‘శిరీష’ భయంతోనే ఎస్‌ఐ ఆత్మహత్య
డీజీపీకి చేరిన పూర్తి నివేదిక
సాక్షి, హైదరాబాద్: కుకునూర్ పల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్‌రెడ్డి శిరీష వ్యవహారం వల్లనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని విచారణాధికారి, అదనపు డీజీపీ గోపీకృష్ణ డీజీపీ అనురాగ్‌శర్మకు నివేదిక సమర్పించినట్టు తెలిసింది. శిరీషతో అసభ్యకరంగా ప్రవర్తించడంవల్లే ఆమె చనిపోయి ఉంటుందన్న భయంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని విచారణాధికారి రిపోర్ట్‌లో స్పష్టంచేశారు. గత నెల 14న ఉదయం 10 గంటల సమయంలో బంజారాహిల్స్ ఎస్‌ఐ హరీందర్‌తో ప్రభాకర్‌రెడ్డి ఫోన్‌లో శిరీష ఆత్మహత్య గురించి మాట్లాడినట్టు నివేదికలో స్పష్టం చేశారు.
అదే రోజు ఉదయం 10.50–11.00 గంటల మధ్య తన క్వార్ట ర్స్‌లోనే రివాల్వర్‌తో కాల్చుకొని చనిపోయినట్టు తెలి పారు. ఈ వ్యవహారంలో 27 మంది అధికారులు, సిబ్బం దిని గోపీకృష్ణ విచారించారు. అదే విధంగా గజ్వేల్ ఏసీపీ గిరిధర్ ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డిని పలుసార్లు టార్గెట్ చేసుకొని వేధించినట్టు నివేదికలో స్పష్టంచేశారు.ఈ కేసులో అల్లర్లకు కారకులైన ఇద్దరు కానిస్టేబుళ్లపై ఇప్పటికే పోలీస్ శాఖ చర్య తీసుకుందని, మిగతా ప్రైవేట్ వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నట్టు తెలిపారు.