనున్నాకదా. హైదరాబాద్ తోపులం. ఎట్లా అంటే హైదరాబాద్ మనదే ఓకేనా.. శిరీష: ఆహ్హా .. మీద ఫైర్ అవుతుంది కదా.. నవీన్: అట్లంటావా మామూలుగా అయితే దాన్ని కెలుకుతా. లైన్లో కలుపుతా ఓకేనా? శిరీష: ఏయ్ వద్దు ఇంక వదిలేసెయ్యండి. నవీన్: ఏం లేదు ఇప్పుడే మాట్లాడి పెట్టేసినం. అందరం మాట్లాడినం.. నేను, నందు. శిరీష: ఏం మాట్లాడారు? నవీన్: నువ్వెంత? నీ బతుకెంత అని మాట్లాడాడు నందు శిరీష:దాన్నా..? నవీన్: ఆ.. శిరీష: అయితే నువ్వేం మాట్లాడావు? నవీన్: నేను.. నేను ఎవరు నువ్వనుకున్నా? ఈళ్ళ ఫ్రెండేమో అని గుంజుకుంది నేనే ఫోను. ఇప్పుడెందుకులే అని.. నందు మాట్లా డతాడు అంట మాట్లాడు..(ఫోన్ నందుకు ఇచ్చాడు) శిరీష: హలో.. నందు: ఆ చెప్పు.. శిరీష: ఏమని తిట్టావురా దాన్ని.. నందు: నీ కెందుకు.. నీ –––, నీ––– అని తిట్టా ఓకేనా? శిరీష: నా నంబర్ ఎలా వచ్చిందని అడిగిందా? ఏం చెప్పావు? నందు: అదేమీ మాట్లాడలా.. నాకు ఆడు తెలుసు, ఈడు తెలుసు అంది శిరీష: ఏమంది? నందు: నాకు ఆడు తెలుసు ఈడు తెలుసంది.. శిరీష:ఎవడు తెలుసంట? ఏమంటుంది? నీకు నంబర్ ఎవరిచ్చారు? చంపిస్తా? బెదిరిస్తా అంటోందా? నందు: ఎవర్నీ నన్నా.. ఏంటి? శిరీష: ఏమంటోంది అసలు..? నందు: ఏం లేదు సైలెంటైపోయింది. ఇంకోసారి నీకు కాల్ చెయ్యదు. శిరీష:ఆ..నాక్కాదు రాజీవ్‌కి కాల్ చేసి బెదిరిస్తే.. నందు: చెయ్యదు. చేస్తే నాకు చెప్పు.. శిరీష: ఆ.. నందు: చెయ్యదు అన్నాగా..? శిరీష: రాజీవ్‌కు నాకు ఇద్దరికీ చెయ్యదుగా.. ష్యూర్.. నందు: చెయ్యదు. ఓసారి రాజీవ్‌తో ఈ నంబర్‌కు కాల్ చెయ్యమని చెప్పు. శిరీష: ఊ.. సరే చెప్తాలే. ఎందుకు పాపం తనను ఇన్వాల్వ్ చెయ్యడం, తన టెన్షన్స్ తనకు ఉన్నాయి. నందు:ఒకసారి కాల్ చెయ్యమని చెప్పవే వాణ్ణి శిరీష:ఆడు అంటా వేంట్రా? చంపేస్తా.. నందు: కుర్రోడే కదా.. మనోడే కదా.. శిరీష: మనోడైతే రాజీవ్ అనొచ్చుగా.. నందు: నీ––– శిరీష: సరే.. నేను చెయ్యమంటాలే. ఆడు గీడు అనకు నాకు కోపం వస్తది. నువ్వైతే అది నా జోలికి, రాజీవ్ జోలికి రాకుండా చూసుకుంటున్నావుగా.. హలో.. నందు: ఆఆఆ శిరీష: మా ఇద్దరి జోలికి వచ్చిందంటే నేను నిన్నే అడుగుతా.. నందు: సరే సరే.. -
శిరీష కేసులో రోజుకో ట్విస్ట్
హైదరాబాద్: మేకప్ ఆర్టిస్ట్ శిరీష అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన మరో ఆడియో టేపులు సంచనలం రేపుతోంది. రాజీవ్ స్నేహితులతో శిరీష ఫోన్ సంభాషణ టేపులు బయటకు వచ్చాయి. రాజీవ్‌పై తన ప్రేమను ఫోన్లో నవీన్, నందుతో శిరీష చెప్పింది. తనకు రాజీవ్ అంటే ప్రాణం అని పేర్కొంది. రాజీవ్‌ను ఎవరన్నా ఏమన్నా అంటే చంపేస్తానని ఆమె హెచ్చరించింది. రాజీవ్ ప్రియురాలు తేజశ్విని గురించి శిరీష మాట్లాడిన మాటలు ఆడియోలో ఉన్నాయి. తమ మధ్య తేజశ్విని రాకుండా చూడాలని రాజీవ్ స్నేహితులను కోరింది. అయితే ఈ ఆడియో టేపులు ఎవరి బయటపెట్టారనేది వెల్లడికాలేదు. అంతకుముందు విడుదలైన ఆడియో టేపులు తాము విడుదల చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా, శిరీషపై అత్యాచారం జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చిన తర్వాత పూర్తి నిర్ధారణకు రానున్నారు. ఈనెల 12న అర్ధరాత్రి కుకునూర్‌పల్లి పోలీస్ క్వార్టర్లో చోటుచేసుకున్న విషయాలను పోలీసులు రిమాండ్ డైరీలో కోర్టుకు వివరించారు. -
వల్లూరులో విషాద ఛాయలు
ఆచంట: హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బ్యూటీషియన్ ఆరుమిల్లి విజయలక్ష్మి అలియాస్ శిరీష మరణ వార్తతో పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరులో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె భర్త సతీష్ చంద్ర స్వగ్రామం వల్లూరు పంచాయతీ పరిధి మట్టపర్తివారిపాలెం కావడంతో ఆమెకు ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహంపై గాయాలు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. శిరీష మృతదేహాన్ని చూసిన స్థానికులు, బంధువులు కంటతడిపెట్టారు. అంత్యక్రియలకు శిరీష తల్లిదండ్రులతోపాటు బంధువులు హాజరయ్యారు. దాదాపు 15 ఏళ్ల క్రితం శిరీష, సతీష్ చంద్రకు వివాహమైంది. వారిద్దరూ అన్యోన్యంగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్నా తరచుగా స్థానికంగా జరిగే కార్యక్రమాలకు వచ్చేవారని బంధువులు తెలిపారు. ఆరు నెలల క్రితమే వల్లూరులో బంధువుల వివాహ కార్యక్రమానికి భర్తతో హాజరైన శిరీష విగతజీవిగా ఇక్కడకు రావడాన్ని గ్రామస్తులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. నా భార్యను హత్యచేశారు: శిరీష భర్త తన భార్య శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని భర్త సతీష్ చంద్ర ఆరోపించాడు. స్టూడియో యజమాని వల్లభనేని రాజీవ్‌ను విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాడు.